
కీచక ఉపాధ్యాయుడిపై కేసు నమోదు
పెదపూరుపూడి : విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు విద్యార్ధుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో తల్లిదండ్రులు చితకబాదారు. ఈఘటన కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం యలమర్రు జెడ్పీ హైస్కూల్‌లో జరిగింది. తెలుగు ఉపాధ్యాయుడు రామకృష్ణ కొంతకాలంగా విద్యార్థినులను వేధిస్తున్నాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, గ్రామస్తులు కీచక టీచర్‌కు దేహశుద్ధి చేసి.. పోలీసులకు అప్పగించారు.
గతంలో కూడా రామకృష్ణ వేధింపులకు పాల్పడేవాడని.... విద్యార్థులు ఈవిషయాన్ని తల్లిదండ్రులకు తీసుకు వెళ్లటంతో....వారు ప్రధాన ఉపాధ్యాయుడికి ఫిర్యాదు చేశారు. అయితే ప్రధాన ఉపాధ్యాయుడు ఎలాంటి చర్యలు తీసుకోకపోవటంతోనే కీచక టీచర్కు దేహశుద్ది చేసినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు.
కాగా ఉపాధ్యాయుడు రామకృష్ణపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ భాస్కరరావు తెలిపారు. విద్యార్థులు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సెక్షన్ 354 బి ప్రకారం కేసు నమోదు చేసి కోర్టుకు తరలించినట్లు ఎస్ఐ వెల్లడించారు.