
ఉపాధ్యాయుడికి ఆర్థిక సహాయం అందజేస్తున్న పూర్వ విద్యార్థులు
నెల్లూరు (టౌన్): అడ్మిషన్లు చేయలేదన్న కారణంగా ఓ ఉపాధ్యాయుడిని నారాయణ విద్యాసంస్థలు ఉద్యోగం నుంచి తొలగిస్తే.. ఆయన శిష్యులు ఆదుకునేందుకు ముందుకువచ్చారు. ఉద్యోగం పోయిన సదరు ఉపాధ్యాయుడు అరటి పండ్లు అమ్ముకుంటున్న వైనాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకువచ్చింది. నెల్లూరు వేదాయపాళెంలోని నారాయణ స్కూల్‌లో వెంకటసుబ్బయ్య ఉపాధ్యాయునిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి తెలుసుకుని పూర్వ విద్యార్థులు తమ గురువుకి రూ. 86,300 ఆర్థిక సాయం అందజేశారు. అదేవిధంగా వైఎస్సార్ సీపీ యువజన సోషల్ మీడియా ఆధ్వర్యంలో రూ. 20 వేలు అందజేశారు. అమెరికా నుంచి శ్యామ్ అనే వ్యక్తి రూ. 50 వేలు వెంకటసుబ్బయ్య ఖాతాలో జమ చేశారు. (‘నారాయణ’ టీచర్.. అరటి పండ్లు అమ్ముకుంటూ)
Comments
Please login to add a commentAdd a comment