
ప్రతీకాత్మక చిత్రం
చిట్టినగర్ (విజయవాడ పశ్చిమ): ఫైనాన్స్‌లో తీసుకున్న బుల్లెట్ బండికి కిస్తీలు కట్టకపోవడంతో కంపెనీ వాళ్లు స్వాధీనం చేసుకోగా.. మనస్తాపానికి గురైన యువకుడు శనివారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విజయవాడ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. యువకుడి తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కొత్తపేట కోమల విలాస్ ప్రాంతానికి చెందిన బెహర లక్ష్మీ, సోమేష్ దంపతులకు ఇద్దరు సంతానం. కొంత కాలంగా దంపతులు విడివిడిగా ఉంటు న్నారు.
చదవండి👉: సాఫ్ట్‌వేర్ యువతితో ప్రేమ, పెళ్లి.. మరో మహిళ పరిచయం కావడంతో..
లక్ష్మి కూలి పనులు, తల్లి వద్ద ఉంటున్న కుమారుడు కార్తీక్ డేకరేషన్ పనులు చేస్తుంటాడు. కొన్ని నెలల క్రితం కార్తీక్ బుల్లెట్ కావాలని తల్లిని కోరగా.. బంగారు నాన్‌తాడు అమ్మి రూ.50 వేలు డౌన్ పేమెంట్‌గా కట్టి బుల్లెట్ కొనిచ్చింది. ఈఎంఐలు కట్టకపోవడంతో శుక్రవారం కంపెనీ సిబ్బంది వచ్చి బుల్లెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో రాత్రి అంతా ఇదే విషయాన్ని తల్లికి, స్నేహితులకు చెప్పుకొంటూ మానసిక క్షోభ అనుభవించాడు. మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
చదవండి👉: మనసు ‘దోశ’కున్న మంత్రి వేణు
Comments
Please login to add a commentAdd a comment