లాస్ ఏంజెల్స్లో రవీనాకు చేదుఅనుభవం | Raveena alleges misbehaviour during I-Day celebrations | Sakshi
Sakshi News home page

లాస్ ఏంజెల్స్లో రవీనాకు చేదుఅనుభవం

Published Sun, Aug 16 2015 7:12 PM | Last Updated on Sun, Sep 3 2017 7:33 AM

లాస్ ఏంజెల్స్లో రవీనాకు చేదుఅనుభవం

లాస్ ఏంజెల్స్లో రవీనాకు చేదుఅనుభవం

లాస్ ఏంజెల్స్: భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బాలీవుడ్ నటి రవీనా టాండన్కు చేదు అనుభవం ఎదురైంది. శనివారం లాస్ఏంజెల్స్లో జరిగిన ఈ కార్యక్రమంలో రవీనా పాల్గొన్నారు. వేదికపై నిర్వాహకుల్లో ఒకరు రవీనా పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ సమయంలో ఆయన మద్యం మత్తులో ఉన్నట్టు రవీన్ ట్వీట్టర్లో తెలిపారు.  

'లాస్ ఏంజెల్స్లో స్వాతంత్ర్య వేడుకలు వైభవంగా జరిగాయి. అయితే మద్యంతాగి ఉన్న ఓ వ్యక్తి స్టేజిపైకి వచ్చి నాపై కామెంట్లూ చేస్తూ అనుచితంగా ప్రవర్తించాడు. ఆయన పిల్లలు నా కారులో తీసుకురాలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. నేను సహనంతో మాట్లాడినా ఆయన అసభ్యకరంగా మాట్లాడాడు.  ఆయన పిల్లలు నా కారులో వచ్చేందుకు సెక్యురిటీ, ప్రొటోకాల్ అనుమతించలేదు.  ఆయన దురుసుగా ప్రవర్తిస్తున్న సమయంలో సెక్యూరిటీ సిబ్బంది స్టేజి కింద ఉన్నారు. ఈ విషయం గురించి ఇతర నిర్వాహకులకు చెబితే వారు ఆయన్ను స్టేజి నుంచి దూరంగా తీసుకెళ్లారు. స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగినా అతని వల్ల మూడాఫ్ అయింది' అని రవీనా ట్వీట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement