ఏజెన్సీ గ్రామాల్లో భయం.. భయం..
మల్కన్‌గిరి నుంచి సాక్షి బృందం: ఎన్‌కౌంటర్ జరిగిన మల్కన్‌గిరి జిల్లా అటవీ ప్రాంతంతో పాటు ఏవోబీ పరిధిలోని ఏజెన్సీ గ్రామాలన్నీ భయం గుప్పెట్లో వణికిపోతున్నాయి. ఏపీ నుంచి ప్రత్యేకంగా నాలుగు ప్రత్యేక ప్లటూన్స్‌ను సోమవారం ఎన్‌కౌంటర్ తర్వాత ఏజెన్సీలో దింపారు. మొత్తం నాలుగు వేల మందిని రంగంలోకి దింపినట్టు పోలీసువర్గాల సమాచారం.
ఎస్పీ, అడిషనల్ ఎస్పీ క్యాడర్ స్థాయి అధికారులు ఈ ప్లటూన్స్‌కు నాయకత్వం వహిస్తున్నారు. కటాఫ్ ఏరియాతో పాటు ఏఓబీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. దీంతో ఏ క్షణాన ఏం ఉపద్రవం ముంచుకొస్తుందోననే ఆందోళనతో గిరిజన గ్రామాలున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలోని అధికార పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు రాజీనామాలు కూడా చేశారు. పలువురు గిరిజనులను మావోయిస్టులు ప్రజాకోర్టు పేరుతో హతమార్చడంతో మావోలపై గిరిజనుల్లో సైతం ఆగ్రహావేశాలు పెల్లుబికాయి.
ఈ పరిస్థితుల్లో ఏజెన్సీలో హెల్త్ ఎమర్జెన్సీపై ఏజెన్సీ బంద్‌కు పిలుపునివ్వడంతో పాటు ఇటీవల మళ్లీ పూర్తిస్థాయిలో పట్టు సాధిం చేందుకు మావోలు గిరిజన గ్రామాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. షెల్టర్ జోన్‌గా కటాఫ్ ఏరియా నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. 2015లో జరిగిన కొయ్యూరు ఎన్‌కౌంటర్‌లో మావో అగ్రనేత అజాద్‌ను కోల్పోయిన తర్వాత మావోలు తమ కార్యకలాపాలు మరింత వేగవంతం చేశారు.