
ప్రతీకాత్మక చిత్రం
మల్కాన్‌గిరి: ఒడిశాలో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. మల్కాన్‌గిరి జిల్లా బెజ్జింగివాడ అటవీ ప్రాంతంలో సోమవారం పోలీసులతో జరిగిన ఎదురు కాల్పులతో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. అళ్లూరుకోట, సన్యాసిగూడ గ్రామాల మధ్య ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్టు పోలీసులు తెలిపారు. మృతులు కలిమెల ఏరియా కమిటీ సభ్యులుగా గుర్తించారు. కీలక నేత రణ్ దేవ్ తప్పించుకున్నట్టు తెలుస్తోంది. మృతుల్లో మహిళా మావోయిస్టు కూడా ఉన్నారు.
సంఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను గుర్తించినట్టు సమాచారం. గాయపడిన మావోయిస్టులు ఎవరైనా ఉన్నారేమోనన్న ఉద్దేశంతో చుట్టపక్కల ప్రాంతాల్లో రక్షణ బలగాలు గాలింపు ముమ్మరం చేశాయి. ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment