
శశికళ (ఫైల్)
విడపనకల్లు(అనంతపురం జిల్లా): ఇష్టం లేని పెళ్లి చేస్తుండడంతో మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... విడపనకల్లు మండలం పాల్తూరుకు చెందిన గాలెప్ప కుమార్తె శశికళ (21)కు 15 రోజుల క్రితం ఉరవకొండ మండలం రేణుమాకులపల్లికి చెందిన యువకుడితో వివాహాన్ని పెద్దలు నిశ్చయించారు.
చదవండి: ఊర్లో ఆడవాళ్లు, మగవాళ్లు నామీద ఇంత పగతో ఉన్నారా?
అయితే ఈ పెళ్లి ఇష్టం లేని శశికళ ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాసేపటికి ఇంటికి చేరుకున్న కుటుంబసభ్యులు విషయాన్ని గమనించి సమాచారం అందించడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment