ఆరోతరగతి చదువుతున్న విద్యార్థినితో ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన నగరంలోని ఉప్పల్ భరత్‌నగర్‌లో శనివారం వెలుగులోకి వచ్చింది
హైదరాబాద్: ఆరోతరగతి చదువుతున్న విద్యార్థినితో ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన నగరంలోని ఉప్పల్ భరత్‌నగర్‌లో శనివారం వెలుగులోకి వచ్చింది. స్థానిక జోషీ స్కూల్‌లో చదువుతున్న బాలికతో పాఠశాలకు చెందిన ఓ ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడు.
బాలిక ద్వారా విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు శనివారం పాఠశాల ఎదుట ఆందోళన నిర్వహించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుడిపై దాడిచేశారు. జరిగిన సంఘటనపై వెంటనే డీఈవో చర్యలు చేపట్టి పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చస్తున్నాయి.