వీపులు పగులుతయ్‌! పాపాలు నశిస్తయ్‌! ఈ పండుగ గురించి తెలుసా? | Odisha Tribal Festival Pushya Parab People Dance And Beat With Sticks | Sakshi
Sakshi News home page

వీపులు పగులుతయ్‌! పాపాలు నశిస్తయ్‌! ఈ పండుగ గురించి తెలుసా?

Published Sun, Jan 30 2022 11:03 AM | Last Updated on Sun, Jan 30 2022 11:24 AM

Odisha Tribal Festival Pushya Parab People Dance And Beat With Sticks - Sakshi

యువకులను కొట్టేందుకు కర్రతో వస్తున్న వృద్ధురాలు.. ఇన్‌సెట్లో గిరిజనుడి వీపుపై గాయాలు

మల్కన్‌గిరి (ఒడిశా): జిల్లాలోని ఖొయిరాపుట్‌ సమితి, బోండా ఘాటీ ప్రాంతంలో పుష్య పొరబ్‌ (పండగ) శనివారం సంప్రదాయంగా నిర్వహించారు. తరతరాలుగా ఏటా పుష్య మాసంలో చేసుకునే ఈ పండగలో బోండా జాతి గిరిజనులు నెలంతా అడవి తల్లికి పూజలు చేస్తారు. చివరి 3 రోజులను జాండీ ఉత్సవంగా భావించి, అడవిలో పుట్టి పెరిగిన కర్రలతో ఒకరినొకరు కొట్టుకుంటారు.

సంప్రదాయ నృత్య ప్రదర్శనలో బోండా జాతి గిరిజనులు

ఇలా దెబ్బలు తినడం ద్వారా ఏడాది అంతా చేసిన పాపాలు నశిస్తాయని వీరి నమ్మకం.  శనివారం ఉదయం జరిగిన ఈ వేడుకలో ముదిలిపొడ, దుమురుపొడ, తులగురం, బైగూడ, హంద్రహల్, బద్‌బేల్‌ గ్రామస్తులు సంప్రదాయ నృత్యాలు చేస్తూ ఆనందోత్సాహాలతో గడిపారు. 

(చదవండి: హిమాచల్‌ తొలి మహిళా అంబులెన్స్‌ డ్రైవర్‌)

గిరిజనుడి వీపుపై గాయాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement