jalagam venkatarao
-
అటు వనమా.. ఇటు జలగం..
సాక్షి, హైదరాబాద్: కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్రావు ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చి న తీర్పుతో బీఆర్ఎస్లో వింత పరిస్థితి నెలకొంది. మూడు రోజుల క్రితం ఇ చ్చి న తీర్పుపై వనమా చే సుకున్న అప్పీల్‌ను హైకోర్టు కొట్టివేయడంతో జల గం వెంకట్రావు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని వనమా చెప్తుండగా, హైకో ర్టు తీర్పును అమలు చేయాలని జలగం కోరుతున్నారు. ఈ మేరకు ఆయన హైకోర్టు తీర్పు ప్రతిని బుధవారం అసెంబ్లీ కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి కూడా అందజేసిన విషయం తెలిసిందే. జలగంకు అనుకూలంగా హైకోర్టు ఇచ్చి న తీర్పుపై అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం, ఎన్నికల కమిషన్ ఎప్పటిలోగా, ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇద్దరు నేతలూ బీఆర్ఎస్లోనే.. కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2018లో బీఆర్ఎస్ నుంచి జలగం వెంకట్రావు, కాంగ్రెస్ నుంచి వనమా వెంకటేశ్వర్రావు పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందిన వనమా ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం వనమా, జలగం.. ఇద్దరూ ఒకే పార్టీలో కొనసాగుతున్నారు. జలగం బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నా అధికారిక కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉంటూ వస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ నేపథ్యంలో 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్ తరపున గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావు గుర్తింపు పొందారు. ప్రస్తుతం కోర్టు తీర్పు మేరకు తాను ఎమ్మెల్యేగా పదవి స్వీకరించినా బీఆర్ఎస్లోనే కొనసాగుతానని జలగం ప్రకటించారు. అయితే ఈ అంశంపై బీఆర్ఎస్ నుంచి అధికారికంగా ఎలాంటి స్పందన వెలువడలేదు. కోర్టు తీర్పు నేపథ్యంలో సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం జలగం ప్రయతి్నంచినట్లు తెలుస్తోంది. అయితే పార్టీ పూర్తిగా తమ వెంటే ఉందని వనమా వర్గీయులు ‘సాక్షి’తో అన్నారు. జలగం ప్రమాణ స్వీకారంపై స్పష్టత వ చ్చి న తర్వాతే స్పందించాలని బీఆర్ఎస్ అధినేత భావిస్తున్నట్లు తెలిసింది. వనమాపై ఐదేళ్ల నిషేధం నేపథ్యంలో.. వనమా ఎన్నిక చెల్లదని తీర్పుని చ్చి న హైకోర్టు ఆయన ఐదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించింది. దీంతో వచ్చే ఎన్నికల్లోనూ తనకు బీఆర్ఎస్ టికెట్ లభిస్తుందని జలగం భావిస్తున్నారు. మరోవైపు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్‌రావు కూడా కొత్తగూడెం బీఆర్ఎస్ టికెట్‌ను ఆశిస్తున్నారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో కొత్తగూడెం రాజకీయాలతో బీఆర్ఎస్లో వింత స్థితి నెలకొందని పరిశీలకులు అంటున్నారు. -
డోలాయమానంలో గడల శ్రీనివాసరావు రాజకీయ భవిష్యత్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ హైకోర్టు మంగళవారం వెలువరించిన తీర్పు జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారింది. బీఆర్ఎస్ అధిష్టానం ఈ అంశంపై అచితూచి వ్యవహరిస్తోంది. హైకోర్టు తీర్పును సవాల్ చేసే ప్రయత్నాల్లో వనమా వర్గం ఉండగా, అదే తీర్పును అమల్లో పెట్టాలంటూ జలగం సంబంధిత అధికారులను కలుస్తున్నారు. మరోవైపు కొత్తగూడెం నుంచి కారు గుర్తుపై పోటీ చేయాలని గంపెడాశలు పెట్టుకున్న నేతల ఆశలపై హైకోర్టు తీర్పు నీళ్లు చల్లినట్లయింది. తారుమారు గత ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన జలగం వెంకట్రావు ఓటమి పాలవ్వగా వనమా కాంగ్రెస్ నుంచి గెలిచారు. అయితే అందరి అంచనాలను తారుమారు చేస్తూ వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్లో చేరారు. దీంతో నియోజకవర్గంలో ఇద్దరు నేతలు ఉండగా, మూడో వ్యక్తికి ఇక్కడ అవకాశం దొరకడం దుర్లభం అనే పరిస్థితి ఉండేది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత జలగం వెంకట్రావు నియోజకవర్గంలో పెద్దగా హడావుడి చేసింది లేదు. అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తూ వచ్చారు. మరోవైపు వనమా రాఘవపై పోలీస్ కేసులు నమోదు కావడంతో సీన్ మారిపోయింది. హడావుడి చేస్తున్న గడల జలగం పెద్దగా నియోజకవర్గానికి రాకపోవడం, మరోవైపు వనమా కుటుంబంపై కేసులు – వయోభారాన్ని సాకుగా చూపుతూ కొత్తగూడెం సీటు నుంచి పోటీ చేసేందుకు చాలా మంది ఉత్సాహం చూపించారు. వీరందరినీ వెనక్కి నెడుతూ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు ముందు వరుసలోకి వచ్చారు. జీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాల పేరుతో రాజకీయ ప్రణాళికను అమల్లో పెట్టారు. సెలవు చిక్కితే చాలు కొత్తగూడెంలో వాలిపోతూ సిట్టింగ్ ఎమ్మెల్యే వనమాపై విమర్శలు చేస్తూనే మరోవైపు సీఎం కేసీఆర్‌పై పొగడ్తల వర్షం కురిపిస్తూ వచ్చారు. కేవలం ఏడాది వ్యవధిలోనే గడల పేరు అందరి నోళ్లలో నానే స్థాయికి చేరుకున్నారు. కొద్దిరోజులుగా వద్దిరాజు.. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొత్తగూడెం నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో ఉంటారని, ఆయనకు సమర్థంగా ఎదుర్కొనే అభ్యర్థి రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అంటూ కొంతకాలంగా కొత్త ప్రచారం ఊపందుకుంది. దీంతో కొత్తగూడెం నుంచి కారులో ఎవరికి బెర్త్ దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా హైకోర్టు తీర్పుతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఊహించని విధంగా జలగం వెంకట్రావు తెరమీదకు వచ్చారు. నిన్నా మొన్నటి వరకు గులాబీ పార్టీ నుంచి జలగం బరిలో ఉంటారా లేదా అనే స్థాయి నుంచి ఆయనే ఉంటారనే పరిస్థితి నెలకొంది. దీంతో కొత్తగూడెం టికెట్‌పై ఆశలు పెట్టుకున్న నేతలకు ఈ తీర్పు పిగుడుపాటులా మారిందనే అభిప్రాయం నియోజవర్గంలో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా గడల శ్రీనివాసరావు భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుందనే చర్చ మొదలైంది. అధిష్టానం ఆరా కొత్తగూడెం నియోజవర్గంలో పార్టీ పరిస్థితులపై ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ అధిష్టానం ఆరా తీస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఇక్కడ అనుసరించాల్సిన వ్యూహంపై ఇప్పటికే చర్చ మొదలైంది. హైకోర్టు ఇచ్చిన తీర్పుతో నష్టపోయిన, లాభపడిన ఇద్దరు వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీకి చెందినవారే కావడంతో పరిస్థితి సున్నితంగా మారింది. దీంతో పార్టీ తరఫున హడావుడిగా ప్రకటనలు చేయకుండా అన్ని అంశాలను నిశితంగా పరిశీలించిన తర్వాతే ముందుకు వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అందువల్లే కోర్టు తీర్పు పట్ల జలగం, వనమా వర్గీలు తప్పితే పార్టీ పరంగా మిగిలినవారేవరు ఇప్పటివరకు స్పందించలేదు. మరోవైపు తీర్పు వెలువడిన తర్వాత ప్రగతి భవన్ నుంచి వనమాకు ఫోన్ వెళ్లినట్టు సమాచారం. రాజకీయాల్లో లాంటి పరిణామాలు సహజమేనని అన్నింటిని తట్టుకుని ముందుకు వెళ్లాలని సీఎం కేసీఆర్ వనమాకు సూచించినట్టు తెలుస్తోంది. గడ్డుకాలంలో వనమాకు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చినట్టు వనమా వర్గం నేతలు చెబుతున్నారు. చర్యలు మొదలయ్యాయి కొత్తగూడెం ఎమ్మెల్యేగా 2018, డిసెంబరు 12 నుంచి నన్ను గుర్తించాలని ఎన్నికల కమిషన్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీటికి సంబంధించిన తీర్పు కాపీలను ఈ రోజు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌కు అందించాను. అసెంబ్లీ స్పీకర్‌కు, సెక్రటరీలకు కూడా ఇచ్చాను. హైకోర్టు తీర్పును అనుసరించి తీసుకోవాల్సిన విధానపరమైన చర్యలు మొదలయ్యాయి. తుది అంకానికి చేరడానికి కొంత సమ యం పట్టవచ్చు. నాలుగేళ్లుగా కొత్తగూడెంలో ఆగి పోయిన అభివృద్ధిని పట్టాలెక్కిస్తాను. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రారంభించిన పనులే పూర్తి చేయలేకపోయారు. సమయం ఎంతుందన్నది కాదు, సంకల్పం ఎంత బలమైంది అనేది ముఖ్యం. – జలగం వెంకట్రావు ప్రజల నుంచి వేరు చేయలేరు ఎన్ని అవాంతరాలు ఎదురైనా కొత్తగూడెం ప్రజల నుంచి తనను ఎవరూ వేరు చేయలేరు. వార్డు సభ్యుని నుంచి మంత్రి స్థాయికి ఎదిగిన నాకు అఽధికారం, పదవులు కొత్త కాదు. గెలిచినపుడు ప్రజలతో ఉంటూ, ఓడినప్పుడు ప్రజలకు దూరంగా ఉండటం అనేది వారికి ద్రోహం చేసినట్టే. రూ.వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడంతోపాటు పార్టీ పటిష్టతకు కూడా పాటు పడుతున్నాను. నియోజకవర్గంలో 80 శాతం మంది ప్రజాప్రతినిధులను గెలిపించుకున్నాను. మున్నూరుకాపు, బీసీ వర్గానికి చెందిన నాపై కుట్రలు చేశారు. చివరి శ్వాస వరకు కేసీఆర్ అడుగుజాడల్లోనే నడుస్తాను. –వనమా వెంకటేశ్వరావు -
నన్ను ఎమ్మెల్యేగా గుర్తించండి: జలగం
సాక్షి, హైదరాబాద్: కొత్తగూడెం శాసనసభ్యుడిగా తనను గుర్తించాలని కోరుతూ జలగం వెంకట్రావు బుధవారం అసెంబ్లీ కార్యదర్శితో పాటు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిని కలిశారు. కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ తీర్పునిచ్చి న హైకోర్టు, ఆయనపై పోటీ చేసిన జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా గుర్తించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జలగం వెంకట్రావు అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నర్సింహాచార్యులను కలసి కోర్టు తీర్పు కాపీని అందజేశారు. సాయంత్రం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌తో కూడా సమావేశమై కోర్టు తీర్పు కాపీతో పాటు తన విజ్ఞాపన అందజేశారు. కాగా, కోర్టు తీర్పును పరిశీలించి, నిపుణుల అభిప్రాయం తీసుకున్న తర్వాత సమాచారం ఇస్తామని అసెంబ్లీ కార్యదర్శి, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ చెప్పినట్లు జలగం వెంకట్రావు ‘సాక్షి’కి వెల్లడించారు. ఈ అంశంపై తాను అసెంబ్లీ స్పీకర్‌తో ఫోన్లో మాట్లాడానని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ కోసమే పనిచేస్తా.. అసెంబ్లీ కార్యదర్శిని కలిసేందుకు వచ్చి న జలగం వెంకట్రావు ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. 2018 డిసెంబర్ 12వ తేదీ నుంచి తనను ఎమ్మెల్యేగా పరిగణించాలంటూ హైకోర్టు తీర్పునిచ్చి న విషయాన్ని ఆయన వివరించారు. తాను బీఆర్ఎస్లోనే కొనసాగుతూ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి పనిచేస్తానన్నారు. గతంలో ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి ఏం చేశానో ప్రజలకు తెలుసని, ఎన్నికల షెడ్యూలుకు మరో మూడు నెలల సమయం ఉన్నందున ప్రజలకు మరింత మేలు చేస్తానని వెంకట్రావు పేర్కొన్నారు. -
సీఎం బహిరంగ సభను విజయవంతం చేయాలి
సాక్షి, పాల్వంచ: ఈ నెల 4వ తేదీన ఖమ్మంలో జరిగే సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్ పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం స్థానిక పాత పాల్వంచలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ బరపటి వాసుదేవరావు, భువన సుందర్ రెడ్డి, జీవీకే మనోహర్, బుడగం రవికుమార్, కాల్వ భాస్కర్, పగిళ్ల వెంకటేశ్వర్లు, నిమ్మల శ్రీను, ఉబేద్ ఖాద్రి, సయ్యద్ యాకూబ్, లక్ష్మారెడ్డి, వాసుమళ్ల సుందర్రావు పాల్గొన్నారు. శ్రేణులు తరలిరావాలి సూపర్‌బజార్(కొత్తగూడెం): టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ ఈనెల 4న ఖమ్మంలో జరిగే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచార బహిరంగ సభకు పెద్దఎత్తున తరలివెళ్లాలని మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు పిలుపునిచ్చారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సుజాతనగర్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పెద్దమ్మతల్లికి నాయకుల పూజలు పాల్వంచరూరల్: టీఆర్ఎస్ బలపరిచిన ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అత్యధిక మెజార్టీతో గెలవాలని సోమవారం పెద్దమ్మతల్లి ఆలయంలో నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మండల పరిధిలోని రంగాపురం, నాగారం, దంతలబోరు, హరిజనవాడ పంచాయతీల్లో పార్టీ శ్రేణులు ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు కొత్వాల శ్రీనివాసరావు, టీఆర్ఎస్ నాయకులు కిలారు నాగేశ్వరరావు, రాజుగౌడ్,ఎస్వీఆర్కె ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు. -
ఆగ్రాలో రోడ్డు ప్రమాదం.. పాల్వంచ విద్యార్థి దుర్మరణం
పాల్వంచ రూరల్: ఆగ్రాలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం ఒడ్డుగూడేనికి చెందిన ఎస్కె.ఖాదర్ (23) దుర్మరణం చెందాడు. అక్కడ బీఎస్సీ అగ్రికల్చర్ సెకండియర్ చదువుతున్న అతడు ఫోన్ రీచార్జ్ చేయించుకునేందుకు తన క్యాంపస్ నుంచి స్నేహితుడితో కలసి బయటకు వచ్చాడు. రాజ్కామండీ ఎంజీరోడ్ మీదుగా వెళ్తుండగా వేగంగా వచ్చి న భారీ వాహనం ఖాదర్‌ను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయాన్ని స్నేహితుడు పాల్వంచలోని అతడి తమ్ముడు అల్లాబక్షికి ఫోన్ చేసి తెలిపాడు. మృతదేహాన్ని తీసుకొచ్చే ఆర్థిక స్తోమత కూడా లేకపోవడంతో కుటుంబసభ్యులు ఎమ్మెల్యే జలగం వెంకట్రావు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన విజ్ఞప్తి మేరకు కలెక్టర్ ఆగ్రాలోని యూనివర్సిటీ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఖాదర్ మృతదేహాన్ని విమానంలో హైదరాబాద్‌కు తీసుకువచ్చి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శుక్రవారం పాల్వంచకు చేర్చేవిధంగా ఏర్పాట్లు చేశారు. -
తెలంగాణ టూరిజం హాబ్‌గా ఖమ్మం..
- పార్లమెంటరీ సెక్రటరీ సీఎంఓ జలగం వెంకటరావు - కిన్నెరసానిని సందర్శించిన తెలంగాణ టూరిజం బృందం పాల్వంచ రూరల్: తెలంగాణ రాష్ట్రంలో టూరిజం హాబ్‌గా ఖమ్మం జిల్లాను అభివృద్ది చేయనున్నట్లు పార్లమెంటరీ సెక్రటరీ సీఎంఓ, కొత్తగూడెం శాసన సభ్యుడు జలగం వెంకటరావు చెప్పారు. పాల్వంచ మండల పరిధిలోని యానంబైల్ గ్రామపంచాయతీ పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిని బుధవారం తెలంగాణ టూరిజం బృందం సందర్శించింది. ఈ సందర్భంగా జలదృశ్యం విశ్రాంతి భవనంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం రాష్ట్రంలో ఉన్న ప్రకృతి వనరులను సద్వినియోగం చేసుకుని టూరిజాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలిపారు. ఇతర ప్రాంతాలనుంచి వచ్చే పర్యాటకులు జిల్లాలో మూడురోజులపాటు గడిపే విధంగా ఖమ్మం జిల్లాలో భద్రాచలం, కిన్నెరసాని ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని సంకల్పించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నీతి అయోగ్ కింద నియోజకవర్గానికి రూ.7 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఇందులో కిన్నెరసానిని రూ.3.23 కోట్ల వ్యయంతో ఏకో టూరిజం అభివృద్ధి కింద అద్దాలమేడ, కాటేజీల పునరుద్ధరణ, బోట్ షికారు, పర్యాటకులు చేపలను పట్టుకునే విధంగా ఏర్పాట్లు, బస్సు సౌకర్యం, కొత్తగూడెంలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా హరిత టూరిజం హోటల్ నిర్మాణం చేయనున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ మనోహార్, కన్జర్వేటర్ ఆనంద మోహన్, అటవీశాఖ డిఎఫ్ఓలు సి.శరవణ్, ఎ.వి. రావు, కేటీపీఎస్ సీఈ సిద్దయ్య, తహసీల్దార్ సమ్మిరెడ్డి, కేటీపీఎస్ ఎస్ఈ రాంప్రసాద్, ఈఈ రవీందర్, ఏడీఈ కోటేశ్వరరావు, టూరిజం కార్పొరేషన్ జిల్లా మేనేజర్ శ్రీనివాసరావు, ఆర్కిటెక్ట్ దివాకర్, పర్యాటక శాఖ జిల్లా అధికారి సుమన్‌చక్రవర్తి, కొత్తగూడెం డీఎస్పీ సురేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.