లాంక్షైర్ క్రికెట్ క్లబ్ స్టార్ ఆల్ రౌండర్ స్టీవెన్ క్రాఫ్ట్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. స్టీవెన్ క్రాఫ్ట్ ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. గతేడాది ఫస్ట్‌క్లాస్ క్రికెట్, లిస్ట్-ఎ క్రికెట్‌కు విడ్కోలు పలికిన క్రాప్ట్.. టీ20ల్లో మాత్రం కొనసాగాడు.
ఈ ఏడాది దేశీవాళీ టీ20 సీజన్‌కు ముందు లాంక్షైర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. కానీ ఇప్పుడు పూర్తిగా అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకోవాలని స్టీవెన్ నిర్ణయించుకున్నాడు. ఇకపై లాంక్షైర్ క్రికెట్ క్లబ్ కోచింగ్ స్టాఫ్‌లో అతడు పనిచేయనున్నట్లు తెలుస్తోంది. లాంక్షైర్ క్రికెట్ క్లబ్ తరుపున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా తన కెరీర్‌ను క్రాప్ట్ ముగించాడు.
నా చిన్నతనం నుంచి లంకాషైర్‌కు ఆడాలన్నది నా కల. అటువంటిది ఏకంగా 600 మ్యాచ్‌లు లంకాషైర్ తరపున ఆడాడు. రెండు దశాబ్దాల పాటు లంకాషైర్ క్రికెట్ క్లబ్‌కు ప్రాతినిథ్యం వహించాను. ఇక నేను రిటైర్ అవ్వాల్సిన సమయం అసన్నమైంది. యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చేందుకు పూర్తిగా ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయంచుకున్నాను అని ఓ ప్రకటనలో క్రాఫ్ట్ పేర్కొన్నాడు. ఈ క్రికెట్ క్లబ్ తరపున అతడు 5,486 పరుగులు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment