
భువనేశ్వర్ : ఓ ఇంటికి అనుకోని అతిథి రావడంతో కుటుంబసభ్యులు షాకయ్యారు. అతిథి వస్తే షాకవడం ఏంటనుకుంటున్నారా.. ఇంట్లోకి చొరబడింది మనిషి కాదు.. పెద్ద మొసలి. ఒడిశాలోని మల్కాన్ గిరి జిల్లాలో గురువారం ఈ విచిత్రం చోటుచేసుకుంది. తొలుత ఏదో అలికిడి వినిపించడంతో ఇంట్లోకి ఎవరో వచ్చారని కుటుంబం భావించింది. కానీ ఎవరొచ్చాని అని చూడగా భారీ అకారంలో ఉన్న మొసలిని చూసిన వ్యక్తి ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇంట్లో వాళ్లను అప్రమత్తం చేయగా, ఒకరు అటవీశాఖ అధికారులకు ఫోన్ చేసి సమాచారం అందించారు.
విషయం ఆ నోటా ఈనోటా పాకడంతో మనాటా గ్రామస్తులు ఆ ఇంటి వద్ద గుమిగూడారు. అటవీశాఖ అధికారులు మొసలి ప్రవేశించిన ఇంట్లోకి వెళ్లి.. కొద్దిసేపు తీవ్రంగా శ్రమించి పట్టుకున్నారు. ఓ బోనులోకి మొసలి వెళ్లేలా చేసిన సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారు. మొసలిని చూసేందుకు చిన్నాపెద్దా తేడా లేకుండా గ్రామస్తులు చాలామంది వచ్చారని, ఇలాంటివి జరిగినప్పుడు భయపడకుండా తమకు సమాచారం అందించాలని అటవీశాఖ ఉద్యోగి ఒకరు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment