Malkangiri district
-
ఒడిశాలో మావోయిస్టుల ఆయుధ డంప్ స్వాధీనం..
భువనేశ్వర్: ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో BSF బెటాలియన్ సిబ్బంది నిర్వహించిన సోదాల్లో మావోయిస్టుల భారీ ఆయుధ సామాగ్రి లభ్యమైంది. పక్క సమాచారంతో జరిపిన సోదాల్లో లభ్యమైన ఈ సామాగ్రి మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు సరిహద్దు భద్రతా దళాలు. బెజంగివడ రిజర్వ్ ఫారెస్ట్‌లో మావోయిస్టుల కదలికలపై పక్కా సమాచారం అందడంతో మల్కన్‌గిరి జిల్లాలో BSF బెటాలియన్ సిబ్బంది సోమవారం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. ఇందులో భాగంగా మల్కన్ గిరి జిల్లాలోని కలిమెల పోలీస్ పరిధి అమపాదర్-ఎల్కనూర్ గ్రామం, బోడిలుగూడ- బృందమామిడి సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్‌లో జరిపిన సోదాల్లో రాకెట్ లాంచర్లతో సహా భారీ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు BSF సిబ్బంది. సరిహద్దు భద్రతా దళాల వారు స్వాధీనం చేసుకున్న ఆయుధాల్లో ఒక 303 రైఫిల్, 11 బ్యారెల్ (SBML), 303 రైఫిల్ యొక్క మ్యాగజైన్, 15 మెరుగైన హ్యాండ్ గ్రెనేడ్లు, మూడు దేశీయ తుపాకులు, రెండు 51 MM మోర్టార్ బాంబులు, ఒక గ్యాస్ వెల్డింగ్ యంత్రం, 42 లైవ్ కాట్రిడ్జ్‌లు, రాకెట్ లాంచర్, రెండు బ్రెన్ 303 ఎల్ఎంజీ స్పేర్ బ్యారెల్స్, 29 జెలటిన్ స్టిక్స్, ఐదు అల్యూమినియం నైట్రేట్ ప్యాకెట్లు, 30 ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, తొమ్మిది సింథటిక్ వెయిస్ట్ బెల్ట్‌లు ఉన్నాయి. ఒకప్పుడు ఈ ప్రాంతం మావోయిస్టులకు వారి సానుభూతిపరులకు కంచుకోటగా ఉండేదని, వామపక్ష దళాలు పేలుడు ముడి పదార్థాలను ఇటువంటి రిమోట్ ప్రదేశాలలో ఉంచి అవసరమైనప్పుడు వీటిని ఉపయోగిస్తూ ఉంటారని తెలిపింది BSF సిబ్బంది. ఒక్కసారిగా ఇంత పెద్ద మొత్తంలో ఆయుధ సామగ్రి దొరకడంతో మావోయిస్టుల ఉనికి నిర్ధారణ అయ్యిందని అనుమానిత ప్రాంతాల్లో కూడా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న యాత్రికులు -
వీపులు పగులుతయ్! పాపాలు నశిస్తయ్! ఈ పండుగ గురించి తెలుసా?
మల్కన్‌గిరి (ఒడిశా): జిల్లాలోని ఖొయిరాపుట్ సమితి, బోండా ఘాటీ ప్రాంతంలో పుష్య పొరబ్ (పండగ) శనివారం సంప్రదాయంగా నిర్వహించారు. తరతరాలుగా ఏటా పుష్య మాసంలో చేసుకునే ఈ పండగలో బోండా జాతి గిరిజనులు నెలంతా అడవి తల్లికి పూజలు చేస్తారు. చివరి 3 రోజులను జాండీ ఉత్సవంగా భావించి, అడవిలో పుట్టి పెరిగిన కర్రలతో ఒకరినొకరు కొట్టుకుంటారు. సంప్రదాయ నృత్య ప్రదర్శనలో బోండా జాతి గిరిజనులు ఇలా దెబ్బలు తినడం ద్వారా ఏడాది అంతా చేసిన పాపాలు నశిస్తాయని వీరి నమ్మకం. శనివారం ఉదయం జరిగిన ఈ వేడుకలో ముదిలిపొడ, దుమురుపొడ, తులగురం, బైగూడ, హంద్రహల్, బద్బేల్ గ్రామస్తులు సంప్రదాయ నృత్యాలు చేస్తూ ఆనందోత్సాహాలతో గడిపారు. (చదవండి: హిమాచల్ తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్) గిరిజనుడి వీపుపై గాయాలు -
60 కుటుంబాలు.. ఒక జలదేవత
గొడ్డలి నీటిలో పారవేసుకుంటే జలదేవత ప్రత్యక్షమవడం మనకు తెలుసు. కాని ఇక్కడ నీళ్లు లేవు. పారవేసుకోవడానికి పెన్నిధీ లేదు. ఆకలి బతుకుల గిరిజన జీవితం తప్ప. ఒరిస్సా అడవిలో అరవై కుటుంబాలు. ఎవరికి పడతాయి. తాగడానికి నీళ్లు లేక గొంతెండిపోతున్నాయి. అప్పుడు మాలతి సిసా వచ్చింది. ఏకంగా నీరు తగిలేంత లోతు బావి తవ్వింది. ‘వాటర్ గర్ల్’ అని మీడియా అంటోంది. జలదేవతే సరైన పదం. ఇది అచ్చు సినిమాల్లో జరిగినట్టే జరిగింది. 25 ఏళ్ల మాలతి భువనేశ్వర్‌లోని కళింగ యూనివర్సిటీలో ఎం.ఏ ఎకనామిక్స్ చేసి మల్కన్‌గిరి జిల్లాలోని తన గ్రామం బోండాఘాటీకి చేరుకుంది రెండు నెలల క్రితం. బోండాఘాటి అడవి ప్రాంతం. అక్కడ బోండులు అనే గిరిజన తెగ జీవిస్తూ ఉందని 1950 వరకూ భారత ప్రభుత్వం గుర్తించలేదు. గుర్తించాక కూడా వారి కోసం జరిగింది తక్కువ. ఇంకా చెప్పాలంటే మాలతి ఆ ఊరి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తొలి అమ్మాయి. అంటే ఇన్నేళ్లు అక్కడ వారి అభివృద్ధికి ఏ మేరకు పని జరిగిందో అర్థం చేసుకోవచ్చు. సరే, అభివృద్ధి పెద్దమాట. తాగడానికి నీళ్లు ప్రాణాధారం కదా. చిన్నప్పటి నుంచి చూస్తున్నట్టే ఇప్పుడూ తన కుటుంబం నీళ్ల కోసం అవస్థ పడటం మాలతి గమనించింది. ఊళ్లో ఉండే బోరింగులు పాడయ్యాయి. కుళాయిలు పని చేయవు. నీళ్లు కావాలంటే తల్లి, తన ముగ్గురు చెల్లెళ్లు కిలోమీటరు మేర బిందెలు తల మీద పెట్టుకుని బయలుదేరాల్సిందే. ఇంతకు ముందు ఇదంతా మామూలు మాలతికి. కాని ఇప్పుడు తను చదువుకుంది. తనకు జరుగుతున్న అన్యాయం ఏమిటో... తమ వారి పరిస్థితులు ఏమిటో... బయట లోకం ఎలా ఉందో చూసింది. ఈ కష్టాలు మనమే తీర్చుకోవచ్చు అని తల్లిదండ్రులకు చెప్పింది. ‘మనమే బావి తవ్వుదాం’ అంది. ఇలా ఊళ్లో ఎవరూ ముందుకు వచ్చిన దాఖలా లేదు. మాలతి తండ్రి ధబులు, తల్లి సమరి కూతురికి సపోర్ట్ చేయాలనుకున్నారు. మాలతి ముగ్గురు చెల్లెళ్లు సుక్రి, లిలీ, రంజిత... ‘అక్కా... మేము నీకు సాయం పడతాం’ అన్నారు. ‘ఈ బావి మన కోసం మాత్రమే కాదు... ఊళ్లో ఉన్న 60 కుటుంబాల కోసం’ అంది మాలతి. వెంటనే బావి తవ్వే పని మొదలైంది. మాలతి, ఆమె ముగ్గురు చెల్లెళ్లు పలుగూ పారా తీసుకుని నాలుగైదు అడుగుల వెడల్పు ఉన్న చుట్టు బావి తవ్వడం మొదలెట్టారు. తలా కొంచెం తవ్వి పోస్తున్నారు. 14 అడుగుల లోతుకు వెళ్లాక నీళ్లు పడ్డాయి. కాని సహజంగానే అవి బురద నీరు. ఆ నీటిని తోడి పోస్తూ మరి కాస్త లోతుకు వెళితే తేట నీరు వస్తాయి. ‘నా దగ్గర డబ్బు లేదు. అయినా నీ కోసం ప్రయత్నిస్తా’ అని తండ్రి అటు తిరిగి ఇటు తిరిగి 7 వేలు తెచ్చి మాలతికి ఇచ్చాడు. మాలతి దాంతో మోటరు కొని బురద నీళ్లు బయటకు తోలించింది. మళ్లీ బావి తవ్వింది. ఇప్పుడు తేట నీళ్లు వచ్చాయి. తియ్యటి నీళ్లు. దాహం తీర్చే నీళ్లు. ఊళ్లోని అందరూ వచ్చి ఈ నీళ్లు చూసి మాలతిని పట్టుకుని మెటికలు విరిచారు. ‘మా తల్లే మా తల్లే’ అన్నారు. మాలతిని చూసి ఇంకో రెండు మూడు యువ బృందాలు మరో రెండు మూడు బావులు తవ్వుతున్నాయి. అవి పూర్తవుతున్నాయి కూడా. ఈ సంగతి తెలిసిన మీడియా మాలతి మీద కథనాలు రాసి ఆమెను ‘వాటర్ గర్ల్’గా వ్యాఖ్యానించాయి. అధికారులు కదిలారు. ‘మీ బావి ఖర్చు, కూలి ఖర్చు ఇస్తాం’ అంటున్నారు. ‘వాటి సంగతి తర్వాత నా బావికి సిమెంటు రింగులు లేవు అవి వేయించండి’ అంటోంది మాలతి. మాలతి తల్లిదండ్రులు చాలా సంతోషిస్తున్నారు. ‘మా అమ్మాయి గొప్ప పని చేసింది’ అంటున్నారు. మాలతి ఇంతటితో ఆగాలని అనుకోవడం లేదు. గూడెంలో పిల్లలకు చదువు చెప్పాలని అనుకుంటోంది. అందరి కోసం పని చేయాలని అనుకుంటోంది. అంతా కలిసి 25 వేల జనాభా కూడా ఉండదు బోండులది. అరుదైన తెగ అది. దానిని కాపాడుకుని సంతోషంగా ఉండేలా చూడటం కూడా చేయడం లేదు ప్రభుత్వాలు. వారి కళ్లు తెరుచుకోవాలంటే ఇంటికో మాలతి అవసరమే. -
మా సప్న కనిపించడం లేదు..
మల్కన్‌గిరి: పోడియ సమితిలో ఆశావర్కర్‌గా పనిచేస్తున్న సప్నభయ్య అనే మహిళ అదృశ్యమైందని, ఆమె భర్త జగదీష్ భయ్య సోమవారం పోడియ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నెల 3వ తేదీ నుంచి సప్న కనిపించడం లేదని, కొత్తగుఢ గ్రామంలో మహిళకు ప్రసవం ఉందని చెప్పి వెళ్లిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. సాయంత్రమైనా రాకపోవడం, సెల్‌ఫోన్ స్విచాఫ్ ఉండడంతో ఆమె తల్లిదండ్రులకు సమాచారమిచ్చాడు. ఆపై భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిడ్నాప్ కోణంలో విచారణ చేపట్టారు. -
స్వాభిమాన్ జలాశయంలో నాటు పడవ బోల్తా
మల్కన్‌గిరి: జిల్లాలోని చిత్రకొండ సమితి స్వాభిమాన్ ఏరియా జలాశయంలో నాటు పడవ బోల్తాపడి ముగ్గురు గల్లంతయ్యారు. వివరాలిలా ఉన్నాయి. సమితిలోని ఓండ్రాపల్లి పంచాయతీ ఓరపొదర్ గ్రామానికి చెందిన 8 మంది వ్యక్తులు, అదే పంచాయతీ దామోదర బేడ గ్రామానికి చెందిన గోపాల్ ముదులి (45), కుమార్తె జమున ముదులి, మూడేళ్ల మనుమడు కోరుకొండ సమితిలోని నక్కమమ్ముడి పంచాయతీ భకులి గ్రామానికి నాటు పడవలో వస్తున్నారు. అయితే పడవలో బరువు ఎక్కువ కావడంతో జలాశయం మధ్యలో బోల్తాకొట్టింది. దీంతో గోపాల్ ముదులి, జయ ముదులి, మూడేళ్ల బాలుడు గల్లంతయ్యారు. పడవలో ఉన్న మిగిలిన 8 మంది ఈత కొడుతూ ఒడ్డుకు చేరుకున్నారు. ఒడ్డుకు చేరిన వారి సమాచారం అగ్నిమాక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని గల్లంతైన వారి కోసం గాలింపు చేపట్టారు. చీకటి పడడంతో వారి ఆచూకీ తెలియరాలేదు. సామర్థ్యానికి మించి పడవలో ప్రయాణికులు ఉండడంతో ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. -
సంతలో లస్సీ.. 100 మంది ప్రాణం మీదకు వచ్చింది..
భువనేశ్వర్: వేసవి కాలం కావడంతో చల్లగా లస్సీ తాగి సేదతీరిన వ్యక్తులు అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. సరదాగా తాగిన లస్సీ వారి ప్రాణం మీదకు వచ్చింది. అలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వంద మందికిపై అనారోగ్యం బారిన పడ్డారు. ఈ ఘటన ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా కుర్తి గ్రామంలో చోటుచేసుకుంది. ప్రస్తుతం బాధితులంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై వైద్యాఆరోగ్య శాఖ అధికారులు విచారణ చేపట్టారు. శుక్రవారం కుర్తిలో వారాంతపు సంత జరుగుతుండడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారు. ఎండ తీవ్రంగా ఉండడంతో ప్రజలు స్వాంతన కోసం అక్కడ ఉన్న ఓ దుకాణంలో చల్లగా లస్సీ తాగారు. లస్సీ తాగి వారి పనులు ముగించుకుని వెళ్లారు. కొద్దిసేపటికి లస్సీ తాగిన వారికి తీవ్ర కడుపునొప్పి వచ్చింది. చాలామందికి తీవ్రంగా కడుపునొప్పి రావడంతో ఒక్కసారిగా ఆస్పత్రులకు బాధితులు వచ్చారు. వంద మందికిపైగా జబ్బు పడ్డారు. దీంతో వైద్యులు కంగారుపడ్డారు. బాధితులంతా ఒకే సమస్యతో బాధపడుతున్నారని గుర్తించి వివరాలు సేకరించారు. ఈ విచారణలో అందరూ లస్సీ తాగారని గుర్తించి ఆ లస్సీ వలనే కడుపునొప్పి వచ్చిందని నిర్ధారించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం. ఈ ఘటనతో వెంటనే స్పందించిన సీడీఎంఓ ప్రఫుల్లా కుమార్ నందా కుర్తి గ్రామాన్ని సందర్శించారు. వైద్యాధికారులు సందర్శించి ఆ దుకాణం వద్ద వివరాలు సేకరించారు. గ్రామంలో ఎవరైనా ఈ బాధతో పడుతున్నారో గుర్తించారు. లస్సీ తాగడంతో కడుపునొప్పి రావడానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు. లస్సీలో ఏమైనా కలిసిందా? లేదా వాడిన ఐస్ మంచిదేనా? శుభ్రమైన నీరు వాడరా? లేదా? అనే విషయాలు వైద్య శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. చదవండి: ఆక్సిజన్ అందక కర్నూలులో ఐదుగురు మృతి చదవండి: ‘భారత్ కోలుకో’: నయాగారా జలపాతం త్రివర్ణశోభితం -
ఆంధ్రా- ఒడిశా సరిహద్దులో ఎన్కౌంటర్
భువనేశ్వర్: ఆంద్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులకు, పోలీసులకు మద్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో గుర్తు తెలియని మావోయిస్టు మృతి చెందగా, మావోయిస్టులకు చెందిన 15 కిట్ బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు.దీనిపై ఒడిశా డీఐజీ రాజేష్ పండిట్ స్పందించారు. 'ఏవోబీలో మల్కన్‌గిరి జిల్లా ఖైర్‌పుట్ బ్లాక్ మత్లీ పోలీసుస్టేషన్ పరిధిలోని మడక్‌పొదర్ సమీప నున్ఖారీ అటవీప్రాంతంలో మావోయిస్టులు సంచారంపై పోలీసులకు ఖచ్చితమైన సమాచారం అందింది. ఈ ఆధారంతో ఒడిశాకు చెందిన డీవీఎఫ్, ఎస్‌వోజీ బలగాలు గాలింపు చర్యలు చేపట్టారు.ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున పోలీసుల కదలికలు గమనించిన మావోయిస్టులు కాల్పులు ప్రారంబించారు. ఇరువర్గాలు మధ్య సుమారు 45 నిముషాలు పాటు కాల్పులు జరిగాయి. కొద్దిసేపటి తర్వాత మావోయిస్టులు వైపు నుంచి కాల్పులు నిలిచిపోవడంతో పోలీసులు ఆ ప్రాంతాన్ని గాలించగా ఒక గుర్తుతెలియని మావోయిస్టు మృతదేహం లభించింది. దీంతోపాటు ఒక పిస్టల్, దేశీయ తుపాకీ, 15 కిట్ బ్యాగులు, వాకీటాకీ, వంటపాత్రలను స్వాధీనం చేసుకున్నారని' తెలిపారు.ఈ సందర్బంగా ఒడిశా డీఐజీ రాజేష్ పండిట్ మాట్లాడుతూ మావోయిస్టులు హింసను వీడనాడి జనజీవన స్రవంతిలో కలవాలని, వారిని ఆదుకోవడానికి సిధ్దంగా ఉన్నామని, తప్పించుకున్న మావోయిస్టులు కోసం గాలింపు చర్యలు నిర్వహిస్తున్నామని డీఐజీ తెలిపారు. -
ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో దద్దరిల్లిన తుపాకీలు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో శనివారం మరోసారి తుపాకీలు దద్దరిల్లాయి. సరిహద్దుల్లో కట్ ఆఫ్ ఏరియాలోని తోటగుర అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య దాదాపు 45 నిమిషాల పాటు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టు సభ్యుడు ఒకరు మృతి చెందారు. ఘటనపై మల్కనగిరి జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. కాల్పుల్లో మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడు, మిల్ట్రీ ప్లాటు ఇంచార్జ్ కిషోర్ మృతి చెందాడు. మృతి చెందిన మావోయిస్టు ఏసీఎమ్ నుంచి ఎస్ఎల్ఆర్ తుపాకీ స్వాధీనం చేసుకున్నాం. మరో దళ సభ్యుడు పోలీసుల ముందు లొంగిపోయారు' అని జిల్లా ఎస్పీ తెలిపారు. కాగా, సరిహద్దుల్లోని కట్ ఆఫ్ ఏరియాలోని తోటగుర అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు అనంతరం కూడా కూంబింగ్ కొనసాగిస్తున్నారు. -
బెజ్జింగివాడ అడవుల్లో ఎన్కౌంటర్
-
బెజ్జింగివాడ అడవుల్లో ఎదురు కాల్పులు
-
మావోయిస్టులకు ఎదురుదెబ్బ
మల్కాన్‌గిరి: ఒడిశాలో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. మల్కాన్‌గిరి జిల్లా బెజ్జింగివాడ అటవీ ప్రాంతంలో సోమవారం పోలీసులతో జరిగిన ఎదురు కాల్పులతో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. అళ్లూరుకోట, సన్యాసిగూడ గ్రామాల మధ్య ఈ ఎన్కౌంటర్ జరిగినట్టు పోలీసులు తెలిపారు. మృతులు కలిమెల ఏరియా కమిటీ సభ్యులుగా గుర్తించారు. కీలక నేత రణ్ దేవ్ తప్పించుకున్నట్టు తెలుస్తోంది. మృతుల్లో మహిళా మావోయిస్టు కూడా ఉన్నారు. సంఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను గుర్తించినట్టు సమాచారం. గాయపడిన మావోయిస్టులు ఎవరైనా ఉన్నారేమోనన్న ఉద్దేశంతో చుట్టపక్కల ప్రాంతాల్లో రక్షణ బలగాలు గాలింపు ముమ్మరం చేశాయి. ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. -
12 మంది మావోయిస్టుల అరెస్టు
చత్తీస్ఘడ్: చత్తీస్‌ఘడ్‌లోని భారీ ఎత్తున మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. మల్కన్‌గిరి జిల్లాలో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో మల్కన్‌గిరిలో 12 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలోని కలిమెల, మాథిలి, చిత్రకొండ ప్రాంతాలలో వారిని అరెస్టు చేశారు. మల్కనగిరిలో ఇటీవల జరిగిన సంఘటనల నేపథ్యంలో పోలీసులు అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే మావోలు పట్టుబడినట్టు తెలిపారు. అదుపులోకి తీసుకున్న మావోయిస్టులు వివిధ విభాగాలకు చెందిన వారని, పలువురు ఈ మధ్యకాలంలో జరిగిన ముగ్గురు వ్యక్తుల హత్యలో పాల్గొన్నారని తెలిపారు. -
ఇంట్లోకి అనుకోని అతిథి.. చూస్తే షాక్!
భువనేశ్వర్ : ఓ ఇంటికి అనుకోని అతిథి రావడంతో కుటుంబసభ్యులు షాకయ్యారు. అతిథి వస్తే షాకవడం ఏంటనుకుంటున్నారా.. ఇంట్లోకి చొరబడింది మనిషి కాదు.. పెద్ద మొసలి. ఒడిశాలోని మల్కాన్ గిరి జిల్లాలో గురువారం ఈ విచిత్రం చోటుచేసుకుంది. తొలుత ఏదో అలికిడి వినిపించడంతో ఇంట్లోకి ఎవరో వచ్చారని కుటుంబం భావించింది. కానీ ఎవరొచ్చాని అని చూడగా భారీ అకారంలో ఉన్న మొసలిని చూసిన వ్యక్తి ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇంట్లో వాళ్లను అప్రమత్తం చేయగా, ఒకరు అటవీశాఖ అధికారులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. విషయం ఆ నోటా ఈనోటా పాకడంతో మనాటా గ్రామస్తులు ఆ ఇంటి వద్ద గుమిగూడారు. అటవీశాఖ అధికారులు మొసలి ప్రవేశించిన ఇంట్లోకి వెళ్లి.. కొద్దిసేపు తీవ్రంగా శ్రమించి పట్టుకున్నారు. ఓ బోనులోకి మొసలి వెళ్లేలా చేసిన సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారు. మొసలిని చూసేందుకు చిన్నాపెద్దా తేడా లేకుండా గ్రామస్తులు చాలామంది వచ్చారని, ఇలాంటివి జరిగినప్పుడు భయపడకుండా తమకు సమాచారం అందించాలని అటవీశాఖ ఉద్యోగి ఒకరు సూచించారు. -
కాంగ్రెస్ నేత హత్య
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా సరిహద్దు రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లా కుహకుడ గ్రామంలో కాంగ్రెస్ నేత చెనురామ్ మాడివిని మావోయిస్టులు మంగ ళవారం హత్య చేశారు. చెనురామ్ మాడివిని గతంలో మావోయిస్టులు రాజకీయాల నుంచి వైదొలగాలని హెచ్చరించారు. అయినా ఆయన కాంగ్రెస్‌లోనే పనిచేస్తున్నారు. దీంతో ఆయన కుహకుడ గ్రామంలో ఇంటి లో భోజనం చేస్తున్న సమయంలో కొంతమంది మావోయిస్టులు వచ్చి అతికిరాతకంగా కాల్చి చంపారు. అనంతరం మృతదేహాన్ని ఓ పోలీస్గొడౌన్ వెనుక భాగంలో వదిలి వెళ్లారు. చెనురామ్మాడివి∙20 ఏళ్లుగా కాంగ్రెస్‌లో ఉంటూ ఆ 20 ఏళ్లు సర్పంచ్‌గా పనిచేశారు. నాలుగుసార్లు జాన్పత్గా పనిచేశారు. 2013లో నక్సల్స్ చేతిలో హత్యకు గురైన మహేంద్రకర్మ, చెనురామ్ ప్రాణస్నేహితులు. ఇద్దరూ మావోయిస్టుల చేతిలోనే హత్యకు గురయ్యారని కాంగ్రెస్ నేతలు ఆవేదన చెందారు. బీజేపీ ప్రభుత్వమే కాంగ్రెస్ వారిని మావోయిస్టుల ద్వారా ఇలా హత్య చేయిస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. -
మోదీకి లేఖ రాసిన గిరిజన బాలుడు
మల్కన్‌గిరి (ఒడిశా): గిరిజన జనాభా ఎక్కువగా ఉండే ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాకు చెందిన ఉమేష్ మాది అనే పదేళ్ల బాలుడు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశాడు. తమ ప్రాంతంలో మెదడువాపు వ్యాధి విజృంభించి పిల్లలు చనిపోతున్నారనీ, సహాయం చేయాలని మోదీని అర్థించాడు. మల్కన్‌గిరి జిల్లాలో ఇప్పటికి 505 గ్రామాల్లో 73 మంది పిల్లలు మెదడువాపు వ్యాధి సోకి చనిపోయారు. అధికారులు మాత్రం ఆ సంఖ్య 27 మాత్రమేననీ, మిగతా పిల్లలు వివిధ ఇతర కారణాలతో చనిపోయారని బుకాయిస్తున్నారు. ‘మీరు ప్రపంచం అంతా తిరుగుతున్నారు. ఇక్కడ పిల్లలు ఎలా చస్తున్నారో చూడటానికైనా మా ఊరికి రాలేరా? మీరే మా చివరి ఆశ’ అని మోదీని ఉద్దేశించి ఉమేష్ లేఖలో పేర్కొన్నాడు. -
ఏజెన్సీ గ్రామాల్లో భయం.. భయం..
మల్కన్‌గిరి నుంచి సాక్షి బృందం: ఎన్కౌంటర్ జరిగిన మల్కన్‌గిరి జిల్లా అటవీ ప్రాంతంతో పాటు ఏవోబీ పరిధిలోని ఏజెన్సీ గ్రామాలన్నీ భయం గుప్పెట్లో వణికిపోతున్నాయి. ఏపీ నుంచి ప్రత్యేకంగా నాలుగు ప్రత్యేక ప్లటూన్స్ను సోమవారం ఎన్కౌంటర్ తర్వాత ఏజెన్సీలో దింపారు. మొత్తం నాలుగు వేల మందిని రంగంలోకి దింపినట్టు పోలీసువర్గాల సమాచారం. ఎస్పీ, అడిషనల్ ఎస్పీ క్యాడర్ స్థాయి అధికారులు ఈ ప్లటూన్స్కు నాయకత్వం వహిస్తున్నారు. కటాఫ్ ఏరియాతో పాటు ఏఓబీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. దీంతో ఏ క్షణాన ఏం ఉపద్రవం ముంచుకొస్తుందోననే ఆందోళనతో గిరిజన గ్రామాలున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలోని అధికార పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు రాజీనామాలు కూడా చేశారు. పలువురు గిరిజనులను మావోయిస్టులు ప్రజాకోర్టు పేరుతో హతమార్చడంతో మావోలపై గిరిజనుల్లో సైతం ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. ఈ పరిస్థితుల్లో ఏజెన్సీలో హెల్త్ ఎమర్జెన్సీపై ఏజెన్సీ బంద్‌కు పిలుపునివ్వడంతో పాటు ఇటీవల మళ్లీ పూర్తిస్థాయిలో పట్టు సాధిం చేందుకు మావోలు గిరిజన గ్రామాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. షెల్టర్ జోన్‌గా కటాఫ్ ఏరియా నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. 2015లో జరిగిన కొయ్యూరు ఎన్కౌంటర్లో మావో అగ్రనేత అజాద్‌ను కోల్పోయిన తర్వాత మావోలు తమ కార్యకలాపాలు మరింత వేగవంతం చేశారు. -
మల్కన్‌గిరి అడవుల్లో ఆర్కే కదలికలు?
మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్.. అలియాస్ ఆర్కే చాలా కాలం తర్వాత మళ్లీ ఏఓబీలోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. ఒడిషాలోని మల్కన్‌గిరి జిల్లాలోగల జంత్రి అనే ప్రాంతంలో జరిగిన ఓ సమావేశంలో ఆర్కే కనిపించినట్లు చెబుతున్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కూడా అయిన ఆర్కే.. అంత సాధారణంగా బయటకు కనిపించరు. సరిగ్గా జంత్రి ప్రాంతంలోనే 2011లో అప్పటి మల్కన్‌గిరి జిల్లా కలెక్టర్ వినీల్ కృష్ణను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. మళ్లీ ఇప్పుడు అదే ప్రాంతంలో ఆర్కే కదలికలు కనిపించాయంటే ఏం జరుగుతుందోనన్న చర్చ మొదలైంది. మల్కన్‌గిరి - కోరాపుట్ - విశౄఖ సరిహద్దు డివిజన్ కమిటీ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ ఉదయ్, రాష్ట్ర కమిటీ సభ్యుడు సలీం, బెంగాల్ నాయకులు సుధీర్, అనిల్, నవీన్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారని, దీనికి దాదాపు వెయ్యి నుంచి 1500 మంది వరకు గ్రామస్థులు హాజరయ్యారని అంటున్నారు. 2010లో కోరాపుట్ ప్రాంతంలో తన భార్య అరెస్టయినప్పటి నుంచి ఆర్కేకు సంబంధించిన విషయాలు ఏవీ పెద్దగా బయటకు రావడం లేదు. ఆయన గత ఏడేళ్లుగా స్పాండిలైటిస్ తదితర ఇబ్బందులతో బాదపడుతున్నట్లు తెలిసింది. అందుకే భద్రత కోసం ఆయనను ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యం ప్రాంతానికి పంపినట్లు కూడా చెబుతున్నారు. మల్కన్‌గిరి ప్రాంతం ఎప్పటినుంచో మావోయిస్టులకు కంచుకోట. దాని భౌగోళిక పరిస్థితుల కారణంగా అక్కడకు సులభంగా చేరుకోవడం, అక్కడి నుంచి అంతే సులభంగా తప్పించుకోవడం వాళ్లకు బాగా అలవాటని, అక్కడకు మావోయిస్టు అగ్రనేతలు వచ్చినట్లు తమకు కూడా సమాచారం ఉందని యాంటీ నక్సల్ విభాగం అధికారులు అంటున్నారు. -
దళం వీడారు.. దండలు ధరించారు...
తుపాకులతో అడవుల్లో తిరిగిన వారి మధ్య ప్రేమ జనించింది.. ఒక్కటవ్వాలనుకున్న వారిని దళం వద్దంది.. తమ ప్రేమకు అడ్డంకిగా నిలిచిన దళం మాకొద్దనుకున్నారు.. చేతుల్లోని తుపాకులు పారేశారు.. మా బతుకు మేము బతుకుతామని అడవులను వదిలారు.. పోలీసులను ఆశ్రయించారు.. ఆదివాసీ దినోత్సవమే వారికి పెళ్లి రోజయ్యింది.. ఆదివాసీ సంప్రదాయబద్ధంగా ఆ రెండు జంటలు ఒక్కటయ్యాయి.. మల్కన్‌గిరి జిల్లా : మావోయిస్టు దళంలో పని చేస్తున్న వారి ప్రేమను నాయకత్వం అంగీకరించక పోవడంతో ఉద్యమ బాట వీడారు. పోలీసులకు లొంగిపోయి పెళ్లి చేసుకున్నారు. ఉన్నతాధికారులే పెళ్లి పెద్దలయ్యారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బస్తర్ జిల్లా దర్భ గ్రామంలో మంగళవారం మాజీ మావోయిస్టుల వివాహం జరిగింది.. దర్భ డివిజన్ పరిధిలోని కాట్ కల్యాణ్ ఏరియాలో దళంలో మనుసయ్య- పద్మిణి, బుద్ర-లచ్చుమతి పని చేసేవారు. వారు ప్రేమించుకున్నారు. ఈ విషయం నాయకత్వానికి తెలియజేస్తే ప్రేమకు చోటులేదన్నారు. దీంతో ఈ ఏడాది మే నెలలో దళం వీడి బస్తర్ పోలీసులకు లొంగిపోయారు. పద్నాలుగేళ్ల వయసులో దళంలో చేరిన వారు పలు హింసాత్మక ఘటనల్లో పాల్గొన్నారు. లొంగిపోయిన వారికి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కానిస్టేబుళ్లుగా ఉద్యోగాలు ఇచ్చింది. వారి ప్రేమ కథను విన్న అధికారులు వారికి పెళ్లి చేయాలనుకున్నారు. మంగళవారం మావోయిస్టు ప్రభావిత దర్భ గ్రామంలోని శివమందిరంలో రెండు జంటలకు పెళ్లి చేశారు. బస్తర్ ఐజీ ఎస్సార్పీ కల్లూరి, బస్రత్ కలెక్టర్ బిజ్రాల్, బస్తర్ ఎస్పీ రాజేంద్రనారాయణదాస్ తదితరులు సమక్షంలో జరిగిన వివాహానికి పరిసర గ్రామాల నుంచి వందల సంఖ్యలో పాల్గొన్నారు. -
ఒడిశాలో మావోయిస్టుల ఘాతుకం
ఒడిశా : మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. జిల్లాలోని పనసపుట్టి గ్రామంలో ఇన్ఫార్మర్గా పని చేస్తున్నారనే నెపంతో ఒకరిని హతమార్చారు. పనసపుట్టి గ్రామానికి చెందిన వ్యక్తి... తమ కార్యకలాపాలను పోలీసులకు చేరవేస్తున్నాడని... అందువల్లే అతడిని హతమార్చినట్లు ఆ లేఖలో మావోయిస్టులు పేర్కొన్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు స్థానికంగా విచారణ చేపట్టారు. -
ఏడుగురిని ఎత్తుకెళ్లారు
మల్కాన్ గిరి: ఒడిశాలో మావోయిస్టులు కిడ్నాప్ కు పాల్పడ్డారు. ఛత్తీస్ గఢ్-ఒడిశా సరిహద్దులోని మల్కాన్ గిరి జిల్లాలో కర్తాన్ పల్లి, బారా గ్రామాల నుంచి ఏడుగురిని అపహరించుకుపోయారు. కర్తాన్ పల్లి పంచాయతీ సమితి మాజీ చైర్మన్ సహా ఆరుగురిని కిడ్నాప్ చేశారు. బారా గ్రామం నుంచి ఒకరిని ఎత్తుకెళ్లారు. ఈ రెండు గ్రామాలు సుక్మా జిల్లాలోని దర్బా ఘాటికి సమీపంలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మల్కాన్ గిరి జిల్లాలో చివరిసారిగా 2013లో మావోయిస్టులు కిడ్నాప్ కు పాల్పడ్డారు. 9 మందిని ఎత్తుకెళ్లి ఇద్దరిని హత్య చేశారు. మిగతా వారిని విడిచిపెట్టారు. -
దోమకాటుకు 10 మంది చిన్నారుల బలి
మల్కాన్‌గిరి: దోమ కాటుకు ఒడిశాలో 10 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. గిరిజనులు అధికంగా నివసించే మల్కాన్‌గిరి జిల్లాలో నెల రోజుల వ్యవధిలో ఈ మరణాలు సంభవించినట్టు అధికారులు తెలిపారు. మృతులంతా ఏడాది నుంచి నాలుగేళ్ల వయసున్న పిల్లలు. దోమకాటు వల్ల సంభవించిన ఇన్ఫెక్షన్ కారణంగా వీరు మృతి చెందారు. వీరు మల్కాన్‌గిరి జిల్లాలోని కొరకుండ, బలిమెల, కలిమెల బ్లాకులకు చెందివారు. దోమకాటుకు గురైన బాధితుల రక్తనమూనాలను భువనేశ్వర్, పుణే ప్రయోగశాలలకు పంపించినట్టు మల్కాన్‌గిరి జిల్లా ముఖ్య వైద్యాధికారి ఉదయ్‌నాథ్ మిశ్రా తెలిపారు. దోమ కాటుతో వచ్చిన ఇన్ఫెక్షన్ కారణంగా రోగం బారిన పడి పిల్లలు మృతి చెందారన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రయోగశాలల నుంచి నివేదికలు వచ్చిన తర్వాతే కచ్చితమైన కారణం తెలుస్తుందన్నారు. మరోవైపు నాలుగు వైద్యబృందాలు బాధిత ప్రాంతాల్లో పర్యటించాయి. -
ఒడిశా అటవీప్రాంతంలో భారీ డంప్ స్వాధీనం
ఒడిశా: రాష్ట్రంలోని మల్కన్‌గిరి జిల్లా సిసాపుర అటవీ ప్రాంతంలో మావోయిస్టులు దాచిపెట్టిన భారీ డంప్‌ను శుక్రవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల డెన్‌లో భారీగా ఆయుధ సామాగ్రి ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. మావోయిస్టుల డెన్‌లో 27 కేజీల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. -
అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయులు సస్పెండ్
భువనేశ్వర్: రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఐదుగురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేసినట్లు మల్కాన్‌గిరి జిల్లా కలెక్టర్ డి. ప్రశాంత్ కుమార్ రెడ్డి సోమవారం వెల్లడించారు. జిల్లాలోని ముడిలిపడ ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో వసతి పొందిన విద్యార్థులకు సరైన అహారం, వసతులు సరిగ్గా కల్పించడం లేదని ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేకాకుండా పాఠశాలలో విద్యార్థులు క్రమంగా తగ్గిపోవడంతో.... ప్రభుత్వం దృష్టి సారించి విచారణకు ఆదేశించింది. దీంతో ఉన్నతాధికారులు విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. రెసిడెన్షియల్ పాఠశాలలోని విద్యార్థులకు సరైన అహారం పెట్టకుండా, వసతులు కూడా కల్పించకపోవడంతోపాటు ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల అసభ్యకరం ప్రవర్తిస్తున్నారని విద్యార్థులు విచారణ అధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఐదురుగు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా కలెకర్ట్ ప్రశాంత్ కుమార్ రెడ్డి తెలిపారు. సస్పెన్షన్ అయిన వారిలో ప్రధాన ఉపాధ్యాయుడు కూడా ఉన్నారని చెప్పారు.