
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు
సాక్షి, పాల్వంచ: ఈ నెల 4వ తేదీన ఖమ్మంలో జరిగే సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్ పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం స్థానిక పాత పాల్వంచలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ బరపటి వాసుదేవరావు, భువన సుందర్ రెడ్డి, జీవీకే మనోహర్, బుడగం రవికుమార్, కాల్వ భాస్కర్, పగిళ్ల వెంకటేశ్వర్లు, నిమ్మల శ్రీను, ఉబేద్ ఖాద్రి, సయ్యద్ యాకూబ్, లక్ష్మారెడ్డి, వాసుమళ్ల సుందర్‌రావు పాల్గొన్నారు.
శ్రేణులు తరలిరావాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): టీఆర్‌ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ ఈనెల 4న ఖమ్మంలో జరిగే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచార బహిరంగ సభకు పెద్దఎత్తున తరలివెళ్లాలని మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు పిలుపునిచ్చారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సుజాతనగర్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
పెద్దమ్మతల్లికి నాయకుల పూజలు
పాల్వంచరూరల్: టీఆర్‌ఎస్ బలపరిచిన ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అత్యధిక మెజార్టీతో గెలవాలని సోమవారం పెద్దమ్మతల్లి ఆలయంలో నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మండల పరిధిలోని రంగాపురం, నాగారం, దంతలబోరు, హరిజనవాడ పంచాయతీల్లో పార్టీ శ్రేణులు ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు కొత్వాల శ్రీనివాసరావు, టీఆర్‌ఎస్ నాయకులు కిలారు నాగేశ్వరరావు, రాజుగౌడ్,ఎస్‌వీఆర్కె ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment