కాంగ్రెస్‌ నేత హత్య | Congress leader murder in Malkangiri | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ నేత హత్య

Published Wed, Jun 21 2017 10:11 PM | Last Updated on Tue, Oct 9 2018 2:53 PM

కాంగ్రెస్‌ నేత హత్య - Sakshi

కాంగ్రెస్‌ నేత హత్య

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా సరిహద్దు రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లా కుహకుడ గ్రామంలో కాంగ్రెస్‌ నేత చెనురామ్‌ మాడివిని మావోయిస్టులు మంగ ళవారం హత్య చేశారు. చెనురామ్‌ మాడివిని గతంలో మావోయిస్టులు రాజకీయాల నుంచి వైదొలగాలని హెచ్చరించారు. అయినా ఆయన కాంగ్రెస్‌లోనే పనిచేస్తున్నారు. దీంతో ఆయన కుహకుడ గ్రామంలో ఇంటి లో భోజనం చేస్తున్న సమయంలో కొంతమంది మావోయిస్టులు వచ్చి అతికిరాతకంగా కాల్చి చంపారు.

అనంతరం మృతదేహాన్ని ఓ పోలీస్‌గొడౌన్‌ వెనుక భాగంలో వదిలి వెళ్లారు. చెనురామ్‌మాడివి∙20 ఏళ్లుగా కాంగ్రెస్‌లో ఉంటూ ఆ 20 ఏళ్లు సర్పంచ్‌గా పనిచేశారు.  నాలుగుసార్లు జాన్‌పత్‌గా పనిచేశారు. 2013లో నక్సల్స్‌ చేతిలో హత్యకు గురైన మహేంద్రకర్మ, చెనురామ్‌   ప్రాణస్నేహితులు. ఇద్దరూ మావోయిస్టుల చేతిలోనే హత్యకు గురయ్యారని కాంగ్రెస్‌ నేతలు ఆవేదన చెందారు. బీజేపీ ప్రభుత్వమే కాంగ్రెస్‌ వారిని మావోయిస్టుల ద్వారా ఇలా హత్య చేయిస్తోందని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement