ఆత్మకూర్, న్యూస్‌లైన్: ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న దిగువ జూరాల జల విద్యుదుత్పత్తి కేంద్రం వెలుగులు జిలుగులు ప్రారంభమయ్యాయి. పక్షం రోజులుగా నిర్వహిస్తున్న సన్నాహక పరీక్షలు పూర్తిచేసుకుని ఆదివారం మొదటి యూనిట్‌లో విద్యుదుత్పత్తిని విజయవంతంగా పూర్తిచేశారు. ఐదు నిమిషాల పాటు మొదటి యూనిట్‌లో 28మెగావాట్‌ల విద్యుదుత్పత్తి చేపట్టి గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. పనులు చివరిదశకు చేరుకున్నాయని, ఇదివరకే మొదటి యూనిట్‌ను లాంఛనంగా ప్రారంభించామని, మరో వారం రోజుల్లో రెండో యూనిట్‌ను ప్రారంభించి విద్యుదుత్పత్తి చేపడతామని జెన్‌కో హైడల్ సీఈ రత్నాకర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనెల 20న చేపట్టిన ట్రయల్న్ ్రవిజయవంతమైందన్నారు. ఎగువ జూరాల జల విద్యుత్ ఉత్పత్తికేంద్రం నుంచి నీటివిడుదల సక్రమంగా జరిగితే ఎలాంటి ఆటంకాలు లేకుండా నిరంతరం విద్యుత్ ఉత్పత్తి చేస్తామన్నారు.
మరో వారంలోగా రెండో యూనిట్‌ద్వారా విద్యుదుత్పత్తి చేపట్టడంలో భాగంగా సోమవారం నుంచి సన్నాహక పరీక్షలను నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో సివిల్, హైడల్, డిజైన్స్, ఎలక్ట్రికల్ ఎస్‌సీలు శ్రీనివాస్, శ్రీనివాస, వెంకటేశ్వర్‌రావు, సుదర్శన్, పీవీ రమణ, ఈఈలు రమణమూర్తి, రాంభద్రరాజు, బీవీ వ్యాసరాజ్, ఏడీఈలు రమేష్, శ్రీనివాస్‌రెడ్డి, జయరాంరెడ్డి, నాగేశ్వర్‌రెడ్డి, భరత్‌కుమార్‌రెడ్డి, రామక్రిష్ణారెడ్డి, రూపేష్, పవన్‌కుమార్, ఆనంద్, శ్రీనివాస్, సునీల్, వీఆర్స్క్ కంపెనీ ఎండీ సుదర్శన్‌రెడ్డి, డెరైక్టర్ కౌషిక్‌కుమార్‌రెడ్డి, ఆల్‌స్ట్రామ్ కంపెనీ ఇంజనీర్లు, బరోడా ప్రాజెక్టు మేనేజర్ సిద్ధిఖీ తదితరులు పాల్గొన్నారు.
మహానేత వైఎస్ పుణ్యమే
జూరాల వద్ద జెన్‌కో విద్యుదుత్పత్తి కేంద్రాన్ని నిర్మించి వెలుగు జిలుగులు నింపాలని ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పరితపించారు. రూ.వెయ్యి కోట్లతో నిర్మిస్తున్న దిగువ జూరాల జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మాణ పనులు చివరిదశకు చేరుకున్నాయి.
2008 అక్టోబర్ 5న వైఎస్ చేతులమీదుగా జెన్‌కో విద్యుదుత్పత్తి కేంద్రానికి శంకుస్థాపన చేసి పనులను లాంఛనంగా ప్రారంభించారు. అదే ఏడాది ఫిబ్రవరి 10న పూర్తిస్థాయిలో సర్వేలు నిర్వహించి తాత్కాలిక పనులను ప్రారంభించారు. 2011 నాటికి ప్రాజెక్టును పూర్తిచేసే విధంగా అధికారులను ఆదేశించారు. అనివార్య కారణాల వల్ల పనులు ఏడాది పాటు నిలిచిపోయాయి. 2012 చివరినాటికి మొదటి యూనిట్‌ను ప్రారంభించి 40 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
ఎట్టకేలకు నేడు రెండు యూనిట్ల ద్వారా 80 మెగావిద్యుత్ ఉత్పత్తిని చేసేందుకు అధికారుల శ్రమ ఫలించింది. ఆదివారం 28మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. మరో వారంరోజుల్లో రెండవ యూనిట్ నుంచి ప్రారంభించేందుకు సోమవారం నుంచి సన్నాహక పరీక్షలు ప్రారంభిస్తారు. తదనంతరం ప్రతి నాలుగు నెలలకు ఒక యూనిట్ చొప్పున ఆరు యూనిట్ల ద్వారా మొత్తం 240మెగావాట్ల విద్యుత్‌ను పూర్తి స్థాయిలో సరఫరా చేసేందుకు పకడ్బందీ కార్యాచరణతో ముందుకు సాగుతున్నట్లు సీఈ తెలిపారు.