సాక్షి, హైదరాబాద్: కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావు ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చి న తీర్పుతో బీఆర్‌ఎస్‌లో వింత పరిస్థితి నెలకొంది. మూడు రోజుల క్రితం ఇ చ్చి న తీర్పుపై వనమా చే సుకున్న అప్పీల్‌ను హైకోర్టు కొట్టివేయడంతో జల గం వెంకట్రావు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని వనమా చెప్తుండగా, హైకో ర్టు తీర్పును అమలు చేయాలని జలగం కోరుతున్నారు.
ఈ మేరకు ఆయన హైకోర్టు తీర్పు ప్రతిని బుధవారం అసెంబ్లీ కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి కూడా అందజేసిన విషయం తెలిసిందే. జలగంకు అనుకూలంగా హైకోర్టు ఇచ్చి న తీర్పుపై అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం, ఎన్నికల కమిషన్ ఎప్పటిలోగా, ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇద్దరు నేతలూ బీఆర్‌ఎస్‌లోనే..
కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2018లో బీఆర్‌ఎస్ నుంచి జలగం వెంకట్రావు, కాంగ్రెస్ నుంచి వనమా వెంకటేశ్వర్‌రావు పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందిన వనమా ఆ తర్వాత బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం వనమా, జలగం.. ఇద్దరూ ఒకే పార్టీలో కొనసాగుతున్నారు. జలగం బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నా అధికారిక కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉంటూ వస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ నేపథ్యంలో 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా నుంచి బీఆర్‌ఎస్ తరపున గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావు గుర్తింపు పొందారు. ప్రస్తుతం కోర్టు తీర్పు మేరకు తాను ఎమ్మెల్యేగా పదవి స్వీకరించినా బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని జలగం ప్రకటించారు.
అయితే ఈ అంశంపై బీఆర్‌ఎస్ నుంచి అధికారికంగా ఎలాంటి స్పందన వెలువడలేదు. కోర్టు తీర్పు నేపథ్యంలో సీఎం కేసీఆర్ అపాయింట్‌మెంట్ కోసం జలగం ప్రయతి్నంచినట్లు తెలుస్తోంది. అయితే పార్టీ పూర్తిగా తమ వెంటే ఉందని వనమా వర్గీయులు ‘సాక్షి’తో అన్నారు. జలగం ప్రమాణ స్వీకారంపై స్పష్టత వ చ్చి న తర్వాతే స్పందించాలని బీఆర్‌ఎస్ అధినేత భావిస్తున్నట్లు తెలిసింది.
వనమాపై ఐదేళ్ల నిషేధం నేపథ్యంలో..
వనమా ఎన్నిక చెల్లదని తీర్పుని చ్చి న హైకోర్టు ఆయన ఐదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించింది. దీంతో వచ్చే ఎన్నికల్లోనూ తనకు బీఆర్‌ఎస్ టికెట్ లభిస్తుందని జలగం భావిస్తున్నారు. మరోవైపు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్‌రావు కూడా కొత్తగూడెం బీఆర్‌ఎస్ టికెట్‌ను ఆశిస్తున్నారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో కొత్తగూడెం రాజకీయాలతో బీఆర్‌ఎస్‌లో వింత స్థితి నెలకొందని పరిశీలకులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment