షాకింగ్‌ ఘటన.. కాన్పుకు పుట్టింటికి వెళ్దాం పదమ్మా.. రానంటూ పరిగెత్తుకుంటూ వెళ్లి.. | Pregnant Woman Commits Suicide In Kurnool District | Sakshi
Sakshi News home page

షాకింగ్‌ ఘటన.. కాన్పుకు పుట్టింటికి వెళ్దాం పదమ్మా.. రానంటూ పరిగెత్తుకుంటూ వెళ్లి..

Published Tue, Nov 8 2022 8:21 PM | Last Updated on Tue, Nov 8 2022 8:34 PM

Pregnant Woman Commits Suicide In Kurnool District - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

కుమారి ప్రస్తుతం 5నెలల గర్భిణి. ఈనెల 2న కుమారి తల్లి లక్ష్మీదేవి తన కుమార్తెను పుట్టింటికి పిలుచుకు వెళ్లేందుకు గువ్వలకుంట్లకు చేరుకుంది. కాన్పుకు తీసుకెళ్తానని తెలిపింది.

వెల్దుర్తి(కర్నూలు జిల్లా): ఐదు నెలల గర్భంతో ఉన్నావు, మొదటి కాన్పుకు ఇంటికి వెళ్దాం పదమ్మా అని కూతురును ఓ తల్లి కోరితే, పుట్టింటికి వెళ్లడం ఇష్టం లేక పురుగు మందు తాగి తనువు చాలించిందా కూతురు. వెల్దుర్తి మండలం గువ్వలకుంట్లలో జరిగిన సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం జలదుర్గంకు చెందిన కురువ దేవరింటి కుమారికి, కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం గువ్వలకుంట్లకు చెందిన ఆనంద్‌కు 8 నెలల క్రితం వివాహమైంది.
చదవండి: భార్యకు ఎంత నచ్చచెప్పినా వినకపోవడంతో.. భర్త షాకింగ్‌ నిర్ణయం

కుమారి ప్రస్తుతం 5నెలల గర్భిణి. ఈనెల 2న కుమారి తల్లి లక్ష్మీదేవి తన కుమార్తెను పుట్టింటికి పిలుచుకు వెళ్లేందుకు గువ్వలకుంట్లకు చేరుకుంది. కాన్పుకు తీసుకెళ్తానని తెలిపింది. పుట్టింటికి తాను రానంటూ పరిగెత్తుకు వెళ్లిన కుమారి బాత్‌రూమ్‌ తలుపేసుకుని గడ్డి మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన కుమారిని కర్నూ లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.తదుపరి మెరుగైన వైద్యానికి ప్రైవేట్‌ ఆసుపత్రికి, తిరిగి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేయించారు. చివరకు ప్రభుత్వాసుపత్రిలో కోలుకోలేక సోమవారం మృతిచెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement