అలిగి పుట్టింటికి వెళ్లిపోయిన భార్య.. భర్త షాకింగ్‌ నిర్ణయం.. | Auto Driver Commits Suicide In Nellore | Sakshi
Sakshi News home page

అలిగి పుట్టింటికి వెళ్లిపోయిన భార్య.. భర్త షాకింగ్‌ నిర్ణయం..

Published Wed, Aug 31 2022 11:52 AM | Last Updated on Wed, Aug 31 2022 12:03 PM

Auto Driver Commits Suicide In Nellore - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

పనిమనిషి, పక్కింటివారు ఆయన్ని కిందకు దించి చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు.

నెల్లూరు(క్రైమ్‌): ఆటోడ్రైవర్‌ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బీవీనగర్‌లో చోటుచేసుకుంది. వివరాలు..బీవీనగర్‌లో కృష్ణమందిరం వెనుక కే మల్లికార్జునరెడ్డి(35) నివాసం ఉంటున్నారు. ఆయన ఆటో నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నక్కలగుంటకు చెందిన ఓ మహిళతో వివాహమైంది. కొద్దిరోజులకే దంపతుల నడుమ విబేధాలు పొడచూపాయి. మద్యం మత్తులో భార్యను తీవ్రంగా వేధించడంతో ఆమె అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది.
చదవండి: ఎస్‌ఐ పాడుబుద్ధి.. మహిళా హోంగార్డుతో పరిచయం పెంచుకుని..

దీంతో నిత్యం మద్యంమత్తులో ఉండేవాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 29న రాత్రి తన ఇంట్లోని రేకులకున్న ఇనుపరాడ్డుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన పనిమనిషి, పక్కింటివారు ఆయన్ని కిందకు దించి చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. మృతుడి తల్లి విశాలాక్షి ఫిర్యాదు మేరకు వేదాయపాళెం ఎస్సై శ్రీనివాసరావు కేసు నమోదు చేసి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతదేహానికి ప్రభుత్వ వైద్యులు మంగళవారం శవపరీక్ష నిర్వహించి బాధిత కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement