భువనేశ్వర్: ఆంద్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులకు, పోలీసులకు మద్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో గుర్తు తెలియని మావోయిస్టు మృతి చెందగా, మావోయిస్టులకు చెందిన 15 కిట్ బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు.దీనిపై ఒడిశా డీఐజీ రాజేష్ పండిట్ స్పందించారు.
'ఏవోబీలో మల్కన్‌గిరి జిల్లా ఖైర్‌పుట్ బ్లాక్ మత్లీ పోలీసుస్టేషన్ పరిధిలోని మడక్‌పొదర్ సమీప నున్‌ఖారీ అటవీప్రాంతంలో మావోయిస్టులు సంచారంపై పోలీసులకు ఖచ్చితమైన సమాచారం అందింది. ఈ ఆధారంతో ఒడిశాకు చెందిన డీవీఎఫ్, ఎస్‌వోజీ బలగాలు గాలింపు చర్యలు చేపట్టారు.ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున పోలీసుల కదలికలు గమనించిన మావోయిస్టులు కాల్పులు ప్రారంబించారు.
ఇరువర్గాలు మధ్య సుమారు 45 నిముషాలు పాటు కాల్పులు జరిగాయి. కొద్దిసేపటి తర్వాత మావోయిస్టులు వైపు నుంచి కాల్పులు నిలిచిపోవడంతో పోలీసులు ఆ ప్రాంతాన్ని గాలించగా ఒక గుర్తుతెలియని మావోయిస్టు మృతదేహం లభించింది. దీంతోపాటు ఒక పిస్టల్, దేశీయ తుపాకీ, 15 కిట్ బ్యాగులు, వాకీటాకీ, వంటపాత్రలను స్వాధీనం చేసుకున్నారని' తెలిపారు.ఈ సందర్బంగా ఒడిశా డీఐజీ రాజేష్ పండిట్ మాట్లాడుతూ మావోయిస్టులు హింసను వీడనాడి జనజీవన స్రవంతిలో కలవాలని, వారిని ఆదుకోవడానికి సిధ్దంగా ఉన్నామని, తప్పించుకున్న మావోయిస్టులు కోసం గాలింపు చర్యలు నిర్వహిస్తున్నామని డీఐజీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment