venkateshwar rao
-
అటు వనమా.. ఇటు జలగం..
సాక్షి, హైదరాబాద్: కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్రావు ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చి న తీర్పుతో బీఆర్ఎస్లో వింత పరిస్థితి నెలకొంది. మూడు రోజుల క్రితం ఇ చ్చి న తీర్పుపై వనమా చే సుకున్న అప్పీల్‌ను హైకోర్టు కొట్టివేయడంతో జల గం వెంకట్రావు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని వనమా చెప్తుండగా, హైకో ర్టు తీర్పును అమలు చేయాలని జలగం కోరుతున్నారు. ఈ మేరకు ఆయన హైకోర్టు తీర్పు ప్రతిని బుధవారం అసెంబ్లీ కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి కూడా అందజేసిన విషయం తెలిసిందే. జలగంకు అనుకూలంగా హైకోర్టు ఇచ్చి న తీర్పుపై అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం, ఎన్నికల కమిషన్ ఎప్పటిలోగా, ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇద్దరు నేతలూ బీఆర్ఎస్లోనే.. కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2018లో బీఆర్ఎస్ నుంచి జలగం వెంకట్రావు, కాంగ్రెస్ నుంచి వనమా వెంకటేశ్వర్రావు పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందిన వనమా ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం వనమా, జలగం.. ఇద్దరూ ఒకే పార్టీలో కొనసాగుతున్నారు. జలగం బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నా అధికారిక కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉంటూ వస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ నేపథ్యంలో 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్ తరపున గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావు గుర్తింపు పొందారు. ప్రస్తుతం కోర్టు తీర్పు మేరకు తాను ఎమ్మెల్యేగా పదవి స్వీకరించినా బీఆర్ఎస్లోనే కొనసాగుతానని జలగం ప్రకటించారు. అయితే ఈ అంశంపై బీఆర్ఎస్ నుంచి అధికారికంగా ఎలాంటి స్పందన వెలువడలేదు. కోర్టు తీర్పు నేపథ్యంలో సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం జలగం ప్రయతి్నంచినట్లు తెలుస్తోంది. అయితే పార్టీ పూర్తిగా తమ వెంటే ఉందని వనమా వర్గీయులు ‘సాక్షి’తో అన్నారు. జలగం ప్రమాణ స్వీకారంపై స్పష్టత వ చ్చి న తర్వాతే స్పందించాలని బీఆర్ఎస్ అధినేత భావిస్తున్నట్లు తెలిసింది. వనమాపై ఐదేళ్ల నిషేధం నేపథ్యంలో.. వనమా ఎన్నిక చెల్లదని తీర్పుని చ్చి న హైకోర్టు ఆయన ఐదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించింది. దీంతో వచ్చే ఎన్నికల్లోనూ తనకు బీఆర్ఎస్ టికెట్ లభిస్తుందని జలగం భావిస్తున్నారు. మరోవైపు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్‌రావు కూడా కొత్తగూడెం బీఆర్ఎస్ టికెట్‌ను ఆశిస్తున్నారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో కొత్తగూడెం రాజకీయాలతో బీఆర్ఎస్లో వింత స్థితి నెలకొందని పరిశీలకులు అంటున్నారు. -
హాట్ టాపిక్‌గా ఖమ్మం పాలిటిక్స్.. అప్పుడు తండ్రి.. ఇప్పుడు కుమారుడు
సత్తుపల్లి: ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గానికి 1979లో జరిగిన ఉపఎన్నికలో 14 వేల ఓట్ల మెజార్టీతో ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన జ్యేష్ట వెంకటేశ్వరరావు అసెంబ్లీకి వెళ్లకుండానే వేటు పడింది. తాజాగా 2018 ఎన్నికల్లో కొత్తగూడెం ఎమ్మెల్యేగా గెలిచిన వనమా వెంకటేశ్వరరావుపై ఇప్పుడు వేటు పడింది. నాటి ఘటనలో మాజీ సీఎం వెంగళరావు వ్యూహాత్మకంగా వ్యవహరించగా.. ఇప్పుడు ఆయన కుమారుడు జలగం వెంకట్రావు అదే పంథాను అనుసరించడం చర్చనీయాంశంగా మారింది. ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందంటే.. 1978లో జరిగిన ఎన్నికల్లో జలగం వెంగళరావు కాంగ్రెస్(ఆర్) నుంచి, కాళోజీ నారాయణరావు ఉభయ కమ్యూనిస్టు పార్టీల నుంచి, న్యాయవాది శాంతారావు ఇందిరా కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగారు. ఈ ఎన్నికలో జలగం వెంగళరావు అత్యధిక మెజార్టీతో సత్తుపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఎమర్జెన్సీ సమయాన సీఎంగా జలగం వెంగళరావు ప్రజాస్వామ్య హక్కులకు భంగం కల్పించారనే ఆరోపణలతో అప్పటి సీనియర్ నేత చేకూరి కాశయ్య కేంద్రానికి ఫిర్యాదు చేశారు. దీంతో నాటి జనతా ప్రభుత్వం జలగం వెంగళరావుపై విచారణకు విమద్‌లాల్ కమిషన్‌ను నియమించింది. దీంతో వెంగళరావు నైతిక బాధ్యత వహిస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. జ్యేష్ట వెంకటేశ్వరరావు విజయం.. 1979లో జరిగిన ఉప ఎన్నికలో జ్యేష్ట వెంకటేశ్వరరావు ఇందిరా కాంగ్రెస్ నుంచి పోటీపడగా జలగం వెంగళరావు అనుచరుడైన ఉడతనేని సత్యం ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీ పడ్డారు. ఆ ఉప ఎన్నికలో జ్యేష్ట వెంకటేశ్వరరావు విజయం సాధించారు. అయితే, ఆయన ఎన్నికల నియమావళికి విరుద్ధంగా డబ్బు ఖర్చు పెట్టారని జలగం వెంగళరావు ముఖ్య అనుచరుడు ఒగ్గు బస్విరెడ్డి కోర్టును ఆశ్రయించటంతో విచారణకు ఆదేశాలు వచ్చాయి. ఈ విచారణ నాలుగేళ్లు సాగడంతో ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయకుండానే పదవీకాలం ముగిసిపోయింది. ఇప్పుడు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై జలగం వెంగళరావు కుమారుడు వెంకట్రావు కోర్టును ఆశ్రయించడంతో ఎ న్ని కలకు నాలుగు నెలల ముందు ఆయనపై వేటు వేస్తూ తీర్పు వెలువడింది. ఇది కూడా చదవండి: తెలంగాణలో కాంగ్రెస్‌కు షాక్.. బీజేపీలోకి సీనియర్ నేతలు! -
‘మాన్సాస్’ నుంచి నన్ను తప్పించండి
విజయనగరం: మాన్సాస్ ట్రస్ట్‌పై సర్వాధికారాల కోసం కేంద్ర మాజీమంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు ఆరాటపడుతున్నారా? ఈ విషయంలో అధికారులపై తీవ్రస్థాయిలో వేధింపులకు గురిచేస్తున్నారా?.. ప్రస్తుత పరిస్థితులు పరిశీలిస్తే వీటన్నింటికీ అవుననే సమాధానం వస్తోంది. ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ నిబద్ధతతో పనిచేస్తున్న డిప్యూటీ కలెక్టర్ హోదా కలిగిన మాన్సాస్ ట్రస్ట్ ఈవో డి. వెంకటేశ్వరరావుకు కనీస సహకారం అందించకపోగా.. తాము చెప్పినట్లే నడుచుకోవాలంటూ ట్రస్ట్ చైర్మన్ వర్గాల నుంచి ఒత్తిడి తీవ్రమవుతోంది. ఇది తట్టుకోలేని ఆయన ఆ బాధ్యతల నుంచి తప్పుకునేందుకు సిద్ధపడ్డారు. ఈ మేరకు గత నెల 31న రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ రాశారు. ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మాన్సాస్ ట్రస్ట్ ఈవోగా విధులు నిర్వహిస్తున్న తనను వ్యక్తిగత సమస్యల కారణంగా తిరిగి రెవెన్యూ విభాగానికి పంపించాలంటూ లేఖలో కోరారు. అప్పటి నుంచి ఈవో టార్గెట్? గత తొమ్మిది నెలలుగా ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయనను ట్రస్ట్ చైర్మన్‌గా అశోక్‌గజపతిరాజు తిరిగి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఇంకోవైపు.. ట్రస్ట్ సిబ్బంది జీతాల చెల్లింపులో జాప్యానికి ఈవోయే కారణమంటూ అశోక్‌గజపతిరాజు వర్గీయులు ఉద్యోగులందరినీ రెచ్చగొట్టారు. ఆయనపై భౌతికదాడి చేయించేందుకు సైతం సిద్ధమైనట్లు కూడా ఆరోపణలున్నాయి. కొనసాగుతున్న విజిలెన్స్ విచారణ అధికారులు అడిగిన రికార్డులు అందిస్తాం ∙సింహాచలం దేవస్థానం ఈవో సూర్యకళ సింహాచలం (పెందుర్తి): శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికి చెందిన ఆస్తుల జాబితా నుంచి టీడీపీ ప్రభుత్వ హయాంలో 862.22 ఎకరాలు తప్పించడంపై విజిలెన్స్– ఎన్ఫోర్స్మెంట్ విచారణ కొనసాగుతోందని ఆలయ ఈవో సూర్యకళ తెలిపారు. వారు అడిగిన రికార్డులను దేవస్థానం తరఫున అందజేస్తామని చెప్పారు. సింహాచలం దేవస్థానం కార్యాలయంలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. రికార్డుల నుంచి భూములు ఎలా తొలగింపునకు గురయ్యాయని అధికారులు అడిగారన్నారు. అలాగే ఆ భూములు ఏ పట్టా ప్రకారం దేవస్థానానికి దఖలు పడ్డాయన్న విషయంపై లిఖితపూర్వకంగా వివరాలు ఇవ్వాలని అధికారులు కోరారని తెలిపారు. అప్పటి ఈవో హయాంలో జరిగిన ఫిక్స్డ్ డిపాజిట్లు, కోర్టు కేసులు, తదితర వివరాలను కూడా విజిలెన్స్ అధికారులు అడిగారని చెప్పారు. ఇప్పటికే భూములకు సంబంధించిన రిపోర్టు సిద్ధంగా ఉందన్నారు. ఎఫ్డీలు, కోర్టు కేసుల నివేదికను తయారు చేస్తున్నామని తెలిపారు. రెండు రోజుల్లో మొత్తం రిపోర్టు అందజేస్తామన్నారు. -
చంద్రబాబు నుంచి ప్రాణ హాని..
తిరుపతి క్రైం: ప్రతిపక్ష నేత చంద్రబాబు వల్ల తనకు ప్రాణ హాని ఉందని టీడీపీ నాయకుడు ఆకుల వెంకటేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. తనను చంపేస్తామని తెలుగుదేశం ముఖ్య నాయకుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పారు. మంగళవారం రాత్రి ఆయన తిరుపతి వెస్టు పోలీసులకు ఈ మేరకు ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. 30 ఏళ్లుగా తాను తెలుగుదేశం పార్టీలో కష్టపడి పని చేశానన్నారు. అయితే చంద్రబాబు, అచ్చెన్నాయుడు గుర్తించక పోవడమే కాకుండా చిన్నపాటి సహాయం కూడా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈయన ఇంకా ఏమన్నారంటే.. ►చంద్రబాబుకు, అచ్చెన్నాయుడుకు అత్యంత సన్నిహితుడైన కేఎల్ నారాయణ అనే వ్యక్తి జూబ్లీ హిల్స్‌లోని నా 400 గజాల భూమిని కబ్జా చేశాడు. దీనిపై చంద్రబాబుతో పాటు బాలకృష్ణకు కూడా పలుమార్లు మొర పెట్టుకున్నాను. ►చంద్రబాబు ఒక మాట చెబితే నా భూమి నాకు నిమిషాల్లో వస్తుంది. అయితే ఆయన ఆ మాట చెప్పకుండా కబ్జాదారులతో కుమ్మక్కు అయ్యారు. ఈ విషయంపై మరో మారు విన్నవిద్దామని సోమవారం తిరుపతిలో జరిగిన ప్రచార సభకు హాజరయ్యాను. ►పలు మార్లు చంద్రబాబునాయుడును పిలిచినా కూడా చూసీ చూడనట్టు వ్యవహరించడంతో నేను తీవ్ర మనస్తాపానికి గురయ్యాను. ఈ క్రమంలో నిరసన తెలియజేసేందుకు చొక్కా విప్పి విసిరేశాను. అయినా కూడా పట్టించుకోక పోవడంతో ముందుకెళ్లి నిలదీశాను. తనకు ఏమీ పట్టనట్టుగా అభివాదం చేస్తూ తప్పించుకుని పారిపోయాడు. ►చంద్రబాబు వెనుక ఉన్న రామ్మోహన్నాయుడు ‘అన్నా నేను నీతో మాట్లాడుతా’ అని నన్ను నమ్మించే ప్రయత్నం చేశారు. చొక్కా విసరడం అందరూ చూడడంతో ఆ సంఘటనను పెడదారి పట్టించేందుకే చంద్రబాబుపై రాళ్లు పడ్డాయంటూ కొద్దిసేపటికే కొత్త డ్రామా ప్రారంభించారు. ►బాబుపై ఎలాంటి రాళ్లూ పడలేదు. బాబు ఇలాంటి నీచమైన రాజకీయాలు చేయడం సహజమే. నేను 30 సంవత్సరాలుగా టీడీపీలోనే ఉంటూ ఒకసారి జూబ్లీ హిల్స్‌లో కార్పొరేటర్‌గా కూడా పోటీ చేశాను. ఈ పరిస్థితిలో చంద్రబాబు వల్ల నాకు ప్రాణ హాని ఉంది. మరోవైపు టీడీపీ ముఖ్య నాయకులు చంపేస్తామని ఫోన్లు చేస్తున్నారు. అందుకే నాకు రక్షణ కల్పించాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశాను. నారా లోకేష్‌ను ఏదైనా సాయం చేయమని కోరితే ఇంటిల్లిపాది కట్టకట్టుకుని చావమంటూ సలహా ఇచ్చారు. వీరిని నమ్మి ఎవరూ మోసపోవద్దు. చదవండి: 17 తర్వాత పార్టీ లేదు.. తొక్కా లేదు ఓటమి భయంతోనే రాళ్ల దాడి డ్రామా -
17 తర్వాత పార్టీ లేదు.. తొక్కా లేదు
సాక్షి, అమరావతి: ‘పార్టీ లేదు... బొ.. లేదు..! అంతా అయిపోయింది...! ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నాం కాబట్టి పట్టుబట్టి ఉంటున్నాం...!’ టీడీపీ గురించి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలివీ. లోకేష్‌పైనా ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆ మనిషే సరిగా ఉంటే పార్టీకి ఈ పరిస్థితి ఎందుకు వస్తుందని నిర్వేదం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకుడు ఆకుల వెంకటేశ్వరరావుతో అచ్చెన్నాయుడు ఇటీవల తిరుపతిలోని ఓ హోటల్లో ఉన్నప్పుడు ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియో బహిర్గతమై ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడం తెలుగుదేశం పార్టీలో కలకలం రేపుతోంది. పార్టీ అధ్యక్షుడే పార్టీ గురించి చేసిన వ్యాఖ్యలు టీడీపీ దయనీయ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఆ పార్టీ తీవ్ర నిస్తేజంలో కూరుకుపోయింది. చంద్రబాబు పార్టీ నడిపిస్తున్న తీరును సీనియర్ నాయకులే తప్పు బడుతున్నారు. ఆయనపై నమ్మకం కోల్పోయి, పార్టీకి భవిష్యత్తు లేదని గ్రహించి ఇప్పటికే చాలామంది నేతలు టీడీపీని వీడారు. గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో నలుగురు టీడీపీకి రాజీనామా చేశారు. మిగిలిన వారు సైతం పార్టీతో అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. 80 శాతం మంది నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు స్తబ్దుగా ఉంటూ కార్యకలాపాలే నిర్వహించడంలేదు. చంద్రబాబు ఏదైనా పిలుపు ఇస్తే సోషల్ మీడియా, అనుకూల మీడియాలో హడావుడే తప్ప క్షేత్రస్థాయిలో పట్టించుకునే దిక్కులేదు. పార్టీ క్యాడర్ మొత్తం నీరుగారిపోయింది. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో టీడీపీ ముందుగానే చేతులెత్తేసింది. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోని మెజారిటీ పంచాయతీల్లో సైతం దారుణంగా ఓటమి పాలైంది. మున్సిపల్ ఎన్నికల్లో అయితే పూర్తిగా జీరో అయిపోయింది. 11 కార్పొరేషన్లు, 75 మున్సిపాల్టీలకు ఎన్నికలు జరిగితే ఒకే ఒక్క మున్సిపాల్టీలో అతికష్టం మీద గట్టెక్కిందంటే టీడీపీ దుస్థితి అర్థం చేసుకోవచ్చు. అచ్చెన్న వ్యాఖ్యలే నిదర్శనం.. తిరుపతి ఉప ఎన్నికలోనూ గెలుస్తామనే ఆశ ఏ టీడీపీ నాయకుడిలోనూ కనిపించడంలేదు. స్వయంగా అచ్చెన్నాయుడు చేసిన తాజా వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. 17న తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ తర్వాత ఇక ఏమీ ఉండదని, పార్టీ పని అయిపోయిందని ఆయన వ్యాఖ్యానించడాన్ని బట్టి టీడీపీకి భవిష్యత్తు లేదని స్పష్టమవుతోంది. తన కుటుంబం మొత్తాన్ని సూసైడ్ చేసుకోవాలని లోకేష్ అన్నాడని టీడీపీ నేత ఆకుల వెంకట్ అచ్చెన్నతో వాపోవడం కలకలం రేపుతోంది. న్యాయం చేయాలంటూ చంద్రబాబును నిలదీస్తున్న వెంకట్. (ఇన్సెట్)లో మీడియాతో మాట్లాడుతున్న వెంకట్ లీకైన వీడియోలో అచ్చెన్నాయుడు, వెంకట్ సంభాషణ ఇదీ.. అచ్చెన్న : నేను కూడా చెబుతా... బాధపడుతున్నాడని! వెంకట్ : చేయరండీ వీళ్లెవరూ... లోకేష్‌ను కాదని వీళ్లెవరూ చేయరు. ఎందుకంటే బాలకృష్ణ ఇంటికెళ్లా. చూసి వెళ్లిపోయాడు. ఫోన్ చేసి మెసేజ్‌లు కూడా పెట్టా. అచ్చెన్న : ఎవరికి? వెంకట్ : బాలకృష్ణకి.. అడిగా.. అసలు నేను చేసిన తప్పేంటండీ? అని.. నాది నాకు చెయ్యడానికి వాళ్లు అంతలా ఇబ్బంది పడుతున్నారంటే... అచ్చెన్న : మరింక వద్దు.. ఇంక మనం అనుకోవడానికి కాదు గానీ.. చెబుతా. బాలకృష్ణకి కూడా నువ్వు తెలుసంట బాగా. వెంకట్ : తెలుసు. ఎందుకంటే 94లో నేనేగా తిప్పా. నా ఎలక్షన్‌కు కూడా వచ్చాడు. అచ్చెన్న : పెద్ద గందరగోళంగా ఉంది ఇదంతా.. ఏంచేయాలో ఏమీ అర్థం కావడంలేదు పార్టీ పరిస్థితి కూడా...! వెంకట్ : ఇంకేం పార్టీ సర్?.. లోకేష్‌గాడు ఉన్నంత వరకూ. బాలకృష్ణకి డైరెక్ట్‌గా చెప్పా నేను. అచ్చెన్న : ఎందుకు అవన్నీ..? లోకేష్ గురించి వెంకట్ : అది ఎంత తప్పండి..? నన్ను సూసైడ్ చేసుకోమంటాడా? 30 సంవత్సరాలు పార్టీని నమ్ముకుని సర్వీస్ చేసినందుకు. నా ఫోన్ కూడాఎత్తడం మానేశారు. రాజగోపాల్‌కి చేశా. రమేష్‌కి చేశా. ఎవరూ ఎత్తడంలేదు. అచ్చెన్న : 17 తర్వాత ఫ్రీ అయిపోతాం. ఇక పార్టీ లేదు... బొ. లేదు..! వెంకట్ : అయిపోయింది సర్ పార్టీ పని అయిపోయింది.. జీరో అయిపోయింది. మీరు ఏమైనా అనుకోండి.. అచ్చెన్న : అయిపోయింది... జీరో అయిపోతే ఏం..? ఎప్పటి నుంచో పట్టు పట్టుపట్టి ఉన్నాం కాబట్టి అలా వెళుతున్నాం! వెంకట్ : మరీ ఇంత అన్యాయమా సర్? 30 సంవత్సరాలు సర్వీసు చేసినందుకు కనీసం ఫోన్లు ఎత్తడం మానేశారు. ఏమన్నా అంటే లోకేష్... సూసైడ్ చేస్తే చేసుకోండి ఫ్యామిలీ మొత్తం అంటాడు. ఆ రోజు పార్టీ ఆఫీసులోకి రాము తీసుకెళ్లాడు లోకేష్ దగ్గరకు.. ఆరోజు కలిశాంగా.. స్టేట్ పార్టీ మీటింగ్‌లో.. పెద్దాయన్ను కలిశాంగా..! అచ్చెన్న : ఏది విజయవాడలోనా..! వెంకట్ : ఆ.. లోకేష్ దగ్గరకు తీసుకెళ్లాడు. వెళితే కనీసం.. ఇంతకుముందు అన్నా అనేవాడు.. వెళ్లి అక్కడ కూర్చోమ్మా అని అంటున్నాడు. మా ఇంటికి సైకిల్ గురించి వచ్చాడు. మరీ అంత అన్యాయమా సర్..? ఆడికి ఎంత సర్వీసు చేశా? అచ్చెన్న : నీకనే కాదు.. అందరికీ అలాగే ఉంది. నీకే కాదు.. ఎవడి బాధలు ఆడు చెప్పుకుంటున్నాడు. సరే.. సరే.. సరే.. వెంకట్ : అది కాదు సర్.. నేను పూర్తిగా రోడ్డు మీద పడిపోయా. వాళ్లు నాకేం చేయొద్దు. నాకు రావాల్సిన దాని గురించి ఒక మాట చెబితే 3 కోట్లు ఇస్తారు. మొత్తం 6 కోట్లు అది. ఒక్కమాట.. అచ్చెన్న : ఎవరు అది? వెంకట్ : కేఎల్ నారాయణ. ఇంకోమాట చెబుతున్నా... కేఎల్ నారాయణ ఇవ్వకపోతే ఏం చేయాలో నాకు తెలుసు. మొత్తం 1,200 కోట్లు అది. మొత్తం స్మాష్ చేస్తా. అచ్చెన్న : చెప్పిద్దాం. సార్‌తో ఒక మాట చెప్పిద్దాం వెంకట్ : ఏం చెబుతాడు సార్? ఆరోజు మూడుసార్లు కలిశాను సార్.. ఎన్టీఆర్ ఘాట్‌లో. నీకెందుకమ్మా నేను చేస్తా అని పెద్దాయన మాటిచ్చాడు. వీడేమో.. లోకేష్ గాడు.. వాడిని పలకరిస్తే దొంగోణ్ణి చూసినట్లు చూస్తున్నాడు. మరీ అంత అన్యాయమా సర్? వాడికి ఎంత సర్వీసు చేశా? అచ్చెన్న : అదే వద్దంటాను.. నాకూ ఆవేశం ఉంది. రోడ్డు మీద పడిపోతామా? వెంకట్ : అదికాదు సర్... మనిషికి కనీసం విలువ ఇవ్వాలి కదా? అచ్చెన్న : ఒగ్గేయ్.. ఆ మనిషి బాగుంటే ఎందుకు ఈ పరిస్థితి మనకి? పార్టీకి ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? వెంకట్ : రోడ్డు మీదకు వచ్చేశాను సార్.. ఫ్యామిలీతో రోడ్డు మీదకు వచ్చేశా...! బయటపడ్డ అసంతృప్తి లోకేష్ వ్యవహార శైలిపై టీడీపీలో ఎంత అసంతృప్తి, ఆగ్రహం ఉందో తాజాగా అచ్చెన్నాయుడు, వెంకట్ మాట్లాడుకుంటున్న వీడియో సంభాషణ ద్వారా బయటపడింది. తనను ఎత్తుకుని తిప్పిన వ్యక్తిని ‘ఏమ్మా..?’ అని పిలిచాడంటే లోకేష్‌కు ఎంత గర్వమో అర్థం చేసుకోవచ్చని పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. అచ్చెన్నాయుడు, యనమల లాంటి నాయకులను లోకేష్ అవమానిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే లోకేష్ సరిగా ఉంటే పార్టీ పరిస్థితి ఇలా ఎందుకు ఉంటుందని అచ్చెన్న అసహనం వ్యక్తం చేసినట్లు స్పష్టమవుతోంది. సీనియర్ నాయకులకు ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా అంతా తాను చెప్పినట్లే చేయాలని, అందరూ తన కనుసన్నల్లో ఉండాలంటూ దర్పం ప్రదర్శిస్తుండడాన్ని పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నట్లు చెబుతున్నారు. తనయుడి వ్యవహార శైలి గురించి తెలిసినా పార్టీ వ్యవహారాలను చంద్రబాబు ఆయనకే అప్పగించడం, భవిష్యత్తు నాయకుడు ఆయనేనని చెబుతుండడంతో పార్టీ నాయకులు హడలెత్తిపోతున్నారు. ఇప్పటికే అసమర్థుడిగా, జనంలో పప్పుగా ముద్రపడిన వ్యక్తి చేతుల్లో పార్టీని పెడితే పరిస్థితి ఏమిటనే చర్చ అన్ని స్థాయిల్లోనూ తరచూ జరుగుతోంది. -
తల్లిదండ్రులపై ‘కృషి’ వెంకటేశ్వరరావు దాడి
సాక్షి, విజయవాడ : కృషి బ్యాంకు కుంభకోణం సూత్రధారి కోసరాజు వెంకటేశ్వరరావుపై ఆయన తల్లిదండ్రులే కేసు పెట్టారు. కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం వెంట్రప్రగడకు చెందిన కోసరాజు జయసింహ-బేబి సరోజినీలపై వారి కొడుకులైన వెంకటేశ్వరరావు, వేణుగోపాల్‌లు దాడికి పాల్పడ్డారు. తల్లిదండ్రుల ఫిర్యాదుమేరకు ఇద్దరు కొడుకులపై పెదపారుపూడి పోలీసులు కేసు నమోదుచేశారు. ఆస్తి విషయంలో తలెత్తిన విబేధాలే దాడికి కారణమని తెలిసింది. కృషి బ్యాంకు కుంభకోణంలో ప్రధాన నిందితుడు వెంకటేశ్వరరావు. బ్యాంకు డిపాజిటర్లకు ఎక్కువ మొత్తంలో వడ్డీ(16.5 శాతం) ఇస్తానని ఆశలు చూపి భారీ కుంభకోణానికి పాల్పడ్డాడు. కుంభకోణం వెలుగులోకి రావడంతో చాకచక్యంగా 2001 జూలైలో భార్యతో కలిసి యూకే పారిపోయాడు. అక్కడ పౌరసత్వం రాకపోవడంతో మళ్లీ థాయిలాండ్‌కు పారిపోయాడు. ఈ విషయం హైదరాబాద్ పోలీసులకు తెలియడంతో బ్యాంకాక్ పోలీసులు, ఇంటర్ పోల్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో 2005లో బ్యాంకాక్‌లో వెంకటేశ్వర రావును అరెస్ట్ చేశారు. 2006, జూన్‌లో హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. తల్లిదండ్రులపై దాడికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది. -
‘రేసుగుర్రం’ రేసులో లేదా?
2014, 2015, 2016 సంవత్సరాలకుగాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డులు ప్రకటించడం, ఎంపిక పారదర్శకంగా జరగలేదని విమర్శలు రావడం తెలిసిందే. ఈ విషయమై నిర్మాతలు కె. వెంకటేశ్వరరావు, నల్లమలుపు బుజ్జి, దర్శకుడు గుణశేఖర్ గురువారం మీడియాతో మాట్లాడారు. మెగాఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ లేదు – నిర్మాత కె. వెంకటేశ్వరరావు అల్లు అర్జున్ హీరోగా నేను, నల్లమలుపు బుజ్జి 2014లో నిర్మించిన ‘రేసుగుర్రం’ ఎంత హిట్ అయిందో.. ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిందో తెలిసిందే. ఈ సినిమాకు బెస్ట్ యాక్టర్‌గా అల్లు అర్జున్ సైమా, ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు. బెస్ట్ కొరియోగ్రాఫర్, ‘సినిమా చూపిస్త మామ...’ సాంగ్‌కు బెస్ట్ సింగర్ అవార్డులనూ సైమా ఇచ్చింది. అంత మంచి సినిమాకు నంది అవార్డు రాకపోవడం అన్యాయం. ఏపీ ప్రభుత్వం ఏ ప్రాతిపదికన నంది అవార్డులు ఇచ్చిందో అర్థం కావడం లేదు. మంచి జ్యూరీ మెంబర్స్‌ని నియమించి, సినిమాను ఒకటికి నాలుగు సార్లు చూడాలి. 24 క్రా‹ఫ్ట్స్ పరిశీలించి, బాగున్న దానికి అవార్డులు ఇస్తే మాలాంటి నిర్మాతలకు ఆనందంగా ఉంటుంది. నంది అవార్డులు మాకే రావాలని కాదు. బెస్ట్ మూవీకి రావాలన్నదే మా అభిప్రాయం. అవార్డుల కోసమే అయితే ప్రెస్‌మీట్ పెట్టి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ‘నంది అవార్డుల కోసం రోడ్డు మీద పడకండి’ అని నిర్మాత సి.కల్యాణ్ అనడం తప్పు. ఆయన తీసిన సూపర్ హిట్ సినిమాకు అవార్డు రాకపోతే ఆ బాధ తెలుస్తుంది. ‘రుద్రమదేవి’ సినిమాకు సరైన అవార్డులు రాలేదు. నాగేశ్వరరావుగారు నటించిన ‘మనం’ చిత్రానికి కూడా అవార్డు ఇవ్వకపోవ డాన్ని అన్యాయంగానే భావిస్తున్నాం. ‘రుద్రమదేవి’, ‘మనం’, ‘బాహుబలి’ వంటి చరిత్రలో నిలిచిపోయే సినిమా లకు సరైన అవార్డులు రాలేదు. కమిటీ మెంబర్లు ఇంకా బాగా ఆలోచిస్తే మిగతా సినిమాలకీ మంచి అవార్డులు వచ్చేవి. మంచి సినిమాలకు అవార్డుల కోసం లాబీయింగ్ చేయాల్సిన అవసరం లేదు. జ్యూరీ మెంబర్స్‌ని తప్పుపట్టడం లేదు. మాకు అర్హత ఉన్నా అవార్డులు రాలేదని చెబుతున్నాం. ఇందులో మెగా ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు. కడుపు మండి వచ్చాను! – నల్లమలుపు బుజ్జి మంచి విజయం సాధించిన ‘రేసుగుర్రం’ సినిమాను పక్కన పెట్టి ఏవేవో సినిమాలకు అవార్డులు ఇచ్చారు. నంది అవార్డుల కమిటీ, ప్రభుత్వం సినిమాల ఎంపికలో వన్‌సైడెడ్‌గా ఆలోచించారు. వాళ్ల ఇష్టం వచ్చిన వాళ్లకు ఇచ్చారు. కొంతమంది నిర్మాతలు పిచ్చిగా మాట్లాడుతున్నారు. నా కెరీర్లో 24క్రాఫ్ట్స్‌లో సూపర్‌గా తీసిన సినిమా ‘రేసుగుర్రం’. కంటి తుడుపు అవార్డులు ఇచ్చారు. అవార్డులను పంచుకున్నారా? ఏపీ ప్రభుత్వానికి ఒకటే చెబుతున్నా. ప్రజలు మెచ్చిన సినిమాలను ప్రభుత్వం గుర్తించి అవార్డులు ఇస్తే ఇంకా మంచి సినిమాలు తీయాలని నిర్మాతలకు అనిపిస్తుంది. జ్యూరీ మెంబర్స్ కూడా ఆలోచించుకోండి. ఎప్పుడూ ప్రెస్‌మీట్‌కి రాని నేను... కడుపు మండి వచ్చాను. పబ్లిసిటీ కోసం కాదు. ‘రేసుగుర్రం’ సినిమాలో అల్లు అర్జున్ బాగా నటించారు. హీరో సినిమాను ముందుకు తీసుకెళ్తున్నప్పుడు సడన్‌గా ఒక కమెడియన్ వచ్చి కాసేపు స్క్రీన్ మీద ఉంటే సినిమా మొత్తం మారిపోతుందా? అవార్డుల ఎంపిక కమ్మ లాబీయింగ్లా ఉంది. ఏంటిది? అని ప్రశ్నించడానికే ఈ ప్రెస్‌మీట్. ఎవరి మీదా వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. నా సినిమాకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతున్నాను. క్యాస్ట్ గురించి తేవడం కరెక్ట్ కాదు కదా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘మొత్తం అవార్డులు చూస్తే ఆ విషయం తెలుస్తుంది సార్’ అన్నారు. అవార్డుల ఎంపిక సరైన ప్రామాణిక అంశాలతోనే జరిగిందా? అన్న ప్రశ్నకు.. ‘మొత్తం దొంగ అవార్డులే అన్నారు. మరి, ఆ అవార్డుల కోసం ఎందుకు అడుగుతున్నారనే ప్రశ్నకు.. సినిమా ఉంది కాబట్టే అడుగుతున్నాం. ‘బాహుబలి’ సినిమాకి ఉత్తమ నటుడిగా ప్రభాస్‌కు ఎందుకు అవార్డు రాలేదు? గుణశేఖర్ ‘రుద్రమదేవి’ సినిమాకు అర్హత లేదా? ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాకి పన్ను మినహాయింపు ఇచ్చుకుంటారు. కానీ, ‘రుద్రమదేవి’కి ఇవ్వరు. మాకు వాళ్ల మీద వ్యతిరేకత ఏముంటుంది? గవర్నమెంట్ ఎవరిదో అందరికీ తెలుసు’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ... అల్లు అర్జున్ సినిమా షూట్లో బిజీగా ఉన్నారు. ఆయనకు ఈ ప్రెస్‌మీట్ గురించి తెలియదు. ‘మనం’కు అన్ని అర్హతలు ఉన్నాయి. కానీ, సరైన అవార్డు రాలేదు’ అన్నారు. పునర్జన్మల కథలకు నంది అవార్డులు ఇవ్వరు కదా? అన్న ప్రశ్నకు... ‘ఈగ’కు నేషనల్ అవార్డు, నంది అవార్డు ఇచ్చారు కదా. కనీసం జరిగిన తప్పులను సరిదిద్దుకోండి. మా ఆవేదన జ్యూరీ సభ్యులకు తెలియాలనుకున్నాం. ఈ ప్రెస్‌మీట్‌తో సాధించేది ఏమీ లేదు. టీడీపీ ప్రభుత్వం అని కాదు.. ఏ ప్రభుత్వం ఉన్నా అన్యాయం అన్యాయమే. నేను సినిమా వాడిని. సినిమాల గురించి చెప్తున్నాను. జ్యూరీ చేసిన తప్పులను చెప్తున్నాను. ప్రభుత్వం చేసిన తప్పులను చెప్తున్నాను. మాకు జరిగిన అన్యాయం ఇంకొకరికి జరగకూడదు అని చెప్తున్నాం. నేను క్యాస్ట్‌ల గురించి మాట్లాడటం లేదు. లాబీయింగ్ జరిగింది. మాకు లాబీయింగ్ చేయడం చేతకాదు’ అన్నారు. అప్పుడు నన్నూ విమర్శించారు – గుణశేఖర్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుగారు అమరావతి ప్రారంభోత్సవం సమయంలో... ‘‘రుద్రమదేవి మూలాలు ఉన్న అమరావతి శంకుస్థాపన నా చేతుల మీదగా జరగడం ఆనందంగా ఉంది’’ అన్నారు. అలా రుద్రమదేవి గొప్పతనాన్ని చెప్పిన ఏపీ ప్రభుత్వం ఆమె జీవితం ఆధారంగా తీసిన సినిమాకి పన్ను మినహాయింపు, అవార్డులు ఇవ్వలేదని గుణశేఖర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇదేదో అవార్డులు రాని సంఘం కాదు. మేం గ్రూప్ కట్టలేదు. బుధవారం ఓ ప్రముఖ టీవీ చానెల్లో డిబేట్ జరుగుతున్నప్పుడు గౌరవ జ్యూరీ సభ్యులు ఒక ఇష్యూని లేవనెత్తారు. దాని గురించి ప్రస్తావించాలని వచ్చా. అందులో ఒక జ్యూరీ మెంబర్ని.. అల్లు అర్జున్‌కు క్యారెక్టర్ అవార్డు ఇచ్చారని ప్రశ్నించినప్పుడు... ‘కావాలని ఇవ్వలేదు. ఆ డైరెక్టర్ ఆ విభాగంలో ఆప్లై చేశారు కాబట్టే ఇచ్చాం’ అన్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆప్లై చేశారా? అని చాలా మంది ఫోన్లు చేసి అడిగారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆప్లై చేశానన్నది వాస్తవం కాదు. ఇదే గోనగన్నారెడ్డి పాత్రకు సపోర్టింగ్ ఆర్టిస్టుగానే సైమా, ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్నాం. ఒక్క ఏపీ ప్రభుత్వమే అల్లు అర్జున్‌లాంటి హీరోను క్యారెక్టర్ ఆర్టిస్టు అని చెప్పింది. దానిని గౌరవంగా తీసుకోవాలా..? లేక అవార్డు వచ్చినందుకు (ఏస్వీ రంగారావు అవార్డు) ఆనందపడాలో అర్థం కావడం లేదు. ప్రూఫ్‌తో సహా వచ్చాను. సహాయ నటుడు విభాగంలోనే అల్లు అర్జున్ పేరు రాశా. ‘రుద్రమదేవి’ తెలంగాణకు చెందిన చిత్రం కాబట్టి పన్ను మినహాయింపు, అవార్డు ఇవ్వలేదని కొందరన్నారు. రుద్రమదేవి జాతీయ నాయకురాలు. రెండు రాష్ట్రాలకు ఒకేసారి ఒకే విధంగా ‘రుద్రమదేవి’ చిత్రానికి పన్ను మినహాయింపు కోసం ప్రయత్నించాను. తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఏపీ ప్రభుత్వం కూడా స్పందిస్తుందనుకున్నా. సమాచార లోపం లేకుండా మంత్రులు అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావుగార్ల చేత ముఖ్యమంత్రికి విన్నవించుకున్నాను. బహిరంగంగా విమర్శించకుండా లేఖ రాశాను. ఆ లేఖకు స్పందన లేదు. నేనో పెద్ద నిర్మాతను కాననా? నంది అవార్డుల ఎంపికలో ‘టామీ’ సినిమాకు ఇచ్చిన స్థాయి ‘రుద్రమదేవి’కి లేదా? జ్యూరీ మెంబర్స్‌ని మెప్పించలేకపోయిందా? ‘మీరు పన్ను మినహాయింపుకు ఓ ప్రశ్న అడిగారు. జవాబు ఇప్పుడు వచ్చింది. అవార్డులు రాకపోవడమే జవాబు’ అని నెటిజన్లు అంటున్నారు. ఏస్వీరంగారావుగారి అవార్డును తక్కువ చేసి మాట్లాడటం లేదు. కేటగిరీల స్థాయి గురించి మాట్లాడను. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రకాశ్‌రాజ్‌కు ఆప్లై చేశాను. బన్నీ ఆ కేటగిరీకి కరెక్ట్ కాదు. ఆప్లికేషన్ ప్రింట్లో ఈ అవార్డులపై మీడియా ముఖంగా అభ్యంతరం చెప్పినవారు మూడేళ్లు అవార్డులకు అర్హులు కారని నియమనిబంధనలతో కూడిన ఒక బుక్ ఉంది. అంతకు ముందు లేదు. ఇప్పుడే పెట్టారు. ఇలా అవార్డులు ఇవ్వడానికే ఆ నిబంధన పెట్టారనిపిస్తోంది. నంది అవార్డులు నాకు వ్యక్తిగతంగా ఎనిమిది వచ్చాయి. నేను తీసిన 12 సినిమాల సాంకేతిక నిపుణులకు, ఆర్టిస్టు లకు దాదాపు 30 నంది అవార్డులు వచ్చాయి. ‘ఒక్కడు’ సినిమాకి 8 అవార్డులు వచ్చినప్పుడు నన్ను విమర్శించారు.అవార్డుల ఎంపికలో మంచి ప్రమాణాలను పాటించాలని కోరుతున్నాను. అనుకూలంగా ఉన్నవారికే అవార్డులు– నిర్మాత మల్కాపురం శివకుమార్ నంది అవార్డులు పచ్చపార్టీ తమ కార్యకర్తలకు కండువాలను కప్పినట్లుగా ఉంది. అవార్డుకు అర్హత ఉన్న చిత్రాలను విస్మరించి తమకు అనుకూలంగా ఉన్నవారికే ప్రకటించింది. 2015లో సరికొత్త కాన్సెప్ట్‌తో నేను నిర్మించిన ‘సూర్య వర్సెస్ సూర్య’ అత్యంత ప్రజాదరణ పొందింది. ఇలాంటి కాన్సెప్ట్‌తో హాలీవుడ్లో ఓ చిత్రాన్ని నిర్మిస్తు న్నారు. హాలీవుడ్ వాళ్లకు ఇన్స్పిరేషన్గా నిలిచిన తెలుగు సినిమా నంది అవార్డు కమిటీకి కనిపించలేదా? ఈ అవార్డులు ప్రభుత్వం తరపున కాకుండా పార్టీ తరపున ఇస్తే బాగుండేది. -
'పెండింగ్‌లో 5,25,000 ఈ-చలానాలు'
విజయవాడ: 2010 నుంచి ఇప్పటి వరకు 5,25,000 ఈ-చలానాలు పెండింగ్ లో ఉన్నట్టు విజయవాడ కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు చెప్పారు. పెండింగ్‌లో ఉన్న ఈ-చలానాలను మీసేవా కేంద్రాల ద్వారా కూడా చెల్లించే సౌకర్యాన్ని కమిషనర్ ప్రారంభించారు. ఈసంద్భంగా వాహన చోదకులు పెండింగ్‌లో ఉన్న ఈ-చలానాలను తక్షణమే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ దాష్టీకం
విద్యానగర్ (గుంటూరు): టీడీపీ నాయకులు మరోసారి వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. ఫ్లెక్సీ ఏర్పాటు విషయంలో వివాదం నెలకొనడంతో బుధవారం రాత్రి తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు పల్లా సుబ్బారావు, కుక్కల వెంకటేశ్వర రావు, కుక్కల మల్లికార్జునరావు, కుక్కల పద్మ, మదర్లపై టీడీపీ నాయకులు దాడిచేసి గాయపర్చారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను గురువారం వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, రాష్ట్ర కార్యదర్శి, నగర అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి పరామర్శించారు. రాష్ర్టంలో రౌడీ రాజకీయాలు: అంబటి ఈ సందర్బంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో రౌడీ రాజకీయాలు జరుగుతున్నాయనటానకి నిదర్శనం ఈ దాడులన్నారు. విచక్షణారహితంగా పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నా ఇటు ప్రభుత్వం, అటు పోలీసులు సైతం మిన్నకుండిపోవటం దారుణమన్నారు. ఇప్పటికైనా రాజకీయ కుట్రలు మాని ప్రజలకు మేలు చేసేవిధంగా నాయకులు ప్రయత్నించాలని హితవు పలికారు. అప్పిరెడ్డి మాట్లడుతూ ప్రజలకు మంచి చేసే ప్రభుత్వాలే ఎక్కువకాలం పనిచేస్తాయని, అదే ప్రజలకు ఆగ్రహం కలిగించే విధంగా పాలన కొనసాగిస్తే త్వరలోనే కాలంచెల్లిపోతుందని హెచ్చరించారు. రాక్షసంగా కొట్టి గాయపరిచి ప్రజలను భయబ్రాంతులకు గురిచేయటం హేయమన్నారు. మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ విచక్షణారహితంగా కొట్టి గాయపర్చిన వారిపై కేసులు నమోదు చేసి, బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. టీడీపీ నాయకులు ఇదేవిధంగా వివాదాలకు దిగితే ప్రజల ఆగ్రహంతో తీవ్ర పరినామాలు చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన రక్షణ వ్యవస్థను సైతం ప్రజాప్రతినిధులు, నాయకులు వారి చెప్పు చేతల్లో ఉంచుకోవటం విచారకరమన్నారు. బాధితుల పరిస్థితి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా బీసీసెల్ కన్వీనర్ రాతంశెట్టి సీతారామాంజనేయులు, బెల్లంకొండ జెడ్పీటీసీ సభ్యురాలు దేవెళ్ళ రేవతి, సేవాదళ్ జిల్లా కన్వీనర్ కొత్తా చిన్నపరెడ్డి, నాయకులు అశోక్‌రెడ్డి, డి సీతారామిరెడ్డి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
పట్టపగలే రూ. ఆరులక్షల చోరీ
గుంటూరురూరల్ : పట్టపగలు నగర నడిబొడ్డున అందరూ చూస్తుండగానే బ్యాంకునుంచి డ్రా చేసుకుని వచ్చిన రూ.ఆరులక్షల నగదును ఇద్దరు ఆగంతకులు బైక్‌పై వచ్చి చోరీ చేసిన సంఘటన నగరంలో సంచలనం సృష్టించింది. గుంటూరు నగరంలోని లక్ష్మీపురం హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఎదుట మంగళవారం జరిగిన సంఘటనకు సంబంధించి బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎస్వీఎన్ కాలనీ సమీపంలోని నేతాజీ నగర్ ప్రాంతానికి చెందిన తోటా వెంకటేశ్వరరావు రెండేళ్లుగా జేకేసీ కళాశాల రోడ్డులోని వెల్ గ్రౌన్ స్పైసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో(మిర్చి కంపెనీలో) గుమస్తాగా పని చేస్తున్నారు. రోజూ మాదిరిగానే ఉదయం 10 గంటలకు విధులకు వెళ్లి 11.30 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై లక్ష్మీపురంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు చేరుకుని, కంపెనీ ఇచ్చిన రూ.ఆరు లక్షల చెక్‌ను నగదు రూపంలో మార్చారు. డబ్బు బ్యాగ్‌ను తీసుకుని తన ద్విచక్ర వాహనంపై ముందుభాగంలో పెట్టుకుని బృందావన్ గార్డెన్స్ వైపునకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ఇద్దరు గుర్తు తెలియని యువకులు బజాజ్ పల్సర్‌పై వచ్చి డబ్బు ఉన్న బ్యాగ్‌ను అపహరించి పరారయ్యారు. పల్సర్‌పై వెనుక కూర్చున్న వ్యక్తి హెల్మెట్ ధరించి ఉన్నాడు. అకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటన నుంచి తేరుకున్న వెంకటేశ్వర్లు పరారవుతున్న ఆగంతకులను కొంత దూరం వెంబడించాడు. వారిని అందుకోలేపోవడంతో తిరిగి బ్యాంక్‌కు చేరుకుని అధికారులకు జరిగిన సంఘటన తెలిపారు. సమాచారం తెలుసుకున్న అర్బన్ జిల్లా ఏఎస్పీ బి.శ్రీనివాసులు, అర్బన్ క్రైం డీఎస్పీ వెంకటేశ్వరరావు, ట్రాఫిక్ డీఎస్పీ తిరుపాలు, పట్టాభిపురం సీఐ బిలాల్లుద్దీన్, ఎస్బీ సీఐ రాజశేఖర్, సిబ్బందితో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడి నుంచి వివరాలు సేకరించారు. అపహరణ జరిగిన స్థలాన్ని పరిశీలించారు. బ్యాంకులో ఉన్న సీసీ కెమెరాల్లోని పుటేజ్‌లో బ్యాంక్ ప్రాంగణం తప్ప, ఆగంతకులు డబ్బు బ్యాగ్‌ను లాక్కెళ్లిన దృశ్యాలు కనిపించలేదు. సెక్యూరిటీ నిల్... గతంలో ఇదే బ్యాంకు వద్ద ఇలాంటి సంఘటనలే గతంలో మూడుసార్లు చోటు చేసుకున్నాయి. దొంగతనాలు జరుగుతున్నాయని, ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ పోలీసులు బ్యాంక్ వద్ద ఏర్పాటు చేసిన బోర్డులను సైతం బ్యాంక్ అధికారులు తొలగించడం గమనార్హం. ముమ్మరంగా వాహనాల తనిఖీ లక్ష్మీపురంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వద్ద చోరీకి పాల్పడిన ఆగంతకుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నగరం నుంచి బయటకు వెళ్లే అన్ని రహదారుల్లో వాహన తనిఖీలు చేపట్టారు. నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోని పోలీస్స్టేషన్లను అప్రమత్తం చేసి దొంగతనానికి పాల్పడ్డ వారి ఆచూకీ సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. -
మెరుగైన వైద్యం అందించడమే ధ్యేయం
సర్వజనాస్పత్రిలో రోగుల సంరక్షకులకు అటెండర్ పాస్‌లు అందజేసిన వైద్యులు అనంతపురం అర్బన్: రోగులకు మెరుగైన వైద్య సేవలందించడమే తమ ధ్యేయమని, అందులో భాగంగానే పాస్‌లు అందజేస్తున్నామని స్థానిక జిల్లా ప్రభుత్వ సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వరరావు, ఆర్ఎంఓ డాక్టర్ కన్నేగంటి భాస్కర్ స్పష్టం చేశారు. ఆస్పత్రిలో ప్రయోగాత్మకంగా లేబర్, ఎమర్జెన్సీ వార్డుల్లో అటెండర్ పాస్‌లు ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా లేబర్ వార్డులో గురువారం రోగుల సంరక్షకులైన బంధువులకు పాస్‌లను అందజేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వార్డులలో ఎవరూ ఇష్టారాజ్యంగా ప్రవేశించరాదన్నారు. ఆస్పత్రిలో పారిశుద్ధ్య నిర్వహణ కోసం, రోగులకు ఇన్ఫెక్షన్ సోకకుండా, దొంగతనాలకు ఆస్కారం లేకుండా అటెండర్ పాస్‌లను ప్రవేశ పెట్టామన్నారు. వార్డులలోకి గుంపులుగా జనం రావడం వల్ల రోగులు ఇన్ఫెక్షన్స్కు గురయ్యే పరిస్థితి ఉందన్నారు. తద్వారా రోగి త్వరగా కోలుకునేందుకు వీల్లేకుండా పోతుందన్నారు. వార్డుల్లో చిన్న పిల్లలు అపహరణకు, ఆస్పత్రిలోని వస్తువులు చోరీకి గురికాకుండా ఉండేందుకు, ఇతర వ్యక్తులు లోపలకు రాకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు పాస్‌లు ఉపయోగపడతాయన్నారు. ఆస్పత్రిలోని సెక్యూరిటీ సిబ్బందికి జిల్లా ప్రజలు సహకరించాలని వారు కోరారు. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు రోగులకు టిఫిన్ కోసం, మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకు భోజనం, సాయంత్ర 4 నుంచి 5 వరకు విజిటింగ్ అవర్స్ ఉంటాయన్నారు. ఈ సమయాల్లోనే రోగుల బంధువుల వార్డులలోకి రావాలన్నారు. నర్సింగ్ సూపరింటెండెంట్ రాజేశ్వరి పాల్గొన్నారు. -
హైడ్రామా!
సాక్షి ప్రతినిధి, అనంతపురం : ‘‘అడ్మిషన్ కోసం వచ్చిన మా వాళ్లని ఎందుకు పట్టించుకోలేదు. నా మనుషులని తెలిసి కూడా ఎందుకు అడ్మిట్ చేసుకోలేదు. ఆస్పత్రిలో రాజకీయాలెందుకు చేస్తారు. వైద్యుల్లోనూ రాజకీయాలా’’ అంటూ పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత అనంతపురం సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వర రావుపై మండిపడుతూ హైడ్రామాకు తెరలేపారు. ‘వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఆస్పత్రికి రాగానే అడ్మిట్ చేసుకున్న డాక్టర్లు, మా వర్గీయులను అడ్మిట్ చేసుకోవడంలో ఎందుకు తాత్సారం చేశారు? ఆ సమయంలో డ్యూటీలో ఉన్న డాక్టర్ ఎవరు?’ అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే... సోమవారం రాత్రి కనగానపల్లి మండలం బద్దలాపురంలో పరిటాల వర్గీయులు వైఎస్ఆర్సీపీ సానుభూతిపరులపై దాడి చేశారు. ఈ దాడిలో తొమ్మిది మంది గాయాలపాలయ్యారు. వీరిలో తీవ్రంగా గాయపడిన సాలమ్మ, చంద్రప్ప, హరిలను మాత్రం ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకుని మిగతా వారికి ప్రాథమిక చికిత్స చేసి పంపించారు. వైఎస్ఆర్సీపీ వారు అస్పత్రిలో చేరాక.. రాత్రి 11గంటల ప్రాంతంలో పరిటాల వర్గీయులు కూడా తమపై కొందరు వైఎస్ఆర్ సీపీ వర్గీయులు దాడి చేశారంటూ ‘గీరుడు’గాయాలతో ఆస్పత్రికి వచ్చారు. గాయాల తీవ్రత లేకపోవడంతో డాక్టర్లు వారిని అడ్మిట్ చేసుకోకుండా ప్రాథమిక చికిత్స చేశారు. ఈ క్రమంలో తమ వర్గీయులను కూడా అడ్మిట్ చేసుకోవాల్సిందే అంటూ మంత్రి పరిటాల సునీత తరఫు నుంచి ఆస్పత్రి వర్గాలకు ఒత్తిళ్లు మొదలయినట్లు సమాచారం. దీంతో చివరకు మంగళవారం ఉదయం అడ్మిట్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి సునీత మంగళవారం సాయంత్రం ఆస్పత్రికి వచ్చి తన వర్గీయులను పరామర్శించారు. వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా మంత్రి హోదాలో తొలిసారిగా ఆస్పత్రిని సందర్శించిన సునీత రోగుల సౌకర్యాలు, సాదకబాధకాల గురించి నామమాత్రంగా కూడా విచారించలేదు. కేవలం తమ వర్గం వారిని పరామర్శించి ఆస్పత్రి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి వెళ్లిపోవడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘అస్పత్రికి వచ్చేవారిని మేం రోగులుగానే చూస్తాం. వారిదే కులం. ఏ వర్గం, ఏ పార్టీ అని చూడం. రోగి పరిస్థితి, తీవ్రతను బట్టే వారిని అడ్మిట్ చేసుకోవడమా లేదా అన్న విషయాన్ని నిర్ణయిస్తాం. అటుమంటిది నా మనుషులని తెలిసీ ఆడ్మిట్ చేసుకోరా అంటూ సాక్షాత్తు ఓ మంత్రే హూంకరించడం బాధాకరం’ అంటూ పేరు తెలపడానికి ఇష్టపడని ఓ డాక్టరు వ్యాఖ్యానించారు. ‘కేసుల కోసమో.. కౌంటర్ కేసుల కోసమో అస్పత్రిలో అడ్మిషన్ కోసం రాజకీయ వత్తిళ్లు చేస్తూ... పై పెచ్చు డాక్టర్లు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించడం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు. అవసరం లేకపోయినా మంత్రి మనుషులని పది మందిని అడ్మిట్ చేసుకుంటే ఆ మేరకు నిజంగా వైద్యం అవసరమున్న పది మంది రోగులకు బెడ్లు కేటాయించలేమన్న విషయాన్ని బాధ్యతాయుత పదవుల్లో ఉన్నవారు గమనిస్తే బాగుంటుం దంటూ ఆయన పేర్కొన్నారు. వారి గాయాలు తీవ్రతరం కాదు ఒత్తిడి తెచ్చి ఆస్పత్రిలో అడ్మిషన్ పొందిన వారి గాయాలు అంత తీవ్రమైనవి కాదు. ఎటువంటి ఫ్యాక్చర్స్ కన్పించలేదు. అయినా అనుమాన నివృత్తికోసం ఎక్స్‌రేకి పంపాం. బుధవారం రిపోర్టు వస్తుంది. వారందరికీ మెరుగైన వైద్యం అందించాం. - డాక్టర్ రామస్వామి నాయక్ (హెచ్ఓడీ, సర్జికల్ విభాగం) -
ఉద్యమాలను నడిపించేది కవులే
నిజామాబాద్ కల్చరల్,న్యూస్‌లైన్: ప్రతి ఉద్యమం, విప్లవం వెనుక కవులు, రచయితలు వెన్నుదన్నుగా నిలిచారని.. ఉద్యమాలు, ప్రజా చైతన్యంలో కవులపాత్ర ఎనలేనిదని జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వరరావు అన్నారు. తెలంగాణ ఉత్సవాల సందర్భంగా జిల్లాకేంద్రంలోని ఖిల్లా రఘునాథ ఆలయంలో జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ‘తెలంగాణ కోకిల ధూంధాం’ కవి సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం గురించి ప్రజలలో భావజాల వ్యాప్తిని నింపింది కవులు, కళాకారులేనన్నారు. భవిష్యత్తు తరాల అభ్యున్నతికి బాటలు వేసే రచనల ద్వారా కవులు, రచయితలు ప్రజల మనస్సుల్లో నిలిచిపోతారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతిలో కవులు కీలకపాత్ర పోషించాలని ఆకాంక్షించారు. దాశరథి స్ఫూర్తి తరగని నిధి.. సభను నిర్వహించిన ప్రముఖ కవి ఘనపు రం దేవేందర్ మాట్లాడుతూ... తెలంగాణ క వులకు దాశరథి స్ఫూర్తి తరగని నిధి అన్నా రు. ధిక్కారస్వరం కవిసహజలక్షణమన్నారు. ఉత్తమ సాహిత్యానికి చిరునామా తెలంగాణ.. గౌరవ అతిథిగా హాజరైన తెలంగాణ జర్నలిస్టుల ఫోరం జిల్లా అధ్యక్షులు జమాల్పూర్ గ ణేశ్ మాట్లాడుతూ... తెలంగాణ ఉత్తమస్థాయి సాహిత్యానికి చిరునామా అన్నారు. నాచనసోముడు, పోతనల రచనలు శాశ్వతంగా నిలుస్తాయన్నారు. ప్రజల భాషను కవిత్వంగా మార్చాలని, సమాజంలో ప్రయోగిస్తున్న నిరర్ధక పదాలను కవులు వాడరాదని ఆయన కోరారు.కవులు, కళాకారులు, ఉద్యమాలకు తెలంగాణ పుట్టినిల్లు అన్నారు. ఉర్రూతలూగించిన కవి సమ్మేళనం... కవి సమ్మేళనం ఉర్రూతలూగించింది. డాక్టర్ కాసర్ల నరేశ్‌రావు, తిరుమల శ్రీనివాస్ ఆర్య వ్యాఖాతలుగా కొనసాగిన కవి సమ్మేళనంలో.. మెంగవరం రాజేంద్రప్రసాద్ ‘దాశరథి’ పద్యాల ధారతో అదరహా అనిపించారు. దాశరథి ప్రయోగించిన ‘బొగ్గుముక్క’పై ప్రముఖ కవి కందాళై రాఘవాచార్య అల్లిన కవిత్వం అందరిని ఆకట్టుకుంది. తెలంగాఱ ఉద్యమసరళిపై ప్రముఖ కవి వీపీ చందన్రావు అందించిన కవిత్వం మైమరిపించింది. గంధం విజయలక్ష్మీ తెలంగాణ కథ, వెంకన్నగారి జ్యోతి పద్యాలు, గంట్యాల ప్రసాద్ అమరవీరు కవిత ఆహుతుల నుంచి జేజేలు అందుకున్నాయి. పటాన్చెరు సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేశ్ నోటి నుంచి జాలువారిన నేను తెలంగాణ తల్లి కవిత శ్రోతలను కట్టిపడేసింది. నరాల సుధాకర్ భవిష్యత్ తెలంగాణ, గంగాప్రసాద్ మిమిక్రీ, దశరథ్ కోత్మీర్కార్, పురం శంకర్ల మినీ కవితలు ఆలోచనాత్మకంగా సాగాయి. మాధవీలత, పడాల రామారావు, గుత్పప్రసాద్, శారదాలక్ష్మణ్, శారద, రాజేశ్వర్ గంగాధర్ తమ కవితలలో తెలంగాణ వీరుల శౌర్యాన్ని వ్యక్తం చేశారు. ఎస్.సత్యనారాయణ, మల్లవరపు చిన్నయ్య, మల్లవరపు విజయ, మేక సుధాకర్, అయ్యవార్ల మురళి, పబ్బ మురళి, డాక్టర్ మల్లేశ్, పద్మనాభశాస్త్రి్త్ర, శ్రీదేవి, గిరిజా గాయత్రిల కవితాగానం ఆకట్టుకుంది. ప్రేరణి, ప్రణతి ఆలపించిన భక్తిగీతాలు, సిర్పలింగం, సాయిలవోల, రఘుల స్వీయ గేయాలు, సతీశ్, డప్పు రాజుల హాస్య విన్యాసాలు రక్తికట్టించాయి. కవి సమ్మేళనంలో జిల్లావ్యాప్తంగా అరవై మంది కవులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ సేవకులు చెన్న రవీందర్, సేనాపతి నరసింహమూర్తి, పోశెట్టి, సాహితీప్రియులు పాల్గొన్నారు. -
లోగుట్టు రాజన్నకెరుక!
వేములవాడ రాజన్న ఆలయ తలనీలాల కాంట్రాక్టర్ ఆ పరమశివుడికే శఠగోపం పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆలయానికి బకాయిపడ్డ రూ.3.9 కోట్ల సొమ్మును చెల్లించేందుకు మొండికేస్తున్నాడు. ఇప్పటికే వాయిదా గడువు దాటిపోయినా స్పందించడం లేదు. మరో నెలరోజుల్లో ఒప్పంద గడువు సైతం ముగియనుంది. ఈలోగా కాట్రాక్టర్ నుంచి డబ్బు రాబట్టడం అధికారులకు సవాలుగా మారింది. వేములవాడ, న్యూస్‌లైన్: రాజన్నకు భక్తులు సమర్పించుకునే తలనీలాల వెంట్రుకలను సేకరించుకునేందు కు దేవాదాయశాఖ అనుమతితో ప్రతి సంవత్సరం అధికారులు టెండర్లు నిర్వహిస్తారు. 2012 ఫిబ్రవరిలో నిర్వహించిన టెండర్లలో 2012 నుంచి 2014 వరకు రెండేళ్ల పాటు తల నీలాలు సేకరించుకునేందుకు రూ.12.10 కోట్లకు వెంకటేశ్వర్రావు అనే వ్యక్తి కాంట్రాక్టు దక్కించుకున్నారు. తొలుత వాయిదాల ప్రకా రం నిర్ణయించిన మొత్తాన్ని చెల్లిస్తూ వచ్చారు. గత సంవత్సరం నుంచి వాయిదాలు తప్పించడంతో అధికారులు ఆయనపై ఒత్తిడి తెచ్చా రు. దీంతో కొంత గాడిలోపడ్డ కాంట్రాక్టర్ వా యిదాలు పొడగించమని కోరారు. అధికారు లు అనుమతి ఇచ్చినప్పటికీ ఆయన చెల్లింపు లు చేయలేకపోయారు. దీంతో పూచికత్తుకిం ద ఇచ్చిన చెక్కును ఆలయ అధికారులు బ్యాంకులో జమచేశారు. ఖాతాలో డబ్బులేకపోవడంతో చెక్కు బౌన్సయింది. మరింత ఒ త్తిడి చేసిన అధికారులు కోర్టు నోటీసులు పం పారు. ఓ మెట్టు దిగివచ్చిన కాంట్రాక్టర్ కొంత మొత్తాన్ని చెల్లించి మళ్లీ వాయిదా కోరాడు. అందుకు అధికారులు నిరాకరించారు. బ్లాక్ లిస్టులో పెట్టేందుకు సిఫార్సు కాంట్రాక్టర్ తీరుతో విసిగిపోయిన ఆలయ అధికారులు సదరు కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్టులో చేర్చాలని కోరుతూ దేవాదాయశాఖ కమిషనర్‌కు నివేదించారు. తనకున్న రాజకీయ పలుకుబడితో దేవాదాయ కమిషనర్‌ను కలిసిన కాంట్రాక్టర్ తనకు అనుకూలంగా అంతా చక్కబెట్టుకున్నారు. బ్లాక్‌లిస్టులో పెట్టేందుకు సిఫార్సు చేస్తూ నివేదించిన అధికారులకు దేవాదాయశాఖ కమిషనర్ ఇచ్చిన ఆదేశాలు దిమ్మదిరిగేలా చేశాయి. కల్యాణకట్టలో ఉన్న నాయీబ్రాహ్మణులకు తోడుగా వందమంది నాయిబ్రాహ్మణులను అదనంగా నియమించాలని కమిషనర్ ఆదేశించారు. దీంతో చేసేదిలేక మళ్లీ కాంట్రాక్టర్‌పైనే ఒత్తిడి తెచ్చేందుకు అధికారులు సిద్ధపడ్డారు. తలనీలాలను భద్రపరిచే స్టోర్‌రూంను సీజ్‌చేశారు. బకాయి మొత్తం చెల్లించాకే అందులో ఉన్న వెంట్రుకలు తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. దీంతో దిగివచ్చిన కాంట్రాక్టర్ ఇటీవలే రూ.16 లక్షలు చెల్లించారు. వెంట్రుకలు సొమ్ము రాలుస్తాయా? ఒకవేళ కాంట్రాక్టర్ డబ్బు చెల్లించకుంటే.. సీజ్ చేసిన స్టోర్‌రూంలోని వెంట్రుకలు రికవరీ కావల్సిన సొమ్ముతో సరితూగుతాయా.. లేదా అన్నది ప్రశ్న. ఆ వెంట్రుకలను ఆలయ అధికారులు వేలం వేద్దామన్నా వాటిని కొనేవారు ఇక్కడ అందుబాటులో లేరు. దీంతో వెంట్రుకలను వేలం వేసేవరకు వేచిచూసి బినామీ పేరిట ప్రస్తుత కాంట్రాక్టరే తక్కువ రేటుకు కొనుగోలు చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయని స్థానిక నాయీబ్రాహ్మణులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. బకాయిలు కట్టకుండా దాటవేస్తున్న కాంట్రాక్టర్‌కు అనుకూలంగా కమిషనర్ వత్తాసు పలకడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ లోగుట్టు ఏమిటో.. రాజన్నకే తెలియాలి! -
వెలుగులు.. జిలుగులు
ఆత్మకూర్, న్యూస్‌లైన్: ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న దిగువ జూరాల జల విద్యుదుత్పత్తి కేంద్రం వెలుగులు జిలుగులు ప్రారంభమయ్యాయి. పక్షం రోజులుగా నిర్వహిస్తున్న సన్నాహక పరీక్షలు పూర్తిచేసుకుని ఆదివారం మొదటి యూనిట్లో విద్యుదుత్పత్తిని విజయవంతంగా పూర్తిచేశారు. ఐదు నిమిషాల పాటు మొదటి యూనిట్లో 28మెగావాట్ల విద్యుదుత్పత్తి చేపట్టి గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. పనులు చివరిదశకు చేరుకున్నాయని, ఇదివరకే మొదటి యూనిట్‌ను లాంఛనంగా ప్రారంభించామని, మరో వారం రోజుల్లో రెండో యూనిట్‌ను ప్రారంభించి విద్యుదుత్పత్తి చేపడతామని జెన్కో హైడల్ సీఈ రత్నాకర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనెల 20న చేపట్టిన ట్రయల్న్ ్రవిజయవంతమైందన్నారు. ఎగువ జూరాల జల విద్యుత్ ఉత్పత్తికేంద్రం నుంచి నీటివిడుదల సక్రమంగా జరిగితే ఎలాంటి ఆటంకాలు లేకుండా నిరంతరం విద్యుత్ ఉత్పత్తి చేస్తామన్నారు. మరో వారంలోగా రెండో యూనిట్‌ద్వారా విద్యుదుత్పత్తి చేపట్టడంలో భాగంగా సోమవారం నుంచి సన్నాహక పరీక్షలను నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో సివిల్, హైడల్, డిజైన్స్, ఎలక్ట్రికల్ ఎస్సీలు శ్రీనివాస్, శ్రీనివాస, వెంకటేశ్వర్రావు, సుదర్శన్, పీవీ రమణ, ఈఈలు రమణమూర్తి, రాంభద్రరాజు, బీవీ వ్యాసరాజ్, ఏడీఈలు రమేష్, శ్రీనివాస్‌రెడ్డి, జయరాంరెడ్డి, నాగేశ్వర్‌రెడ్డి, భరత్‌కుమార్‌రెడ్డి, రామక్రిష్ణారెడ్డి, రూపేష్, పవన్‌కుమార్, ఆనంద్, శ్రీనివాస్, సునీల్, వీఆర్స్క్ కంపెనీ ఎండీ సుదర్శన్‌రెడ్డి, డెరైక్టర్ కౌషిక్‌కుమార్‌రెడ్డి, ఆల్స్ట్రామ్ కంపెనీ ఇంజనీర్లు, బరోడా ప్రాజెక్టు మేనేజర్ సిద్ధిఖీ తదితరులు పాల్గొన్నారు. మహానేత వైఎస్ పుణ్యమే జూరాల వద్ద జెన్కో విద్యుదుత్పత్తి కేంద్రాన్ని నిర్మించి వెలుగు జిలుగులు నింపాలని ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పరితపించారు. రూ.వెయ్యి కోట్లతో నిర్మిస్తున్న దిగువ జూరాల జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మాణ పనులు చివరిదశకు చేరుకున్నాయి. 2008 అక్టోబర్ 5న వైఎస్ చేతులమీదుగా జెన్కో విద్యుదుత్పత్తి కేంద్రానికి శంకుస్థాపన చేసి పనులను లాంఛనంగా ప్రారంభించారు. అదే ఏడాది ఫిబ్రవరి 10న పూర్తిస్థాయిలో సర్వేలు నిర్వహించి తాత్కాలిక పనులను ప్రారంభించారు. 2011 నాటికి ప్రాజెక్టును పూర్తిచేసే విధంగా అధికారులను ఆదేశించారు. అనివార్య కారణాల వల్ల పనులు ఏడాది పాటు నిలిచిపోయాయి. 2012 చివరినాటికి మొదటి యూనిట్‌ను ప్రారంభించి 40 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎట్టకేలకు నేడు రెండు యూనిట్ల ద్వారా 80 మెగావిద్యుత్ ఉత్పత్తిని చేసేందుకు అధికారుల శ్రమ ఫలించింది. ఆదివారం 28మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. మరో వారంరోజుల్లో రెండవ యూనిట్ నుంచి ప్రారంభించేందుకు సోమవారం నుంచి సన్నాహక పరీక్షలు ప్రారంభిస్తారు. తదనంతరం ప్రతి నాలుగు నెలలకు ఒక యూనిట్ చొప్పున ఆరు యూనిట్ల ద్వారా మొత్తం 240మెగావాట్ల విద్యుత్‌ను పూర్తి స్థాయిలో సరఫరా చేసేందుకు పకడ్బందీ కార్యాచరణతో ముందుకు సాగుతున్నట్లు సీఈ తెలిపారు.