డీమోనిటైజేషన్‌ చేతగానితనమే | Demonetisation is for losers: American economist Steve H Hanke | Sakshi
Sakshi News home page

డీమోనిటైజేషన్‌ చేతగానితనమే

Published Tue, Feb 7 2017 1:22 AM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM

డీమోనిటైజేషన్‌ చేతగానితనమే - Sakshi

డీమోనిటైజేషన్‌ చేతగానితనమే

దేశమెటు పోతోందో మోదీకీ తెలీదు
అమెరికన్‌ ఆర్థికవేత్త స్టీవ్‌ వ్యాఖ్యలు


న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు వ్యవహారంలో ప్రధాని నరేంద్ర మోదీపై అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. డీమోనిటైజేషన్‌ చేతగానితనమేనని తాజాగా ప్రఖ్యాత అమెరికా ఆర్థికవేత్త స్టీవ్‌ హెచ్‌ హాంకీ విమర్శించారు. ఆది నుంచీ ఇది గందరగోళంగానే సాగిందని సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ ట్విటర్‌లో వ్యాఖ్యానించారు. దేశమెటు పోతోందో ఎవరికీ తెలియదని.. మోదీకి అస్సలు తెలియదని పేర్కొన్నారు. స్టీవ్‌ గతంలో కూడా డీమోనిటైజేషన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మోదీ ప్రకటించిన డీమోనిటైజేషన్‌ను అమలు చేసేంతగా భారత్‌లో మౌలికసదుపాయాలు లేవని ఆయన తెలిపారు. ఈ విషయం మోదీ గుర్తెరిగి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. నల్లధనంపై పోరు పేరుతో రూ. 500, రూ. 1,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు నవంబర్‌ 8న మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. డీమోనిటైజేషన్‌ ప్రభావంతో స్థూల దేశీయోత్పత్తి వృద్ధిపై అరశాతం దాకా ప్రతికూల ప్రభావం పడొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement