సాక్షి గుంటూరు: శశికృష్ణకు ఉరిశిక్ష విధిస్తూ వచ్చిన తీర్పుపై ఏమీ మాట్లాడలేనని.. హైకోర్టుకు వెళ్లే ఆర్థిక స్థోమత మాకు లేదు. తమకు ప్రభుత్వమే న్యాయం చేయాలని శశికృష్ణ తల్లి భూలక్ష్మి అన్నారు.
చదవండి: (రమ్య హత్య కేసులో సంచలన తీర్పు: కుటుంబ సభ్యులు ఏమన్నారంటే..)
ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 'మా అబ్బాయి ఇలా చేస్తాడని అసలు ఊహించలేదు. అసలు వారి మధ్య ఏం జరిగిందో కూడా మాకు తెలియదు. అంతకుముందు వారి ప్రేమ విషయం మాకు చెప్పలేదు. రమ్య తల్లిదండ్రులకు నేనేమీ చెప్పలేను. మావాడికి ఉరిశిక్ష వేస్తే చనిపోయిన పాప తిరిగి రాలేదు కదా?. ఆవేశం మీద మావాడు తప్పు చేశాడు. ఏ తల్లిదండ్రులకు ఇలాంటి బాధ రాకూడదు' అని శశికృష్ణ తల్లి భూలక్ష్మి అన్నారు.
చదవండి: (బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో సంచలన తీర్పు)
Comments
Please login to add a commentAdd a comment