జిల్లాలో సంచలనం రేపిన సాయిచరణ్ నాయక్ (16) అనుమానాస్పద మృతి కేసులో బుధవారం కూడా దర్యాప్తు కొనసాగింది.
ఆ కేసులో పోలీసులు బుధవారం సాయిచరణ్ మృతిచెందిన నారాయణ స్కూల్‌లో విచారణ చేపట్టారు. విద్యార్థులను, టీచర్లను విచారించారు.వెస్ట్ సబ్ డివిజనల్ డీఎస్పీ కనకరాజు, ఎమ్మార్‌పల్లి సీఐ మధు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే సాయిచరణ్‌ను తీవ్రంగా గాయపరిచి అతడి మృతికి కారణమైన అంజిరెడ్డి కూడా పోలీసులకు లొంగిపోయినట్లు తెలిసింది. అయితే అతడిని రహస్యంగా విచారిస్తున్నట్లు సమాచారం.