supereme court
-
ట్రంప్ ఎన్నికల రేసులో ఉంటారా ?
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భవితవ్యం మరికొద్ది సేపట్లో తేలనుంది. ఈ ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల రేసులో ఆయన ఉంటారా లేదా అన్నదానిపై అమెరికా సుప్రీం కోర్టు కాసేపట్లో తీర్పు ఇవ్వనుంది. 2020అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ట్రంప్ మద్దతుదారులు వాషింగ్టన్‌లోని క్యాపిటల్ హిల్‌పై దాడి చేసి విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ కేసు ట్రంప్ మెడకు చుట్టుకుంది. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ 3వ సెక్షన్ ప్రకారం ఏదైనా పదవీ ప్రమాణం చేసి తిరుగుబాటుకు పాల్పడిన వారు తిరిగి ఎలాంటి ప్రభుత్వ పదవి చేపట్టేందుకు వీలు లేదు.ఇదే సెక్షన్ ఆధారంగా ఇప్పటికే కొందరు ఓటర్లు కొలరాడో సుప్రీం కోర్టులో కేసు వేశారు. ఈ కేసులో ట్రంప్‌నకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. దీంతో ఇప్పటికే ట్రంప్‌ను కొలరాడో ప్రైమరీ బ్యాలెట్లో పోటీ నుంచి తొలగించారు. అయితే తాజగా అప్పీల్ కోర్టులో రాజ్యాంగంలోని 14వ సవరణ సెక్షన్ 3 ట్రంప్‌నకు వర్తిస్తుందా లేదా అనేది తేల్చడంతో పాటు కొలరాడో కోర్టు ఇచ్చిన తీర్పుపైనా విచారణ జరగనుంది. మొత్తం 80 నిమిషాల పాటు ట్రంప్ న్యాయవాదులతో పాటు అవతలి పార్టీ న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు. అనంతరం కోర్టు తీర్పు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తీర్పుతో ట్రంప్ మళ్లీ అధ్యక్షుడయ్యే అవకాశాలున్నాయా లేదా అన్నది తేలిపోనుంది. కాగా, ట్రంప్ ఇప్పటికే ప్రారంభమైన ప్రైమరీ ఎన్నికల్లో అయోవా, న్యూ హ్యాంప్‌షైర్ నుంచి ఘన విజయం సాధించి రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి నామినేషన్ రేసులో హాట్ ఫేవరెట్‌గా మారారు. ఇదీ చదవండి.. మాల్దీవులలో సైనిక బలగాలపై భారత్ కీలక నిర్ణయం -
సుప్రీం కోర్టులో రిలయన్స్‌కి చుక్కెదురు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో రిలయన్స్‌కు చుక్కెదురైంది. ఫ్యూచర్ రిటైల్ విషయంలో అమెజాన్‌కు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. గతంలో ఫ్యూచర్, రిలయన్స్ రిటైల్ గ్రూపుల మధ్య రూ 24,713 కోట్ల ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాన్ని అమెజాన్ సవాల్ చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత రిలయన్స్ ఫ్యూచర్ డీల్ ఒప్పందాన్ని నిలిపేస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. ఈ వివాదానికి సంబంధించి సింగపూర్ ఎమర్జెన్సీ ఆర్బిట్రేటర్ ఇచ్చిన తీర్పు అమలు చేయాలని ఆదేశించింది. -
ఐపీఎల్‌కు దూరంగా ఉంటా: శ్రీనివాసన్
న్యూఢిల్లీ: బీసీసీఐ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇస్తే... ఐపీఎల్ పాలన వ్యవహారాలకు, ఇతర అంశాలకు దూరంగా ఉంటానని ఐసీసీ చైర్మన్ ఎన్.శ్రీనివాసన్ సుప్రీంకోర్టుకు తెలిపారు. ఇందుకు సంబంధించి అండర్ టేకింగ్‌ను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని శ్రీని తరఫు లాయర్ కపిల్ సిబల్ కోర్టుకు వెల్లడించారు. ఒకవేళ బోర్డు అధ్యక్షుడిగా మళ్లీ ఎన్నికైనా... ప్రతిపాదిత హైపవర్ ప్యానెల్ క్లీన్చిట్ ఇచ్చే వరకు ఐపీఎల్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోరన్నారు. ఐపీఎల్-6 స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్‌పై జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని బెంచ్ బుధవారం కూడా విచారణ కొనసాగించింది. మరోవైపు ప్రతిపాదిత హైపవర్ కమిటీ ఏర్పాటును బీసీసీఐ వ్యతిరేకించింది. శ్రీనివాసన్ అంశంలోగానీ, ముద్గల్ కమిటీ నివేదిక ఆధారంగా దోషులపై ఈ కమిటీ చర్యలు తీసుకోవడంగానీ సాధ్యంకాదని పేర్కొంది. ‘కమిటీ ఏర్పాటు వల్ల బోర్డు స్వతంత్ర ప్రతిపత్తి, నిర్ణయం తీసుకునే అధికారంపై ప్రభావం పడుతుంది. ఒకవేళ కచ్చితంగా కమిటీనే కావాలనుకుంటే బోర్డు గవర్నింగ్ బాడీ నిర్ణయం తీసుకోవాలి’ అని బీసీసీఐ న్యాయవాది సీఏ సుందరం తెలిపారు. ఎన్నికలు జనవరి 31 వరకు వాయిదా బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం, ఆఫీసు బేరర్ల ఎన్నికలను వచ్చే ఏడాది జనవరి 31 వరకు వాయిదా వేసుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. షెడ్యూల్ ప్రకారం ఏజీఎమ్ ఈనెల 17న జరగాల్సి ఉంది. కానీ ఆ తేదీలోపు ఈ కేసు విచారణ పూర్తయ్యేటట్లు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. -
‘హోదా’ గురించి సుప్రీంకు గవాస్కర్ లేఖ
న్యూఢిల్లీ: బీసీసీఐలో ప్రస్తుత తన స్థానం గురించి స్పష్టత ఇవ్వాలని తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతున్న మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సుప్రీం కోర్టుకు లేఖ రాశారు. ఐపీఎల్-7 సీజన్ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు గత మార్చిలో గవాస్కర్‌ను సుప్రీం కోర్టు తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించింది. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసు విచారణ పూర్తయ్యే దాకా అధ్యక్ష పదవికి దూరంగా ఉండాల్సిందిగా శ్రీనివాసన్‌ను కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ‘మార్చి చివరలో ఐపీఎల్ ముగిసేదాకా నేను తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగేందుకు సుప్రీం ఆదేశించింది. మే మధ్యలో ఓ సారి.. తాము ఆదేశించే వరకు పదవిలో కొనసాగాలని నాతోపాటు శివలాల్ యాదవ్‌కు సూచించింది. అందుకే అయోమయ పరిస్థితి తొలగించుకునేందుకు లేఖ రాశాను. అయితే ఈ బాధ్యతల్లో ఉన్నందుకు బోర్డు నుంచి తగిన పరిహారం ఇప్పించాలని కోర్టుకు లేఖ రాసినట్టు వచ్చిన వార్తలు అవాస్తవం’ అని గవాస్కర్ స్పష్టం చేశారు. -
‘ఎన్నికల్లో సమగ్ర సంస్కరణలు తీసుకురావాలి’
అనంతపుర సిటీ, న్యూస్‌లైన్: ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రధాన భూమిక పోషిస్తున్నాయని.. వాటి ప్రభావం తగ్గించి ప్రజా స్వామ్యాన్ని కాపాడాలంటే ఎన్నికల నిర్వహణలో సమగ్ర సంస్కరణలను తీసుకురావాలని సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకూ నిర్వహించిన అనేక ఎన్నికల్లో డబ్బు, కులం ప్రధానంగా మారాయన్నారు. ఓటర్లకు డబ్బు ఎర చూపి నేరచరితులు సైతం ఎన్నికల్లో పోటీ చేస్తుంటే.. కులాన్ని ప్రచారం చేస్తూ మరికొంత మంది అధికారాన్ని చేజిక్కించుకుంటున్నారన్నారు. ఫలితంగా నిజాయితీ కలిగిన సామాన్య ప్రజలు పోటీకి అనర్హులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దామాషా పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఈ తరుణంలో ఓటరుకు తిరస్కరణ ఆయుధం ఇస్తూ సుప్రీం కోర్డు తీర్పునివ్వడం శుభ పరిణామంగా అభివర్ణించారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని 60 రోజులుగా సీమాంధ్రలో ఉద్యమాలు కొనసాగుతున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. ఫలితంగా సీమాంధ్ర ప్రజలు, ఉద్యోగులు, కార్మికులు ఉపాధి అవకాశాలు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. పరిష్కరించాల్సిన ప్రభుత్వం తెలంగాణ నోట్ రెడీ అయింది.. త్వరలో ప్రకటిస్తామంటూ ప్రకటనలు చేస్తూ.. సీమాంధ్ర, తెలంగాణ ప్రజల మధ్య చిచ్చుపెడుతోందనానరు. సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కేశవరెడ్డి, సీపీఐ కదిరి నియోజకవర్గ కార్యదర్శి వేమయ్య యాదవ్, చేతివృత్తిదారుల సమాఖ్య నాయకులు వేమయ్య, నాగరాజు పాల్గొన్నారు.