
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రిలయన్స్– ఫ్యూచర్ గ్రూప్ మధ్య 21 నెలల క్రితం కుదిరిన ఒప్పందానికి తెరపడింది. ఫ్యూచర్ గ్రూప్‌లో భాగమైన ఫ్యూచర్ రిటైల్, ఇతర లిస్టెడ్ కంపెనీలకు చెందిన సెక్యూర్డ్ క్రెడిటార్స్ ఈ డీల్‌కు వ్యతిరేకంగా ఓటు వేయడం తెలిసిందే. దీంతో ఒప్పందం అమలు అసాధ్యమని రిలయన్స్ ఇండస్ట్రీస్ శనివారం స్పష్టం చేసింది.
కిశోర్ బియానీ ప్రమోట్ చేస్తున్న ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన రిటైల్, హోల్‌సేల్, లాజిస్టిక్స్, గిడ్డంగుల వ్యాపారాల్లోని 19 కంపెనీలను కొనుగోలు చేసేందుకు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ రూ.24,713 కోట్ల విలువైన ఒప్పందం చేసుకుంది. కానీ ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ ఈ డీల్‌ను వ్యతిరేకించింది. ఫ్యూచర్ రిటైల్‌కు చెందిన ఫ్యూచర్ కూపన్స్‌లో 49 శాతం వాటాను రూ.1,500 కోట్లకు అమెజాన్ కొనుగోలు చేసింది. రిలయన్స్–ఫ్యూచర్ గ్రూప్ డీల్ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపించింది.
చదవండి: జొమాటో సంచలన నిర్ణయం..వాటిపై పూర్తి నిషేధం..!
Comments
Please login to add a commentAdd a comment