
నెదర్లాండ్స్ కెప్టెన్ పీటర్ సీలార్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు సీలార్ ఆదివారం రిటైర్మెంట్ ప్రకటించాడు. వెన్ను గాయం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అతడు తెలిపాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతోన్న వన్డే సిరీస్‌లో నెదర్లాండ్స్ కెప్టెన్ పీటర్ సీలార్ ఉన్నాడు. అయితే గాయం కారణంగా ఆదివారం జరిగిన రెండో వన్డేకు దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో వికెట్ కీపర్-బ్యాటర్ స్కాట్ ఎడ్వర్డ్స్ సారథ్య బాధ్యతలు చేపట్టాడు.
కాగా పీటర్ బోరెన్ 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో సీలార్ నెదర్లాండ్స్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. 2006 లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సీలార్ దాదాపు 16 ఏళ్ల పాటు నెదర్లాండ్స్ క్రికెట్‌కు సేవలు అందించాడు. "2020 ఏడాది తర్వాత నా వెన్నునొప్పి మరింత తీవ్రమైంది. కాబట్టి అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించకున్నాను. నాకు ఇన్నాళ్లు మద్దుతుగా నిలిచిన అభిమానులకు,నెదర్లాండ్స్ క్రికెట్ బోర్డ్‌కు ధన్యవాదాలు" అని సీలార్ పేర్కొన్నాడు.
చదవండి: Wriddhiman Saha: త్రిపుర జట్టుకు మెంటార్‌గా వృద్ధిమాన్ సాహా..!
Comments
Please login to add a commentAdd a comment