సుప్రీం కోర్టులో రిలయన్స్‌కి చుక్కెదురు | Apex Court Rules In favour Of Amazon In Dispute With Future Retail | Sakshi
Sakshi News home page

సుప్రీం కోర్టులో రిలయన్స్‌కి చుక్కెదురు

Published Fri, Aug 6 2021 12:07 PM | Last Updated on Fri, Aug 6 2021 12:20 PM

Apex Court Rules In favour Of Amazon In Dispute With Future Retail - Sakshi

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో రిలయన్స్‌కు చుక్కెదురైంది. ఫ్యూచర్ రిటైల్ విషయంలో అమెజాన్‌కు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. గతంలో ఫ్యూచర్‌, రిలయన్స్ రిటైల్‌ గ్రూపుల మధ్య రూ 24,713 కోట్ల ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాన్ని అమెజాన్‌ సవాల్‌ చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. 

ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత రిలయన్స్‌ ఫ్యూచర్‌ డీల్ ఒప్పందాన్ని నిలిపేస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. ఈ వివాదానికి సంబంధించి సింగపూర్‌ ఎమర్జెన్సీ ఆర్బిట్రేటర్‌ ఇచ్చిన తీర్పు అమలు చేయాలని ఆదేశించింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement