భువనేశ్వర్: రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఐదుగురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేసినట్లు మల్కాన్గిరి జిల్లా కలెక్టర్ డి. ప్రశాంత్ కుమార్ రెడ్డి సోమవారం వెల్లడించారు. జిల్లాలోని ముడిలిపడ ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో వసతి పొందిన విద్యార్థులకు సరైన అహారం, వసతులు సరిగ్గా కల్పించడం లేదని ఆరోపణలు వెల్లువెత్తాయి.
అంతేకాకుండా పాఠశాలలో విద్యార్థులు క్రమంగా తగ్గిపోవడంతో.... ప్రభుత్వం దృష్టి సారించి విచారణకు ఆదేశించింది. దీంతో ఉన్నతాధికారులు విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. రెసిడెన్షియల్ పాఠశాలలోని విద్యార్థులకు సరైన అహారం పెట్టకుండా, వసతులు కూడా కల్పించకపోవడంతోపాటు ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల అసభ్యకరం ప్రవర్తిస్తున్నారని విద్యార్థులు విచారణ అధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఐదురుగు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా కలెకర్ట్ ప్రశాంత్ కుమార్ రెడ్డి తెలిపారు. సస్పెన్షన్ అయిన వారిలో ప్రధాన ఉపాధ్యాయుడు కూడా ఉన్నారని చెప్పారు.