ప్రతీకాత్మక చిత్రం
అయినవిల్లి(కోనసీమ జిల్లా): ఓ యువతి ఆత్మహత్యకు కారణమైన యువకుడిని అరెస్టు చేసి బుధవారం కోర్టుకు తరలించినట్లు స్థానిక ఎస్సై ఎస్.నాగేశ్వరరావు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి... అయినవిల్లి మండలం కె.జగన్నాథపురానికి చెందిన పాటి మాధవి (26) అదే గ్రామానికి చెందిన వల్లపురెడ్డి ఫణిబాబు 12 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరు అమలాపురం సాయిబాబా ఆలయంలో ఉంగరాలు మార్చుకున్నారు. కొన్ని రోజులుగా మాధవి ఫోన్ నంబర్‌ను ఫణిబాబు బ్లాక్ లిస్టులో పెట్టాడు. ఫణిబాబు అతని తల్లిదండ్రులు మరో యువతితో పెళ్లి నిశ్చయించారు.
చదవండి: గండి బాబ్జీ ఇదేం పని.. ఇలా చేశావేంటీ?
విషయం తెలుసుకున్న మాధవి తనను పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఫణిబాబును హెచ్చరించింది. మాధవి మే 18 తేదీన కె.జగన్నాథఫురంలోని చెరువులోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికులు ఆమెను రక్షించారు. అప్పట్లో ఫణిబాబుపై అయినవిల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నెల 6న ఫణిబాబుకు అన్నవరంలో వేరే అమ్మాయితో పెండ్లి జరుగుతుందని తెలిసి మనస్థాపానికి గురైన మాధవి 5వ తేదీ రాత్రి ఇంట్లో చున్నితో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
నా చావుకు కారణం ఫణిబాబు, అతని కుటుంబ సభ్యులు కారణమని సూసైడ్ నోట్‌లో పేర్కొంది. దీనిపై మృతురాలి తల్లి పార్వతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం నిందితుడు ఫణిబాబును అరెస్టు చేసి అమలాపురం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టుకు తరలించగా జడ్జి వై.శ్రీలక్ష్మి 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment