agency villages
-
వరదతో ఎర్రకాలువ ఉగ్రరూపం 20 గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు
-
AP: ఆకట్టుకుంటున్న గిరిజన కట్టుబాట్లు
దట్టమైన అడవులు.. ఎత్తయిన కొండలు.. స్వచ్ఛమైన సెలయేళ్లు.. పక్షుల కిలకిలరావాలు.. పచ్చని సోయగాలు.. ప్రకృతి ఒడే ఆవాసంగా.. వన్యప్రాణుల సహవాసం మధ్య శతాబ్దాల సంస్కృతులకు గుర్తుగా నిలుస్తున్నారు పశ్చిమ ఏజెన్సీలో అడవిబిడ్డలు. దశాబ్దాలుగా పోడు వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్న వీరి జీవితాల్లో ప్రభుత్వం అభివృద్ధి వెలుగులు నింపుతోంది. వారి కష్టాలు తీర్చేందుకు బృహత్తర కార్యక్రమాలు అమలు చేస్తోంది. విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక వసతులు కల్పిస్తూ అన్నింటా అండగా నిలుస్తోంది. బుట్టాయగూడెం: అడవితల్లిని నమ్ముకుని వనాలే ఆరాధ్య దేవతలుగా, కొండుపోడు ఆధారంగా సంస్కృతి, సంప్రదాయాలతో జీవనం సాగిస్తున్నారు పశ్చిమ ఏజెన్సీలోని గిరిజనులు. తరాలు మారినా కటుటబాట్లు, ఆచార వ్యవహారాలు, ఆహార అలవాట్లలో ప్రత్యేక శైలితో ముందుకు సాగుతున్నారు. వారి అలవాట్లు, వ్యవహార శైలిని అపురూపంగా కాపాడుకుంటున్నారు. కొండపోడుతో పాటు అటవీ ఉత్పత్తులు సేకరించి వారంతపు సంతలలో అమ్ముకోవడం ద్వారా జీవనం సాగిస్తున్నారు. వనదేవతలే ఆరాధ్యదైవాలు ఏజెన్సీ మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీ గిరిజనులకు వనాలే ఆరాధ్య దేవతలు. ఎక్కడ పూజలు చేసినా తప్పనిసరిగా అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తారు. భూదేవి, బాట, మామిడికాయ, కొత్త కందులు, చింతకాయల పండగను ప్రధానంగా చేసుకుంటున్నారు. కొండల మధ్య దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఆవాసాలు ఏర్పాటుచేసుకుని బతుకుతున్నారు. ఏళ్ల తరబడి సమస్యలతో సహవాసం చేస్తున్న వీరి జీవితాల్లో మార్పులు వస్తున్నాయి. ఆహారపు అలవాట్లు కొండరెడ్ల ఆహారపు అలవాట్లు భిన్నంగా ఉంటాయి. అడవిలో దొరికే వాటితో వంటకాలు చేసుకుని ఆ రుచుల్ని ఆస్వాదిస్తుంటారు. తొలకరి అనంతరం కొండ కోనల్లో అడుగడుగునా కన్పించే వెదురు చెట్ల నుంచి మొలిచే కొమ్ముల్ని వండుకుని ఆనందిస్తుంటారు. అలాగే ఎర్రచీమల గుడ్లతో చేసే చారు ప్రత్యేకం. ఐటీడీఏ కృషి ఐటీడీఏ ద్వారా గిరిజనుల సర్వతోముఖాభిృద్ధికి కృషిచేస్తున్నారు. విద్య, వైద్యం, సురక్షిత తాగునీటి, రవాణా, మౌలిక వసతులు కల్పిస్తున్నారు. ట్రైకార్ ద్వారా రుణాలు ఇస్తున్నారు. జీసీసీ ద్వారా అటవీ ఉత్పత్తులు కొనుగోలు చేసి ఉపాధి బాటలు వేస్తున్నారు. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రెండేళ్ల నుంచి గిరిజన అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలో సుమారు 5,327 మంది పోడు రైతులకు 2 వేలకు పైగా పట్టాలు ఇచ్చారు. రూ.40 కోట్లతో బీటీ, రూ.15 కోట్లతో గ్రామీణ సీసీ రోడ్ల నిర్మాణం, నాడు–నేడు కింద రూ.15 కోట్లతో పాఠశాలల అభివృద్ధి, రూ.18 కోట్లతో సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్‌ల నిర్మాణ పనులు చేపట్టారు. గిరిజన ప్రాంత ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించేలా సుమారు రూ.50 కోట్లతో మల్టీసూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి కృషి చేస్తున్నారు. 14 రోజుల్లో పట్టా ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు చింతల లచ్చిరెడ్డి. దట్టమైన అటవీ ప్రాంతం బుట్టాయగూడెం మండలంలోని రేపల్లె గ్రామం. అతనికి దాదాపు 4 ఎకరాల సొంత భూమి ఉంది. లచ్చిరెడ్డి తన భూమికి పట్టా కోసం దశాబ్దాలుగా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఉపయోగం లేదు. రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ ఏర్పాటుచేసిన గ్రామ సచివాలయం వ్యవస్థ ద్వారా అతడికి 1బీ పట్టాలు అందాయి. వలంటీర్ ఇంటికి వచ్చి సంతకాలు చేయించుకుని తీసుకువెళ్లగా.. 14 రోజుల్లో 1బీ పట్టాలు అందాయని లచ్చిరెడ్డి ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ఆదివాసీల అభివృద్ధికి కృషి ఆదివాసీలకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేలా సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధితో కృషిచేస్తున్నారు. సంక్షేమ, అభివృద్ధి ఫలాలతో ఆదివాసీలు ఆనందంగా ఉన్నారు. నామినేటెడ్ పదవులు, పనుల్లో రిజర్వేషన్లతో గిరిజన మహిళలకు పదవులు వరించాయి. ముఖ్యంగా గిరిజన మహిళకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానిది. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను నియమించి గిరిజనులపై ఉన్న ప్రేమను సీఎం జగన్ చూపించారు. – తెల్లం బాలరాజు, పోలవరం ఎమ్మెల్యే ముంగిళ్లలోకే పథకాలు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మారుమూల గిరిజన గ్రామాల్లో అడవిబిడ్డల ఇంటి ముందుకే పథకాలు వస్తున్నాయి. దేశంలో ఎక్కడాలేని విధంగా గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా కొండ ప్రాంతంలో ఉన్న గిరిజనులకు కష్టాలు తప్పాయి. అర్హులైన ప్రతిఒక్కరికీ పథకాలు అందుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గిరిజన పక్షపాతి. మన్యం ప్రజల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషిచేస్తున్నారు. – కొవ్వాసి నారాయణ, వైఎస్సార్ సీపీ ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షుడు, కేఆర్ పురం -
మామిడి తాండ్ర రుచి.. తినరా మైమరచి
తాండ్ర...ఈ పేరు వింటేనే నోరూరుతుంది. గిరిజన మహిళలు సంప్రదాయబద్ధంగా తయారు చేస్తుండడంతో మరింత గిరాకీ పెరుగుతోంది. కిలో రూ.80 వరకూ ధర పలుకుతున్నా కొనుగోలుదారులు మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. మామిడి సీజన్ అయిపోయినా వీటిని భద్ర పరుచుకొని తినే అవకాశం ఉండడంతో డిమాండ్ పెరుగుతోంది. కొనుగోలుదారుల ఆసక్తిని గమనించి మరింత ఉత్పత్తి చేయడానికి ఈ ప్రాంత వాసులు కృషి చేస్తున్నారు. కురుపాం: గిరిజన మహిళలు సంప్రదాయంగా తయారుచేస్తున్న మామిడి తాండ్రకు మంచి గిరాకీ ఏర్పడింది. కురుపాం నియోజకవర్గ పరిధిలోని కురుపాం, గుమ్మలక్ష్మీపురం, కొమరాడ, జియ్యమ్మవలస మండలాల్లో గిరిశిఖర గ్రామాల్లో గిరిజన మహిళలు కొండమామిడి పండ్లను సేకరించి తాండ్ర తయారీకి ఉపక్రమిస్తున్నారు. ఏజెన్సీలో సహజసిద్ధంగా మామిడి చెట్లకు కాసే కొండమామిడి పండ్లను సేకరించి మామిడి తాండ్రను తయారు చేసి కిలో రూ.60 నుంచి రూ.80 వరకూ విక్రయిస్తున్నారు. తాండ్ర తయారీ ఏజెన్సీలో గిరిశిఖరాలపై మామిడి చెట్లకు కాసే కొండమామిడి పండ్లను ఇంటిల్లపాది ఉదయం, సాయంత్రం సమయాల్లో వెళ్లి పండ్లను సేకరించి వాటిని శుభ్ర పరిచి పెద్ద డబ్బాల్లో వేసి రోకలితో దంచుతారు. దంచగా వచ్చిన మామిడి రసాన్ని మేదర జంగెడలో పలుచగా వెదజల్లేలా ఆరబెడతారు. వీటిలో ఎటువంటి రసాయనాలు కలుపకుండానే పొరలు పొరలుగా వేసి వారం, పది రోజులు ఆరబెట్టి ఉండలా చుట్టి తాండ్రను తయారు చేస్తారు. తియ్యరగు మామిడి పండ్లను ఒక డబ్బాలో వేసి రోకలితో దంచగా వచ్చిన రసాన్ని తాండ్రగా తయారు చేస్తారు. మిగిలిన మామిడి తొక్కలను, టెంకలను వేరు చేసి ఎండబెడతారు. తొక్కలను తియ్యరగుగా పిలుస్తారు. వీటిని బెల్లంతో ఊరగాయగా చేసుకొని అన్నంతో కూరగా ఆరగిస్తారు. టెంకపిండి అంబలిగా... మామిడి పండ్ల నుంచి తొక్కను, రసాన్ని వేరుచేసిన తరువాత చివరిగా ఉండే మామడి టెంకలను కూడా ఎండబెట్టి పిండిగా చేస్తారు. దీన్ని ఉడగబెట్టి అంబలిగా చేసుకొని గిరిజనం ఆరగించటం ఆనవాయితీ. మార్కెట్లో మంచి గిరాకీ.. ఏజెన్సీలో గిరిజనం తయారు చేసే తాండ్ర, తియ్యరకు మంచి గిరాకీ ఉంది. స్థానిక వ్యాపారులు తాండ్రను కేజీ రూ.80 వరకు కొనుగోలు చేస్తున్నారు. తియ్యరగు కేజీ రూ.50 ధర పలుకుతోంది. ఎటువంటి రసాయనాలు కలుపకుండా తయారు చేయటంతో వ్యాపారులు ఈ ప్రాంత తాండ్రపై మక్కువ చూపిస్తున్నారు. మామిడితో ఎంతో మేలు ప్రతీ ఏడాది మామిడితో గిరిజన కుటుంబాలకు అన్ని విధాలా మేలే. ఎందుకంటే తాము ఏడాదిపాటు వ్యవసాయ పనుల్లో ఉన్నప్పుడు తాండ్రను అన్నంతో, తియ్యరగు ఊరగాయగా వినియోగిస్తుంటాం, మామిడి టెంకను కూడా టెంక పిండి అంబలిగా చేసుకొని వృద్ధులు తాగుతారు. మరికొన్ని సందర్భాల్లో వ్యాపారులకు కూడా విక్రయిస్తుంటాం. మామిడితో మాకు అన్ని విధాలా మేలే. - బిడ్డిక తులసమ్మ, వలసబల్లేరు, కురుపాం మండలం -
కిలోమీటర్లు కాలినడక.. ‘డోలీ’ ప్రయాణమే దిక్కు
రాళ్లల్లో..ముళ్ల దారుల్లో అడవి బిడ్డలు అవస్థలు పడుతున్నారు. పురుటి నొప్పులు వస్తే నిండు గర్భిణిని డోలి కట్టి కొండలు, గుట్టలపై కాలినడకన మోసుకుపోవడం తప్ప వేరే మార్గం లేక నరకం చూస్తున్నారు. నిధులున్నా.. ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నా, నిబంధనల బంధనాల వల్ల నేటికి దారులు ఏర్పడలేదు. దీంతో గిరిజనులు ఇబ్బందులు పడుతూ అభివృద్ధికి దూరమవుతున్నారు. వారి పిల్లలు, యువత చదువు కోవడానికి వెళ్లలేక నిరక్షరాస్యులుగానే మిగిలిపోతున్నారు. దీంతో గిరిజనులు తమను తామే బాగుచేసుకోవాలని నిర్ణయించుకున్నారు. రహదారులు లేని గ్రామాలకు తామే చందాలు వేసుకుని రోడ్లు వేసుకుంటున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: రోడ్డు వేసిన తర్వాతే ఓటు అడగడానికి మీ ఊరు వస్తామని టీడీపీ హయాంలో సాలూరు మాజీ ఎమ్మెల్యే బంజ్‌దేవ్ అప్పట్లో కొదమ పంచాయతీ చింతామల గిరిశిఖర గ్రామ ప్రజలకు మాటిచ్చారు. 15 రోజుల్లోనే రోడ్డు ప్రారంభిస్తామన్నారు. రోడ్డు పనుల కోసం తుప్పలు కొట్టిస్తున్నట్లు చెప్పి సమావేశానికి రమ్మన్నారు. తీరా అక్కడికి వెళితే చెప్పులతో కొట్టారని పోలీసు కేసు పెడతానంటూ గిరిజనులను బెదిరించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇలా అనేకసార్లు మోసపోయిన 125 గిరిజన కుటుంబాలు కలిసి..ఉన్న బంగారం, భూమి తాకట్టు పెట్టి, ఆవులు, గేదెలు, మేకలను అమ్మి, అదీ చాలక షావుకారు వద్ద అప్పుచేసి, ఇంటికి రూ.7 వేలు చొప్పున చందాలు పోగుచేసుకున్నారు. మరికొంత రుణాలు తీసుకున్నారు. ఆ సొమ్ముతో ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒడిశా బారి జంక్షన్ వరకూ సొంతంగా రహదారి వేసుకున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. సీఎం కార్యాలయం జిల్లా అధికారులను వివరాలు కోరింది. మరోవైపు బాలీవుడ్ నటుడు సోనూసూద్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. గిరిజనులను అభినందిస్తూ, త్వరలోనే వచ్చి కలుస్తానన్నారు. అయితే ఇది ఆ ఒక్క ఊరి సమస్య మాత్రమే కాదు. ఇలాంటి ఎన్నో పల్లెలకు అడవిలో రహదారులు లేవు. సాలూరు మండలంలో కొదమ పంచాయితీలో కొదమ, చినచోర, ఎం.చింతలవలస, అడ్డుగుడ, కోనంగివలస, చింతామల, లొద్ద, బందపాయి, చిలకమెండంగి, సిరివర, కోయిమల, కానుపాక, గుంజేరి, పట్టుచెన్నేరు పంచాయితీ శిఖపరువు, పగులుచెన్నేరు పంచాయితీ ఎగువమెండంగి, గంజాయిభద్ర పంచాయతీ పనికిలోవ, రణసింగి, సిమ్మగెడ్డ, ఎగువపనికి, డెన్సరాయి పంచాయితీలో డెన్సరాయి, జిల్లేడువలస, సంపంగిపాడు పంచాయతీలని ఎగువరూడి, దిగువరూడి, సుల్లారి, సంపంగిపాడు, పువ్వలవలస, జిల్లేడువలస పంచాయతీలో నారింజపాడు, బెల్లపాకలు, బొడ్డపాడు తదితర గిరిశిఖర గ్రామాలకు నేటికీ సరైన రహదారి లేక అక్కడి గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. గిరిశిఖర, అటవీ, మైదాన ప్రాంతాల్లో గిరిజనులు నివసిస్తున్నారు. గిరిశిఖర గ్రామాల్లో సవర, కోదులు, జాతాపు తెగలకు చెందిన గిరిజనులున్నారు. అడవుల్లో జాతాపు, గదబ, సవర, కొండదొర తెగల వారున్నారు. మైదాన ప్రాంతాల్లో ఎరుకులు, లంబాడిలు (సుబాగి/నాయికిలు), యానాదు, గదబ తెగలు ఉన్నాయి. వీరంతా రహదారులు లేక కష్టపడుతున్నారు. గిరిశిఖర గ్రామాల్లో తాగునీటి సమస్య కూడా ఎక్కువగా ఉంది. అక్కడి ప్రజలు చెలమలు, ఊటనీరు తాగుతున్నారు. పూరిళ్లు, రేకుల ఇళ్లలోనే నివసిస్తున్నారు. వివాదం ఊబిలో కోటియా.. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా, ఒడిశాలోని కోరాపుట్ ఈ రెండు జిల్లాల పరిధిలో కొఠియా పంచాయతీలో ఉన్న 34 గ్రామాలనే కొఠియా గ్రూపు గ్రామాలుగా పిలుస్తున్నారు. కొఠియా గిరిశిఖర గ్రామాల్లో దాదాపు 15 వేల మంది ప్రజలు నివసిస్తున్నారు. వీరిలో 3,813 మంది ఓటర్లు ఆంధ్రాలోనూ, ఒడిశాలోనూ ఓటు వేస్తున్నారు. 1936లో ఒడిశా ఏర్పడినప్పుడు గానీ ఆంధ్రప్రదేశ్ అవతరించినప్పుడు గానీ ఈ గ్రామాల్లో సర్వే జరగలేదు. ఏ రాష్ట్రంలోనూ వీటిని కలుపలేదు. ఈ గ్రామాలను తమవంటే తమవేనని ఇరు రాష్ట్రాలు వాదిస్తున్నాయి. దీంతో 1968లో ఇరు రాష్ట్రాలూ సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ఈ వివాదాన్ని పార్లమెంటులో తేల్చుకోవాల్సిందిగా 2006లో న్యాయస్థానం సూచించింది. అయినా పరిష్కారం లభించలేదు. వైఎస్ హయాంలో.. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో స్థానిక ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ప్రత్యేక కృషితో కొటియా పల్లెల్లో సంక్షేమ, అభివృద్ధి పథకాలు చురుగ్గానే మంజూరయ్యేవి. దండిగాం నుంచి కొఠియాకు తారు రోడ్డు మంజూరు చేయించారు. ఎగువశెంబి వరకు రోడ్డు నిర్మాణం జరిగింది. రాజశేఖరరెడ్డి హఠాన్మరణం, తదితర కారణాల వలన రోడ్డు ఫార్మేషన్ జరిగినా నిర్మాణం పూర్తికాలేదు. రాజశేఖరరెడ్డి హయాంలో ఈ ప్రాంత గిరిజనులు ఆంధ్రా ప్రాంతం వైపే మొగ్గు చూపారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొటియా గ్రామాలను పూర్తిగా పట్టించుకోవడం మానేసింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ కొటియా గ్రూప్ గ్రామాల్లో ఏ రోడ్డు నిర్మాణం చేపట్టినా రిజర్వ్‌ఫారెస్ట్ నిబంధనలు అడ్డుపడుతున్నాయి. ఇదే ప్రాంతాల్లో ఒడిశా ప్రభుత్వం రోడ్లు వేస్తుంటే మాత్రం అటవీశాఖ అభ్యంతరం తెలపకపోవడాన్ని ప్రజాప్రతినిధులు, ప్రజలు తప్పుబడుతున్నారు. అయితే జిల్లా స్థాయిలో తాము ఏదీ ఆపడం లేదని జిల్లా అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. సీఎం దృష్టి సారించారు వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయిన తరువాత మా ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించారు. గిరిశిఖర గర్భిణులకు సాలూరులోని వైటీసీలో ఏర్పాటు చేసిన గిరిశిఖర గర్భిణుల వసతి గృహం ఎంతగానో ఉపయోగపడుతోంది. 2019 అక్టోబర్ 31న సాలూరు పర్యటనకు వచ్చిన రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్‌హరిచందన్ దృష్టికి మా ప్రాంత సమస్యలను, కొటియా వివాదాలను తీసుకువెళ్లాం. ఇక్కడి సమస్యలపై నటుడు సోనూసూద్ స్పందించి మా ప్రాంతానికి వస్తాననడం శుభపరిణామం. కేంద్ర ప్రభుత్వం అటవీ చట్టాలతో అడ్డుపడకుంటే మా ప్రాంతంలో రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. –పీడిక రాజన్నదొర, సాలూరు ఎమ్మెల్యే చట్టప్రకారమే నడుచుకుంటున్నాం గిరిజన గ్రామాలకు రహదారులు వేయకుండా అటవీశాఖ అడ్డుకుంటోందనే ఆరోపణలు సరికాదు. నేను ఈ జిల్లాకు వచ్చి రెండు నెలలైంది. ఈ కొద్ది సమయంలోనే పెండింగ్ ఫైళ్లు అన్నీ క్లియర్ చేశాం. ప్రస్తుతం ఏ ఒక్క ఫైలు కూడా మా స్థాయిలో పెండింగ్ లేదు. ప్రాంతీయ కార్యాలయానికి, రాష్ట్ర అధికారులకు, కేంద్రానికి పంపించినవి కొన్ని అక్కడ పెండింగ్ ఉంటే ఉండవచ్చు. గిరిజనులకు మంచి చేయాలనే మాకూ ఉంటుంది. కానీ అటవీ చట్టానికి లోబడే మేము పనిచేయాలి.ఎక్కడైనా మా వల్ల అభివృద్ధి ఆగిందని మా దృష్టికి తీసుకువస్తే తప్పకుండా విచారణ జరుపుతాం. –సచిన్ గుప్తా, అటవీశాఖ జిల్లా అధికారి -
పకడ్బందీగా పెసా
సాక్షి, ఆసిఫాబాద్: అడవి బిడ్డలకు స్వయం పాలన మరింత సులువు కానుంది. ఇన్నా ళ్లు షెడ్యూల్డ్ ఏరియాలో గిరిజనుల హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా కొనసాగింది. పెసా (పంచాయతీస్ ఎక్స్టెన్షన్ టూ షెడ్యూల్ ఏరియా) 1996 చట్టం పకడ్బందీగా అమలు కానున్న నేపథ్యంలో వాటికి అడ్డుకట్ట పడే ఆస్కారముంది. ఇందుకు ప్రత్యేకంగా ఏజెన్సీ పరిధిలో ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్‌లోని మూడు జిల్లాలకు తొలిసారిగా పెసా కో ఆర్డినేటర్ల నియామకం జరుగుతోంది. ఏజెన్సీ గ్రామాల్లో గత నాలుగు రోజులుగా పెసా గ్రామసభల నిర్వహణ సాగుతోంది. మరో వారం రోజుల్లో ఏజెన్సీ పరిధిలో ఉన్న ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లోని అన్ని గిరిజన గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి పెసా ఉపాధ్యక్ష, కార్యదర్శులను ఎన్నుకోనున్నారు. పెసా గ్రామసభలు ఎంపీడీవో, డిప్యూటీ తహసీల్దార్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో జరగనున్నాయి. వీరితో పాటు జిల్లాకు ఒక పెసా కో ఆర్డినేటర్‌ను కొత్తగా నియమించారు. ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల పెసా కో ఆర్డినేటర్‌గా వెడ్మ బొజ్జు, కుమురం భీం జిల్లా కో ఆర్డినేటర్‌గా అర్క వసంతరావు నియమితులయ్యారు. వీరికి ప్రభుత్వం నుంచి నెలకు రూ.25వేల జీత భత్యాలతో పాటు వాహన, ఇతర సౌకర్యాలు కల్పిస్తారు. అలాగే పెసా సభ్యులకు నెలకు రూ.2500 గౌరవ వేతనం అందనుంది. వాస్తవానికి పెసా కో ఆర్డినేటర్ల నియామకం పీవో ఐటీడీఏ, కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారుల ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో 2017లోనే జరిగింది. 2018 ఏప్రిల్ నుంచి వారు విధుల్లో చేరారు. కాగా వరుస ఎన్నికలతో గ్రామాల్లో ఉపాధ్యక్ష, కార్యదర్శులను ఎన్నుకోలేకపోయారు. పెసా గ్రామసభ అంటే.? దేశంలోని గ్రామాలను సర్వాతోముఖాభివృద్ధి చేసేందుకు భారత పార్లమెంటు 1992లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం ద్వారానే ప్రస్తుతం ఉన్న గ్రామ పంచాయతీలు పురుడుపోసుకున్నాయి. అయితే ఈ సవరణ కేవలం మైదాన ప్రాంతంలోని గ్రామాలకే అధికారాలు కల్పించాయి. కాని రాజ్యాంగంలో ఉన్న ఐదో షెడ్యూల్డ్‌లో పేర్కొన్న వివిధ రాష్ట్రాల్లో ఉన్న గిరిజన ప్రాంతాల గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. దీంతో మరోమారు గిరిజనులకు ప్రత్యేక హక్కులు కల్పించాలని వారి ప్రాంతాల్లో గిరిజనేతరుల జోక్యం తగ్గించాలనే ఉద్దేశంతో 1996లో పంచాయతీరాజ్ ఎక్స్టేన్షన్ టూ షెడ్యూల్ ఏరియా(పెసా) చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం తీసుకొచ్చినప్పటికీ నియమనిబంధనలు మాత్రం 2011లో ఉనికిలోకి వచ్చాయి. ఆ తర్వాత ఎనిమిదేళ్ల అనంతరం ఈఏడాది నుంచి పెసా కమిటీలను పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నారు. ఆదిలాబాద్, మంచిర్యాల, కుమురం భీం జిల్లాలో విస్తరించిన ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ పెసా గ్రామసభలను నిర్వహించేందకు అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శులను ఎన్నుకొనున్నారు. మూడు జిల్లాల పరిధిలో.. ఆదిలాబాద్‌లో ఏజెన్సీ విస్తరించి ఉన్న 16 మండల్లాలోని 248 గ్రామ పంచాయతీల్లో 363 రెవెన్యూ గ్రామాల పరిధిలో గ్రామ సభలు నిర్వహించనున్నారు. వీటి ద్వారా 726 ఆవాసాల నుంచి ఉపాధ్యక్ష, కార్యదర్శులను ఎన్నుకోనున్నారు. అలాగే మంచిర్యాలలోని ఎనిమిది మండలాల్లో విస్తరించి ఉన్న ఏజెన్సీ పరిధిలో 18 గ్రామ పంచాయతీల్లో 29 గ్రామసభల్లో 75 గిరిజన గూడాల నుంచి ఇద్దరేసి చొప్పున ఎన్నుకోనున్నారు. ఇక కుమురం భీం జిల్లాలో 13 ఏజెన్సీ మండలాల్లో 168 గ్రామ పంచాయతీల పరిధిలో 204 గ్రామసభల్లో 580 ఆవాసాలకు ఇద్దరేసి చొప్పున ఎన్నుకోనున్నారు. ఈ మూడు జిల్లాల సభ్యులకు జిల్లా స్థాయిలో కో ఆర్డినేటర్లు ఉంటారు. వీరు పెసా చట్టం అమలులో నిర్ణయాత్మకంగా ఉంటారు. ఒక్కో గ్రామసభకు ఇద్దరేసి.. ఏజెన్సీ గ్రామ పంచాయతీ సర్పంచ్ పెసా చట్టం ప్రకారం అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. కొత్తగా ఉపాధ్యక్ష, కార్యదర్శి పదవులకు ప్రస్తుతం గ్రామసభల తీర్మానం ద్వారా ఎన్నుకుంటున్నారు. ఆదిలాబాద్, మంచిర్యాల, కుమురం భీం జిల్లాల నుంచి మొత్తం 37 మండలాల్లో 434 షెడ్యూల్ పంచాయతీల్లో ఈ ప్రక్రియ జరగనుంది. గ్రామంలో ఉన్న ఓటర్లు గ్రామసభలో సభ్యులుగా ఉంటారు. గ్రామసభ తప్పనిసరిగా 1/3 వంతు కోరం ఉండాలి. అప్పుడే తీర్మానాలు ఆమోదింబడతాయి. స్వయం పాలనకు పునాది.. అధికార యంత్రాంగం ఇష్టారీతిన గిరిజనుల హక్కులు కాలరాసిన సందర్భాలు అనేకం. అయితే ఇక నుంచి ఏజెన్సీ పరిధిలోని భూములు, సహజ వనరులు, అటవీ సంపదతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక, వారసంతలు, అక్రమ మైనింగ్, భూగర్భ గనులు, సంఘాలు, బెల్టు, వైన్స్, వ్యాపారం, ఇతరత్ర అభివృద్ధి కార్యాక్రమాలన్ని పెసా చట్టం ప్రకారం గ్రామసభల ఆమోదం తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే నిర్ణీత వ్యవధిలో ఆ శాఖ అధికారిపై చర్యలు తీసుకుంటారు. చట్టం అమలు, గిరిజనులకు అవగాహన తదితర అంశాలను కో ఆర్డినేటర్లు పర్యవేక్షిస్తారు. సమర్థవంతంగా అమలు చేస్తాం ప్రస్తుతం అన్ని గిరిజన గ్రామాల్లో పెసా చట్టం అనుసరించి గ్రామసభల ద్వారా ఉపాధ్యక్ష, కార్యదర్శి పదవులకు ఎన్నిక జరుగుతోంది. మరో వారం రోజుల్లో పూర్తవుతుంది. ఏజెన్సీలో ఏ అభివృద్ధి కార్యక్రమమైనా పెసా చట్టం లోబడే ఉండేలా కృషి చేస్తాం. – వెడ్మ బొజ్జు, అర్క వసంతరావు, పెసా కో ఆర్డినేటర్లు, కుమురం భీం, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలు -
ప్రజలను బెంబెలెత్తిస్తున్న పోలవరం కాఫర్ డ్యామ్ పనులు
-
ఏజన్సీలో ఒక్క గొంతూ ఎండొద్దు
► ఇప్పటి నుంచే అధికారులు శ్రద్ధ పెట్టాలి ► జూనియర్ కళాశాలలుగా రెండ్యాల, మూడు చెక్కలపల్లి, తాడ్వాయి ఆశ్రమ పాఠశాలలు ► గిరిజన సంక్షేమ అభివృద్ధి సమావేశంలో మంత్రి అజ్మీరా ► వచ్చే నెలలో పూర్తి స్థాయి ఐటీడీఏ సమావేశం ఏటూరునాగారం/ఎస్ఎస్ తాడ్వాయి : ఏజన్సీ ప్రజలకు తాగునీటి సమస్యల తలెత్తకుండా చూడాలి.. ఒక్క గొంతూ ఎండొద్దు.. అధికారులు ఇప్పటి నుంచే ప్రత్యే శ్రద్ధ చూపాలని గిరిజన సంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ సూచించారు. తాడ్వాయి ఆశ్రమ పాఠశాలలో కలెక్టర్ మురళి అధ్యక్షతన గిరిజన సం క్షేమ అభివృద్ధి సమావేశం గురువారం జరగగా ఆయన మాట్లాడారు. ఈ సమావేశానికి ఐటీడీఏ పరిధిలోని గిరిజన మండలాల ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలను పిలవాలనుకున్నా నూతన జిల్లా, అధికారుల అవగాహన లోపం వల్ల పిలవలేక పోయామన్నారు. ఇది ఐటీడీఏ పాలక మండలి సమావేశం కాదని గిరిజన సంక్షేమ అభివృద్ధి సమావేశం మాత్రమేనన్నారు. వచ్చే నెలలో పూర్తి స్థాయిలో పాలకమండలి సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. ఏజన్సీ గ్రామాల్లో తీవ్రంగా ఉన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. రెడ్యాల, మూడు చెక్కలపల్లి, తాడ్వాయి ఆశ్రమ బాలికల పాఠశాలలను ఈ జూన్ నుంచి జూనియర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేస్తున్నందున ఏర్పాట్లుచేయాలని చెప్పారు. విద్య, ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్.. మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ మాట్లాడుతూ హన్మకొండ జులైవాడ హాస్టల్లో గోళాలపై బస్త సంచులు కప్పిన నీటిని తాగున్నారని, నేను నిధులు ఇస్తా వాటర్ ప్లాంట్ పెట్టమని చెప్పినా ఎందుకు పెట్టలేదని ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ కోటిరెడ్డిని ప్రశ్నించారు. గిరిజన పిల్లలకు అవసరమైన డ్యూయల్ బెడ్స్ ఏర్పా టు చేయించడంలో అధికారులు నిర్లక్ష్యం చూపొద్దన్నారు. గిరిజన బాలిక, బాలుర డిగ్రీ విద్యార్థుల కోసం రెసిడెన్షియల్స్ నిర్మించడానికి ప్రణాళికలను తయారు చేయాలన్నారు. జిల్లాకు కేటాయించిన ఈజీఎస్ నిధులను కలెక్టర్ నేరుగా గ్రామపంచాయతీలకు అప్పగించడం వల్ల జెడ్పీటీసీలు ఉత్సవ విగ్రహాలుగా మిగిలా రని జెడ్పీ ఫ్లోర్ లీడర్ సకినాల శోభన్ అన్నారు. 10 శాతం జెడ్పీ, 15 మండల పరిషత్, 75 గ్రామ పంచాయతీలకు కేటాయించాలని ఈజీఎస్ చెబుతున్నా కలెక్టర్ మాత్రం నిధులను మొత్తం పంచాయతీలకు అప్పగించడం బాధాకరమన్నారు. మంత్రి చందూలాల్ కల్పించుకొని జెడ్పీటీసీలు ఇచ్చిన ప్రతిపాదనల ప్రకారం పనులకు అనుమతులు ఇచ్చి, నిధులు కేటాయించే విధంగా చూడాలన్నారు. వైద్య శాఖ .. జిల్లాలో 25 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, నాలు గు సామాజిక ఆస్పత్రులు ఉన్నాయని డీఎంహెచ్ఓ అప్పయ్య వెల్లడించారు. కొత్తగూడ, గూడూరు, మంగపేట, ఏటూరునాగారం మం డలాల్లో సబ్ సెంటర్ల కోసం అనుమతులు వచ్చాయని, వాటి నిర్మాణాలు చేపట్టాలని కోరా రు. ఎనిమిది పీహెచ్‌సీలను 24/7గా అప్‌గ్రేడ్ చేసి నిత్యం వైద్యులు అందుబాటులో ఉంటు న్నారని చెప్పారు. జిల్లాలో మూడు నెలల్లో 256 డెలివరీలు చేశామని, ఐటీడీఏ పరిధి పీహెచ్‌సీలకు ఉన్న 12 అంబులెన్స్‌లకు మూడు నెలలు గా అద్దె చెల్లించడం లేదని, గతంలోనూ చెల్లించకపోతే ఐటీడీఏ నుంచి ఇచ్చామని జేసీ అమయ్‌కుమార్ మంత్రికి వెల్లడించారు. ములుగు, ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి రెండు అంబులెన్స్‌లు ఇప్పించాలని డీఎంహెచ్ఓ మం త్రిని కోరారు. ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రిని 50 పడకల చేర్చినా మందులు 30 పడకల వరకే వస్తున్నాయని జెడ్పీటీసీ వలియా బీ తెలపగా మిగతావి కూడా వచ్చేలా చూస్తామని డీసీహెచ్ఎస్ గోపాల్ వివరించారు. బెల్ట్‌షాపులను రద్దు చేయాలి ఏజన్సీలో గుడుంబాను, బెల్ట్‌షాపులను అరికట్టాలని ఏటూరునాగారం ఎంపీపీ మోహరున్నీసా కోరారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ శశిధర్‌ను మంత్రి పిలిచి బెల్ట్‌షాపులను ఎందుకు నియంత్రించడం లేదని ప్రశ్నించగా రాతపూర్వకంగా ఫిర్యాదులు రావడం లేదన్నారు. అయితే, మీరు చర్యలు తీసుకున్నదెప్పుదని అన్నారు. ఆ తర్వాత అటవీ ఉత్పత్తులు ఎన్ని రకాలు కొంటున్నారు.. గిరిజనులకు ఏ విధమైన ఉత్పత్తుల ఆదాయం కల్పిస్తున్నారో పది రోజుల్లో రిపోర్టు ఇవ్వాలని జీసీసీ డీఎం ప్రతాప్‌రెడ్డిని ఎంపీ ఆదేశించారు. జిల్లాలో 1.57 లక్షల కుటుంబాలుండగా కేవలం 30వేల కుటుంబా లకు మాత్రమే మరుగుదొడ్లు ఉన్నాయని ఈఈ నిర్మల చెప్పగా.. అందరికీ ఎప్పుడు కట్టిస్తారని ఎంపీ ప్రశ్నించారు. 2017 సెప్టెంబర్ వరకు 395 గ్రామాలకు మిషన్ భగీరథ కింద నీటిని అందిస్తామని ఈఈ తెలిపారు. రామప్ప కింద ఉన్న గ్రామాలకు నీటిని ఎందుకు అందించడం లేదని ఈఈని ప్రశ్నించిన మంత్రి పది, పదిహేను రోజుల్లో అందించాలని ఆదేశించారు. సమావేశంలో ములుగు సబ్‌కలెక్టర్ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. -
తాగునీటి తండ్లాట షురూ..
► అడుగంటుతున్న భూగర్భ జలాలు ► మరో వారమైతే తాగునీరూ కరువే ► పశువులను అమ్ముకుంటున్న రైతులు ► ఆందోళనలో బాధిత గ్రామాల ప్రజలు ఆదిలాబాద్ రూరల్ : మండలంలోని పలు ఏజెన్సీ మారుమూల గ్రామాల్లో నీటి ఎద్దడి అప్పుడే మొదలైంది. ప్రతీ వేసవి కాలం మాదిరిగానే మండలంలోని ఖండాల గ్రామపంచాయతీ పరిధిలోని ఖండాల, పోతగూడ, ఎస్సీగూడ, పూనగూడ, ధర్లొద్ది, మొలాలగుట్ట, చిలాటిగూడతో పాటు పిప్పల్‌ధరి గ్రామ పంచాయతీ పరిధిలోని మామిడికోరి గ్రామంలో రెండు నెలల కిందటనే భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. గ్రామానికి ఆనుకుని ఉన్న వాగులో చెల్మెలు తోడి కలుషిత నీళ్లతో దాహార్తిని తీర్చుకుంటున్నారు. వాగు నీళ్లు సైతం ఇంకిపోవడంతో గ్రామానికి సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల దూరం నుంచి నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని గ్రామస్తులు వాపోతున్నారు. ఖండాల గ్రామంలో సుమారు 70 కుటుంబాలలో 600కుపైగా జనాభా ఉంది. వీరి దాహార్తిని తీర్చడానికి గ్రామంలో రెండు బోరు బావులు, మరో వ్యవసాయ బావి ఉంది. వీటిలో బోరు బావుల్లోని నీరు అడుగంటిపోయింది. వ్యవసాయ పొలంలో ఉన్న బావే పెద్ద దిక్కుగా మారింది. ఆ బావిలో నీళ్లు రావాలంటే గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంటోందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఖండాల గ్రామ పంచాయతీ పరిధిలోని పోతగూడ గ్రామంలోని బోరు బావులు ఇంకిపోవడంతో గ్రామానికి కొంత దూరంలో ఉన్న బావి నుంచి నీళ్లను తెచ్చుకుంటున్నారు. గ్రామంలో ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో నీళ్లు లేకపోవడంతో స్నానాలకు వేరే చోట నుంచి ఎడ్ల బండ్లతో తీసుకువస్తున్నారు. తాగడానికి ఐదు కిలోమీటర్ల దూరం నుంచి ఫ్యూరిఫైడ్ నీళ్లను తెచ్చుకుంటున్నారు. వేసవి కాలం ప్రారంభం కాక ముందే నీళ్లు అడుగంటిపోవడంతో రాబోయే రోజుల్లో తమ పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. అలాగే అదనంగా బోర్లు వేసి తమ దాహార్తిని తీర్చాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. బురద నీళ్లే తాగుతున్నం డిసెంబర్ చివరి వారం నుంచే నీటి ఇబ్బందులు మొదలయ్యాయి. రాబోయే రోజుల్లో మరింత ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉంది. నీళ్లు దొరకకపోవడంతో గ్రామ సమీపంలో ఉన్న చెలిమెల నుంచి తెచ్చుకున్న బురదనీరే తాగుతున్నం. – ఆత్రం సీతాబాయి, మామిడికోరి, పిప్పల్‌ధరి పనులకు వెళ్లలేకపోతున్నం ప్రస్తుతం బోరు బావిలోని నీరు అడుగంటింది. గ్రామంలో సోలార్ చేతిపంపు ఉన్నప్పటికీ నీళ్లు లేవు. గ్రామానికి దూరంగా ఉన్న చెరువు నుంచి ఎడ్లబండ్లతో, కాలినడకన వెళ్లి నీళ్లను తెచ్చుకుంటున్నాం. అధికారులు, ప్రజాప్రతినిధులు సమస్య పరిష్కరించాలి. – ఆత్రం రాము, గ్రామపటేల్, మామిడికోరి చాలా దూరం పోతున్నం రెండు నెలల నుంచి నీళ్ల కోసం మస్తు పరేషానవుతున్నం. మా ఊళ్లో ఉన్న బోరింగ్లు, నూతిల్లో నీళ్లు ఎండిపోయాయి. నీళ్ల కోసం ఎడ్లబండిపై మస్తు దూరం పోతున్నం. ఎండలు ముదిరితే నీళ్లు దొరకేటట్లు లేవు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించాలి. – కొడప జంగుబాయి, మొలాలగుట్ట -
ఏజెన్సీ గ్రామాల్లో భయం.. భయం..
మల్కన్‌గిరి నుంచి సాక్షి బృందం: ఎన్కౌంటర్ జరిగిన మల్కన్‌గిరి జిల్లా అటవీ ప్రాంతంతో పాటు ఏవోబీ పరిధిలోని ఏజెన్సీ గ్రామాలన్నీ భయం గుప్పెట్లో వణికిపోతున్నాయి. ఏపీ నుంచి ప్రత్యేకంగా నాలుగు ప్రత్యేక ప్లటూన్స్ను సోమవారం ఎన్కౌంటర్ తర్వాత ఏజెన్సీలో దింపారు. మొత్తం నాలుగు వేల మందిని రంగంలోకి దింపినట్టు పోలీసువర్గాల సమాచారం. ఎస్పీ, అడిషనల్ ఎస్పీ క్యాడర్ స్థాయి అధికారులు ఈ ప్లటూన్స్కు నాయకత్వం వహిస్తున్నారు. కటాఫ్ ఏరియాతో పాటు ఏఓబీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. దీంతో ఏ క్షణాన ఏం ఉపద్రవం ముంచుకొస్తుందోననే ఆందోళనతో గిరిజన గ్రామాలున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలోని అధికార పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు రాజీనామాలు కూడా చేశారు. పలువురు గిరిజనులను మావోయిస్టులు ప్రజాకోర్టు పేరుతో హతమార్చడంతో మావోలపై గిరిజనుల్లో సైతం ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. ఈ పరిస్థితుల్లో ఏజెన్సీలో హెల్త్ ఎమర్జెన్సీపై ఏజెన్సీ బంద్‌కు పిలుపునివ్వడంతో పాటు ఇటీవల మళ్లీ పూర్తిస్థాయిలో పట్టు సాధిం చేందుకు మావోలు గిరిజన గ్రామాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. షెల్టర్ జోన్‌గా కటాఫ్ ఏరియా నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. 2015లో జరిగిన కొయ్యూరు ఎన్కౌంటర్లో మావో అగ్రనేత అజాద్‌ను కోల్పోయిన తర్వాత మావోలు తమ కార్యకలాపాలు మరింత వేగవంతం చేశారు. -
ఆస్పత్రులపై నమ్మకం కలిగించాలి
సేవా దృక్పథంతో విధులు నిర్వర్తించాలి కలెక్టర్ జగన్మోహన్ ఉట్నూర్ : ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం కలిగేలా వైద్యులు సేవా దృక్పథంతో విధులు నిర్వర్తించాలని కలెక్టర్ జగన్మోహన్ అన్నారు. శుక్రవారం కేబీ ప్రాంగణంలోని పీఎమ్మార్సీ భవనంలో ఐటీడీఏ పీవో కర్ణన్‌తో కలిసి రాష్ట్రీయ స్వస్థ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం కలిగించాలని అన్నారు. స్థానికంగా నివాసం ఉంటూ మెరుగైన వైద్యం అందించాలని చెప్పారు. గ్రామాల్లోని 18 ఏళ్లలోపు బాలబాలికలు అనారోగ్యం పాలవకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆశ్రమ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య రక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. జ్వరాలతో బాధపడే విద్యార్థులకు రక్త పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం అందించాలని చెప్పారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గిరిజన ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వైద్యులు గ్రామాలకు వెళ్లేందుకు వీలుగా జిల్లాలోని 17 క్లస్టర్లకు ప్రతీ క్లస్టర్ రెండు చొప్పున 34 వాహనాలు కేటాయించామని చెప్పారు. వైద్య బృందాలు ప్రతి రోజు కనీసం పది అంగన్వాడీ కేంద్రాలు, ఉన్నత పాఠశాలలు, ఆశ్రమాలు సందర్శించి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. మూడు నెలలపాటు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ వ్యాధులు, జ్వరాలు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ సమావేశంలో మలేరియాధికారి అల్హం రవి, ఏజెన్సీ అదనపు వైద్యాధికారి ప్రభాకర్‌రెడ్డి, ఆర్బీఎస్కే జిల్లా కో ఆర్డినేటర్ సుంకన్న, డీడీటీడబ్ల్యూ రాంమూర్తి, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. మొక్కలు నాటిన కలెక్టర్ హరితహారం కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ జగన్మోహన్ మండలంలోని ఎక్స్ రోడ్డు చీమ్నానాయక్ తండాలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం హరితహారం కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. మొక్కలు నాటిన ప్రతి ఒక్కరూ వాటిని రక్షించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. -
రోడ్ల అభివృద్ధికి రూ.1,700 కోట్లు
తక్షణ సహాయంగా రూ.లక్ష మంత్రి జోగు రామన్న డయేరియా మృతుల కుటుంబానికి పరామర్శ నార్నూర్ : జిల్లాలోరూ.1,700 కోట్లతో పంచాయతీ, ఆర్డబ్ల్యూఎస్ రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు అటవీ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. గురువారం మండలంలోని మేడిగూడ గ్రామంలో డయేరియాతో మృతిచెందిన కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. మృతుడు నాగనాథ్ భార్యకు ఔట్సోర్సింగ్ ఉద్యోగం కల్పిస్తామని, కుటుంబ పోషణ కోసం రూ.లక్ష ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు. మంత్రిని నిలదీసిన మహిళలు మేడిగూడకు చెందిన దివ్య, మాధవిలు మంత్రి రామన్నను నిలదీశారు. స్వాతంత్య్రం వచ్చి 63 ఏళ్లు అవుతున్నా గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదని అన్నారు. గాదిగూడ వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టక పోవడంతోనే ఒకే కుటుంబంలో ముగ్గురు ప్రాణాలు పోయాయని, పోయిన ప్రాణాలను తిరిగి ఇవ్వగలరా ప్రశ్నించారు. సరైన సమయంలో వైద్యం అంది ఉంటే ప్రాణాలు దక్కేవని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక ప్రాణాలు పోగొట్టుకుంటున్నామని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి మాట్లాడుతూ రూ.2 కోట్లతో గాదిగూడ వాగుపై బ్రిడ్జి నిర్మాణం కోసం టెండర్ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. గ్రామంలో తాగునీటి వసతి కోసం వాటర్‌ట్యాంకు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. మృతుడి కుమారులను మంచి పాఠశాలలో చేర్పించి విద్యనందిస్తామని పేర్కొన్నారు. ఎంపీటీసీ సభ్యుడు గోవింద్‌నాయక్, జెడ్పీటీసీ రూపావతి జ్ఞానోబా పుష్కర్, సర్పంచ్ దయానంద్‌నాయక్, రఘుపతి, ఐటీడీఏ పీవో కర్ణన్, ఆర్డివో ఐలయ్య, జిల్లా ఏజెన్సీ అదనపు వైద్యాధికారి ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. -
మన ఊళ్లు ఇలా కాకూడదు
సామాజికం మద్యం మత్తులో మృత్యువు ఒడిలోకి ఏజెన్సీ గ్రామాలు నాటు సారాతో నిర్జీవంగా మారుతున్న యువతరం పాతికేళ్లు నిండకుండానే వితంతువులుగా మారుతున్న స్త్రీలు పల్లెలో సెలయేరు పారాలి... సారా కాదు. కానీ.. ఏజెన్సీ ప్రాంతాల్లో సారా సెలయేరులా పారుతోంది. ప్రాణాలు తీస్తోంది. స్త్రీలను చిన్నవయసులోనే వితంతువులను చేస్తోంది. ఈ దుస్థితి ఏ ఊరికీ రాకూడదు. మనం రానివ్వకూడదు. విశాఖ జిల్లాలోని కొయ్యూరు మండలంలోని ఐదు గ్రామాల్లో సాక్షి ‘ఫ్యామిలీ’ ఇటీవల పర్యటించింది. ఏ గ్రామాన్ని కదలించినా నాటుసారా తాగి మృత్యువాత పడి భర్తలను కోల్పోయిన మహిళలే కనిపించారు! ఈ గ్రామాల్లో భర్తలు కోల్పోయిన స్త్రీలుంటే, మరికొన్ని గ్రామాల్లో తాగుడుకి బానిసైన యువకులకి 40 ఏళ్లొచ్చినా పెళ్లి కాని పరిస్థితి. ఇంకొన్ని గ్రామాల్లో మంచంలోనే తాగి తాగి కిడ్నీలు పాడయిన యువకులు కొందరైతే, శరీరభాగాలన్నీ చచ్చుబడిపోయి కాటికి కాళ్లు చాపుకున్న నవ యువకులు మరికొందరు. వీటికి తోడు తాగిన మత్తులో విచక్షణ మరిచి వ్యవహరిస్తున్న కొడుకుల నుంచి రక్షించుకోవడానికి రాత్రిళ్లు తల్లులు గ్రామాల నుంచి అడవుల్లోకి పారిపోతున్న దారుణాలు ఆదివాసీ స్త్రీల జీవితాలకు అద్దంపడుతున్నాయి. రాత్రంతా చెట్టుపైనే! కుర్జు పెంటమ్మది కొయ్యూరు మండలం కొమ్మిక గ్రామం. ఒక కొడుకు నిత్యం సారా మత్తులో మునిగి తేలుతుంటే, మరోకొడుకు తాగొచ్చి, కత్తి చేత్తో పట్టుకొని వెంటపడ్డాడు. కొడుకునుంచి ప్రాణాలు రక్షించుకోవడానికి ఆ తల్లి జీడిమామిడి చెట్లపైనే రాత్రంతా గడిపి తెల్లారాకైనా కొడుకు మత్తు దిగుతుందని ఇంటికొచ్చానంటోంది. ఇది ఒక్కతల్లి పరిస్థితే కాదు. అక్కడ తల్లులెందరిదో ఇదే పరిస్థితి. గొడ్డలి ఎత్తి చంపేస్తానన్నాడు బోండా పూర్ణకి ఇద్దరాడపిల్లలు. తాగుడుకి బానిసై డబ్బులివ్వమని వేధిస్తున్నా, భర్తను భరించింది. కానీ గొడ్డలి పట్టుకొని చంపేస్తానని వెంటపడే భర్తనుంచి ప్రాణాలు ఎలా కాపాడుకోవాలని ప్రశ్నిస్తోంది. ఇద్దరు కూతుళ్లను భర్త బారినుంచి తప్పించేందుకు తంటాలు పడుతోంది. పొయ్యిలో కాళ్లు పెట్టాడు నీలపు దేవుడమ్మది కొయ్యూరు మండలంలోని కొమ్మిక గ్రామం. కొడుకు గౌరీనాయుడు నిత్యం సారాయిలో మునిగితేలుతున్నా ఏదోలే అని ఊరుకుంది. తాగినా ఇంటిపట్టున పడుంటాడనుకుంది. కూలోనాలో చేసి ఇంత గంజిపోసి కొడుకు ఆకలి నింపుతోంది. వారం క్రితం మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో కూడా తెలియని స్థితిలో కణకణమండే పొయ్యిలో కాళ్లు పెట్టాడు. కాళ్లు పూర్తిగా కాలిపోయిన కొడుకుకి యిప్పుడా తల్లే సేవలు చేస్తోంది. ఈ ఊరిలో మొత్తం 125 కుటుంబాలున్నాయి. 100 ఇళ్లున్నాయి. 35 ఏళ్ల లోపే భర్తలను కోల్పోయిన మహిళలు 36 మంది. 35 ఏళ్లు దాటినా ఇంకా పెళ్లి కాని పురుషులు 32 మంది ఉన్నారు. పిల్లనిచ్చేవారి సంగతి సరే ఈ ఊరు పేరు చెబితేనే బెంబేలెత్తిపోతున్నారు జనం. ఎటు చూసినా వితంతువులే కొయ్యూరు మండలంలోని ఎం.మాకవరం గ్రామంలో మొత్తం 300 కుటుంబాలు, 150 ఇళ్లున్నాయి. ఇక్కడ తాగుడుకి బానిసై భర్తలను కోల్పోయిన స్త్రీలు 18 నుంచి 30 ఏళ్ల లోపు వాళ్లు మొత్తం 32 మంది ఉన్నారు. 31 నుంచి 40 ఏళ్లలోపు వారిలో భర్తలను కోల్పోయిన స్త్రీలు 31 మంది. అంటే మొత్తం భర్తలు లేని స్త్రీలు 63 మంది. ఇదే మండలంలోని కర్నిక పాలెం గ్రామంలో మొత్తం 80 ఇళ్లు న్నాయి. 105 కుటుంబాలున్నాయి. ఇక్కడ 35 ఏళ్ల లోపు భర్తలను కోల్పోయిన స్త్రీలు 17 మంది. 35 ఏళ్లు పైబడిన వారిలో భర్తలు లేని స్త్రీలు 12 మంది. మొత్తం 47 మంది. అంటే దాదాపు సగం కుటుంబాల్లో కుటుంబ పెద్ద తాగుడుకి బానిసై మరణించినవారే. ఇక ఇదే గ్రామంలో 35 ఏళ్లొచ్చినా తాగుడు కారణంగా పెళ్లి కాని యువకులు 16 మంది ఉన్నారు. మాకవరం గ్రామం లో చింతల్లి అనే మహిళ భర్త తాగి, తాగి రక్తం కక్కుకుని చనిపోయాడు. ఉన్న ఇద్దరు కొడుకులు మద్యానికి బానిసలయ్యారు. అంతేకాదు రోజుకి 20 నుంచి 25 గుట్కాలు తింటాడని చెబుతోంది. భర్త చావుకళ.. కొడుకుల్లోనూ కనిపిస్తోంటే విలపిస్తోంది. గ్రామ స్వరాజ్యం కోసం... కొయ్యూరు మండలంలోని సర్వన్న పాలెం సర్పంచ్ నారాయణ మూర్తికి ఒకప్పుడు బ్రాందీ షాపు ఉండేది. ఆ ఊరికి రోడ్డు లేదు. ఆసుపత్రి లేదు. కానీ బ్రాందీ షాపు ఉంది. జనం తాగుడుకి బానిసై ఇల్లు గుల్ల చేసుకుంటోంటే ఆ పాపపు సొమ్ము నాకొద్దంటూ బ్రాందీ షాపు మూసేసి చిల్లర కొట్టు పెట్టుకున్నాడు. ‘గ్రామస్వరాజ్యం’ అనే స్థానిక స్వచ్ఛంద సంస్థ తమ చైతన్యానికి కారణమని గ్రామస్థులు అంటున్నారు. స్వతంత్రంగా పనిచెయ్యనివ్వాలి ‘‘గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం కోసం మా సంస్థకి ‘గ్రామ స్వరాజ్యం’ అని పేరు పెట్టుకున్నాం. ప్రజల్లో చైతన్యం కోసం ప్రయత్నిస్తున్నాం. అయితే ఐటిడిఎలు స్వతంత్రంగా పనిచేసే అవకాశం ఉండాలి’’ అని గ్రామస్వరాజ్యం డెరైక్టర్ రాము అంటున్నారు. ఈ గ్రామాల్లో ప్రజలకు ఆరోగ్యం లేదు. కేవలం తాగుడే అలవాటుంటే ఇంతలా చనిపోరు. అసలు వాళ్లకు పౌష్టికాహారమే లేదు. చదువుకున్న వారు ఒకటీ అరాతప్ప లేనేలేరు. ఉపాధి సంగతి సరే సరి. ఆడవాళ్లే రోజు కూలికి వెళ్లి, మగాళ్లని పోషిస్తున్న పరిస్థితి. శక్తిమంతమైన యువతరం మత్తులో జోగుతోంది. ప్రభుత్వ నిర్లక్ష్యమే అందుకు కారణమంటున్నారు ఆదివాసీల్లో పనిచేస్తున్న సామాజిక కార్యకర్త వెంకట్రావు. - అత్తలూరి అరుణ, ప్రిన్సిపల్ కరస్పాండెంట్, ‘సాక్షి’ -
ఏజెన్సీ గ్రామాల్లో వి-శాట్ వ్యవస్థ
సీతంపేట : సీతంపేట ఏజెన్సీలోని షెడ్యూల్డ్ గ్రామాల్లో వి-శాట్ వ్యవస్థ పెట్టడానికి ఏర్పా ట్లు చేయాలని ఐటీడీఏ ప్రాజెక్టుఅధికారి ఎన్.సత్యనారాయణ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం ఐటీడీఏ కార్యాలయంలో ఐసీడీఎస్, జీసీసీ, విద్య తదితర శాఖల సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ 16 పంచాయతీల్లో వందకు పైగా జనాభా ఉన్న గ్రామాలను వి-శాట్ వ్యవస్థ కోసం ఎంపిక చేసినట్టు పేర్కొన్నారు. గ్రామాల్లో ఉన్న మౌలిక వసతులు, వివిధ పథకాల అమలు తీరును ఎప్పటికపుడు ప్రభుత్వం తెలుసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. సోలార్ పద్ధతిలో ఈ వ్యవస్థ పనిచేస్తోందన్నారు. పాఠశాల, డీఆర్ డిపో, పీహెచ్‌సీల్లో వి-శాట్ ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో డిప్యూటీ ఈవో మల్లయ్య, సీఎంవో తిరుపతిరావు, టెలికాం సిబ్బంది పాల్గొన్నారు. -
కానలో కాక
వణికించే చలికాలంలో వనసీమ వేడెక్కుతోంది. జిల్లా ఏజెన్సీలో ఉద్యమాన్ని తిరిగి బలోపేతం చేసేందుకు మావోయిస్టులు పక్కా వ్యూహంతో ముందడుగు వేస్తుండగా.. వారి అడుగు జాడలను పసిగట్టి, వారి యత్నాలను మట్టి కరిపించాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో గిరిజన గ్రామాలు ఉద్రిక్తతకు నెలవులు కానున్నాయి. అక్కడి ప్రజలు అడకత్తెరలో పోకచెక్కలు కానున్నారు. * ఉద్యమ బలోపేతానికి మావోయిస్టుల పూనిక * యువకులను ఆకర్షించేందుకు ముమ్మర యత్నం * ఏఓబీ ఇన్చార్జిగా రవి అలియాస్ బాలకృష్ణ * మావోలను బలపడనివ్వరాదని పోలీసుల పంతం రంపచోడవరం :ఒకనాడు కోల్పోయిన పట్టు కోసం మావోయిస్టులు, వారిపై పైచేయి కోసం పోలీసులు ఏజెన్సీ గ్రామాల్లో వేడి పుట్టిస్తున్నారు. మావోయిస్టులు కార్యాచరణలో భాగంగా ఫ్రంట్ ఆర్గనైజేషన్ (ఉద్యమంలో ప్రాథమిక వ్యవస్థ)ను బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గిరిజన యువతను ఉద్యమం వైపు ఆకర్షించాలని చూస్తున్నారు. మిలీషియా సభ్యులను ఉపయోగించుకోవడం ద్వారా గ్రామాల్లో పట్టు సాధించే పనిలో నిమగ్నమైనట్టు సమాచారం. సమాచార వ్యవస్థను పటిష్టపరచడం ద్వారా పోలీసుల దాడుల నుంచి తప్పించుకుని, తిరిగి దాడులకు తెగబడేందుకు మిలీషియా సభ్యులే కీలకమని మావోయిస్టుల భావన. అందుకే వారిని సమర్థంగా ఉపయోగించుకునే పనిలో పడ్డారు. ప్రస్తుతానికి షెల్టర్ జోన్‌గా ఉన్నందున ఎలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడకుండా చాపకింద నీరులా పని చేసుకుపోతున్నారు. పోలీసు అధికారులు సైతం మావోయిస్టుల ఉద్యమంలోకి యువకుల రిక్రూట్మెంట్ పెరిగిందని ధ్రువీకరిస్తున్నారు. దండకారణ్యంలో పనిచేసిన మావోయిస్టు నేత కుడుముల రవి అలియాస్ బాలకృష్ణ ప్రస్తుతం ఏఓబీ ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతానికి చెందిన రవికి తూర్పు, విశాఖ ఏజెన్సీ అటవీ ప్రాంతం కొట్టిన పిండి కావడంతో పక్కా వ్యుహరచనతో ఉద్యమాన్ని నడిపించే పనిలో పడ్డారు. గతంలో లోకల్ గెరిల్లా స్క్వాడ్ (ఎల్జీఎస్), ఏరియా కమిటీలతో విస్తృతస్థాయిలో పని చేసిన మావోయిస్టు పార్టీ వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో పట్టుకోల్పోయింది. దీంతో ఉన్న కొద్ది మంది ప్లాటూన్లుగా సంచరిస్తూ ఆత్మరక్షణలో పడ్డారు. ప్రస్తుతం గాలికొండ ఏరియా కమిటీ, కోరుకొండ ఏరియా కమిటీలు మాత్రమే ఇక్కడ సంచరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యమానికి తిరిగి పూర్వవైభవం తెచ్చి గెరిల్లా దాడులకు సైతం తెగబడేలా వ్యూహ రచన చేస్తున్నట్టు తెలుస్తోంది. యువకులతో ఉద్యమాన్ని పటిష్టం చేయడం ద్వారానే పోలీసులను ఎదుర్కోగలమని వారు భావిస్తున్నారు.ఈ క్రమంలోనే ఉద్యమంలోకి వారిని చేర్చడంపై సర్వశక్తులూ కేంద్రీకరిస్తున్నారు. సహకరిస్తే సహించం.. కాగా పోలీసులు మన్యంలో పరిణామాలను కంట కనిపెడుతూనే ఉన్నారు. మావోయిస్టుల కదలికలను పసిగట్టేందుకు నిఘా పెంచారు. ఇటీవల 40 మంది మావోయిస్టు సానుభూతిపరులను రంపచోడవరం రప్పించి కౌన్సెలింగ్ ఇచ్చారు. మావోయిస్టులకు సహకరిస్తే కఠినచర్యలు తప్పవని ఉద్యమ సానుభూతిపరులకు హెచ్చరికలు జారీ చేశారు. మావోయిస్టులు తాజాగా నిధుల సమీకరణపై దృష్టి సారించినట్టు తెలుసుకున్న పోలీసులు ఆ దిశగానూ వారికి అడ్డుకట్ట వేసేందుకు సిద్ధమయ్యారు. మావోయిస్టులకు ఎలాంటి సహకారం అందించినా సహించబోమని కొందరు కాంట్రాక్టర్లను హెచ్చరించారు. కాగా ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు ఉద్యమం తీవ్రస్థాయిలో ఉండడం, అక్కడి సరిహద్దు గ్రామాలు విభజన అనంతరం తూర్పు ఏజెన్సీలో విలీనం కావడంతో ఆ ప్రభావం ఇక్కడ తప్పక ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఆరునూరైనా ఇక్కడ ఉద్యమాన్ని బలపడనివ్వరాదని పట్టుదలతో ఉన్నా రు. ఈ క్రమంలోనే బుధవారం 13 మం ది మిలీషియా సభ్యులను అరెస్టు చేశా రు. గురువారం కాకినాడలో ఈ విషయా న్ని తెలిపిన ఎస్పీ రవిప్రకాష్.. మావో యిస్టులకు ఎవరు సహకరించినా కఠినం గా వ్యవహరిస్తామని హెచ్చరించారు.