
కుటుంబ సభ్యులతో కలిసి అరటి పళ్లు అమ్ముకుంటున్న ఉపాధ్యాయుడు వెంకటసుబ్బయ్య
నెల్లూరు (టౌన్): అడ్మిషన్లు చేయనిదే జీతాలు ఇవ్వలేమని చెప్పిన నారాయణ స్కూల్ యాజమాన్యానికి ఆదివారం డీఈ ఓ జనార్దనాచార్యులు నోటీసులు జారీ చేశారు. ఆదివారం ‘సాక్షి’ ప్రధాన సంచికలో ప్రచురితమైన ‘అడ్మిషన్లు చేయలేదా.. మీ సేవలు అక్కర్లేదు’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. నగరంలోని స్టోన్‌హౌస్‌పేట నారాయణ స్కూల్‌లో ఉపాధ్యాయులకు అడ్మిషన్లు అప్పజెప్పడం, జీతాలు ఎందుకు ఇవ్వలేదో రెండు రోజుల్లో సమాధానం చెప్పాలని నోటీసులో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment