మల్కాన్ గిరి: ఒడిశాలో మావోయిస్టులు కిడ్నాప్ కు పాల్పడ్డారు. ఛత్తీస్ గఢ్-ఒడిశా సరిహద్దులోని మల్కాన్ గిరి జిల్లాలో కర్తాన్ పల్లి, బారా గ్రామాల నుంచి ఏడుగురిని అపహరించుకుపోయారు. కర్తాన్ పల్లి పంచాయతీ సమితి మాజీ చైర్మన్ సహా ఆరుగురిని కిడ్నాప్ చేశారు. బారా గ్రామం నుంచి ఒకరిని ఎత్తుకెళ్లారు. ఈ రెండు గ్రామాలు సుక్మా జిల్లాలోని దర్బా ఘాటికి సమీపంలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
మల్కాన్ గిరి జిల్లాలో చివరిసారిగా 2013లో మావోయిస్టులు కిడ్నాప్ కు పాల్పడ్డారు. 9 మందిని ఎత్తుకెళ్లి ఇద్దరిని హత్య చేశారు. మిగతా వారిని విడిచిపెట్టారు.
ఏడుగురిని ఎత్తుకెళ్లారు
Published Tue, Apr 14 2015 4:26 PM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM
Advertisement
Advertisement