ఏజెన్సీ గ్రామాల్లో వి-శాట్ వ్యవస్థ
సీతంపేట : సీతంపేట ఏజెన్సీలోని షెడ్యూల్డ్ గ్రామాల్లో వి-శాట్ వ్యవస్థ పెట్టడానికి ఏర్పా ట్లు చేయాలని ఐటీడీఏ ప్రాజెక్టుఅధికారి ఎన్.సత్యనారాయణ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం ఐటీడీఏ కార్యాలయంలో ఐసీడీఎస్, జీసీసీ, విద్య తదితర శాఖల సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ 16 పంచాయతీల్లో వందకు పైగా జనాభా ఉన్న గ్రామాలను వి-శాట్ వ్యవస్థ కోసం ఎంపిక చేసినట్టు పేర్కొన్నారు. గ్రామాల్లో ఉన్న మౌలిక వసతులు, వివిధ పథకాల అమలు తీరును ఎప్పటికపుడు ప్రభుత్వం తెలుసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. సోలార్ పద్ధతిలో ఈ వ్యవస్థ పనిచేస్తోందన్నారు. పాఠశాల, డీఆర్ డిపో, పీహెచ్‌సీల్లో వి-శాట్ ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో డిప్యూటీ ఈవో మల్లయ్య, సీఎంవో తిరుపతిరావు, టెలికాం సిబ్బంది పాల్గొన్నారు.