హైదరాబాద్: చదువులో తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నానంటూ 35వ అంతస్తు పై నుంచి దూకి 10వ తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మాదాపూర్ ఏసీపీ శ్రీనివాస్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీలోని మై హోం భూజలో హెచ్ టవర్ 6వ అంతస్తులోని ఫ్లాట్‌నంబర్ 604లో ఎం.సురేష్ కుమార్ రెడ్డి నివాసం ఉంటున్నారు. ఆయన ముంబైలో ఓ కంపెనీలో ఫైనాన్షియల్ ఎనలిస్ట్‌గా పని చేస్తున్నారు. ఏడాది క్రితం మై హోం భూజకు మకాం మార్చారు.
ఆయన భార్య స్వరూప ఇద్దరు కొడుకులతో కలిసి ఉంటుండగా సురేష్ కుమార్ ముంబైలో ఉంటున్నారు. వారాంతాల్లో ఆయన నగరానికి వచి్చపోతుంటారు. ఓక్రిడ్జి ఇంటర్నేషనల్ స్కూల్‌లో 10వ తర గతి చదివే పెద్ద కొడుకు ఎం.రియాన్‡్ష రెడ్డి(14) సోమవారం సాయంత్రం 7.45 గంటలకు వ్యక్తి గత కారణాలతో చనిపోతున్నానంటూ తల్లి స్వరూప ఫోన్‌కు మెసేజ్ చేసి ఫ్లాట్ నుంచి బయటకు వెళ్లాడు. మెసేజ్ చూసుకున్న ఆమె అపార్ట్‌మెంట్‌లో గాలించినా, స్నేహితులను ఆరా తీసినా రియాన్‡్ష ఆచూకీ లభ్యం కాలేదు.
కుమారుడు కనిపించడంలేదంటూ ఫిర్యాదు
అర్ధరాత్రి దాటిన తర్వాత 2.30 గంటలకు రియాన్‡్ష కనిపించడం లేదని రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో స్వరూప ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే అపార్ట్‌మెంట్‌లోని అన్ని ఎంట్రీ, ఎగ్జిట్‌ల సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించినా రియాన్‡్ష ఆచూకీ తెలియరాలేదు. దీంతో అపార్ట్‌లోని అన్నిచోట్లా గాలించారు. మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో జె బ్లాక్‌లోని గేట్ వద్ద మెట్ల మధ్యలో ఉన్న డక్‌లో రియాన్‡్ష మృతదేహం పడి ఉండటాన్ని గమనించారు. తల ఛిద్రమై రక్తపు మడుగులో రియాన్‡్ష మృతదేహం కనిపించింది.
హెచ్ బ్లాక్ నుంచి జే బ్లాక్ వెళ్లిన రియాన్‡్ష 35వ అంతస్తు నుంచి డెక్‌లోకి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. రియాన్‡్ష కనిపించడం లేదని భార్య సమాచారం ఇవ్వడంతో సురేష్ కుమార్ రెడ్డి హుటాహుటిన నగరానికి వచ్చారు. ప్రాథమిక విచారణలో వ్యక్తిగత (చదువుల్లో) ఒత్తిడితోనే రియాన్‡్ష ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు, టీచర్లను విచారించిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని ఏసీపీ పేర్కొన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment