
కర్నూలు: మండలంలోని బొమ్మనపల్లి గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పురిమెట్ల సాయిప్రసాద్ (25) ఆదివారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. వెంకటేశులు, సీతమ్మ కుమారుడైన సాయిప్రసాద్ బెంగళూరులోని సాఫ్ట్‌వేర్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నాడు.
కొంతకాలంగా పనిఒత్తిడి భరించలేకపోతున్నానని, కంపెనీ మారాలనుకుంటున్నానని తల్లిదండ్రులకు చెప్పేవాడు. రెండు రోజుల క్రితం బెంగళూరుకు వెళ్లి.. తిరిగి వెంటనే స్వగ్రామానికి వచ్చాడు. ఆదివారం తెల్లవారుజామున అందరూ నిద్రిస్తున్న సమయంలో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment