బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ బీటెక్ విద్యార్థి కటకటాల పాలయ్యాడు.
హైదరాబాద్: బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ బీటెక్ విద్యార్థి కటకటాల పాలయ్యాడు. వివరాలివీ.. హైదరాబాద్ పాతబస్తీ సదాత్‌నగర్ వాసి సయీద్ హమీద్ కుమారుడు అమేర్(19) బీటెక్ చదువుకుంటున్నాడు. అతడు గురువారం ఇంటికి సమీపంలోనే ఉండే బాలిక(8) వీధిలో ఆడుకుంటుండగా కుర్కురే కొనిస్తానని లోపలికి పిలిచాడు. అసభ్యకరంగా ప్రవర్తించటంతో భయపడి ఇంటికి వెళ్లిన బాలిక జరిగిన విషయం తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఛత్రినాక పోలీసులు అమేర్‌ను అదుపులోకి తీసుకుని పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు.