Steve
-
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్..
లాంక్షైర్ క్రికెట్ క్లబ్ స్టార్ ఆల్ రౌండర్ స్టీవెన్ క్రాఫ్ట్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. స్టీవెన్ క్రాఫ్ట్ ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. గతేడాది ఫస్ట్‌క్లాస్ క్రికెట్, లిస్ట్-ఎ క్రికెట్‌కు విడ్కోలు పలికిన క్రాప్ట్.. టీ20ల్లో మాత్రం కొనసాగాడు.ఈ ఏడాది దేశీవాళీ టీ20 సీజన్‌కు ముందు లాంక్షైర్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. కానీ ఇప్పుడు పూర్తిగా అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకోవాలని స్టీవెన్ నిర్ణయించుకున్నాడు. ఇకపై లాంక్షైర్ క్రికెట్ క్లబ్ కోచింగ్ స్టాఫ్‌లో అతడు పనిచేయనున్నట్లు తెలుస్తోంది. లాంక్షైర్ క్రికెట్ క్లబ్ తరుపున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా తన కెరీర్‌ను క్రాప్ట్ ముగించాడు.నా చిన్నతనం నుంచి లంకాషైర్‌కు ఆడాలన్నది నా కల. అటువంటిది ఏకంగా 600 మ్యాచ్‌లు లంకాషైర్ తరపున ఆడాడు. రెండు దశాబ్దాల పాటు లంకాషైర్ క్రికెట్ క్లబ్‌కు ప్రాతినిథ్యం వహించాను. ఇక నేను రిటైర్ అవ్వాల్సిన సమయం అసన్నమైంది. యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చేందుకు పూర్తిగా ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయంచుకున్నాను అని ఓ ప్రకటనలో క్రాఫ్ట్ పేర్కొన్నాడు. ఈ క్రికెట్ క్లబ్ తరపున అతడు 5,486 పరుగులు చేశాడు. -
5 శాతం వృద్ధి కోసం కష్టించాల్సిందే...
న్యూఢిల్లీ: భారత్ 2020లో 5 శాతం వృద్ధి రేటు కోసం కష్టపడాల్సి ఉంటుందన్నారు అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త స్టీవ్ హంకే. ‘‘గత కొన్ని త్రైమాసికాల్లో వృద్ధి రేటు గణనీయంగా తగ్గిపోవడం అన్నది రుణాల లభ్యత నిలిచిపోవడం వల్లే. ఇది సైక్లికల్ సమస్యే కానీ, నిర్మాణపరమైనది కాదు. ఈ పరిస్థితుల్లో 2020లో 5 శాతం జీడీపీ వృద్ధిని సాధించాలంటే కష్టపడాల్సి ఉంటుంది’’ అంటూ జాన్ హప్కిన్స్ యూనివర్సిటీలో అప్లయిడ్ ఎకనమిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న హంకే పేర్కొన్నారు. భారత్ నిలకడలేని రుణాల బూమ్‌ను చవిచూసిందని, భారీగా పెరిగిపోయిన ఎన్పీఏ సమస్య నుంచి బయటపడేందుకు బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. భారత్ ఎంతో రక్షణాత్మకంగా వ్యవహరించే దేశమని గుర్తు చేశారు. అవసరమైన గట్టి సంస్కరణలను చేపట్టే విషయంలో మోదీ సర్కారుకు ఆసక్తి తక్కువగా ఉన్నట్టు కనిపిస్తోందని హంకే అభిప్రాయపడ్డారు. -
డీమోనిటైజేషన్ చేతగానితనమే
• దేశమెటు పోతోందో మోదీకీ తెలీదు • అమెరికన్ ఆర్థికవేత్త స్టీవ్ వ్యాఖ్యలు న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు వ్యవహారంలో ప్రధాని నరేంద్ర మోదీపై అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. డీమోనిటైజేషన్ చేతగానితనమేనని తాజాగా ప్రఖ్యాత అమెరికా ఆర్థికవేత్త స్టీవ్ హెచ్ హాంకీ విమర్శించారు. ఆది నుంచీ ఇది గందరగోళంగానే సాగిందని సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విటర్లో వ్యాఖ్యానించారు. దేశమెటు పోతోందో ఎవరికీ తెలియదని.. మోదీకి అస్సలు తెలియదని పేర్కొన్నారు. స్టీవ్ గతంలో కూడా డీమోనిటైజేషన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీ ప్రకటించిన డీమోనిటైజేషన్ను అమలు చేసేంతగా భారత్‌లో మౌలికసదుపాయాలు లేవని ఆయన తెలిపారు. ఈ విషయం మోదీ గుర్తెరిగి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. నల్లధనంపై పోరు పేరుతో రూ. 500, రూ. 1,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు నవంబర్ 8న మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. డీమోనిటైజేషన్ ప్రభావంతో స్థూల దేశీయోత్పత్తి వృద్ధిపై అరశాతం దాకా ప్రతికూల ప్రభావం పడొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి.