
మృతి చెందిన అశోక్ (ఫైల్)
బొమ్మనహాళ్(అనంతపురం జిల్లా): పని ఒత్తిడి భరించలేక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏఎస్‌ఐ రమణ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రమైన బొమ్మనహాళ్‌కు చెందిన కాడ్రా కృష్ణమూర్తికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు కాడ్రా అశోక్ (26) బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల స్వగ్రామానికి చేరుకుని వర్క్ ఫ్రం హోమ్ ద్వారా పనిచేస్తున్నాడు.
అయితే పని ఒత్తిడి పెరగడంతో జీవితంపై విరక్తి చెంది మంగళవారం సాయంత్రం గ్రామ సమీపంలోని హెచ్చెల్సీ వద్ద పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు గమనించి బళ్లారి విమ్స్‌కు తీసుకెళ్లారు. అయినా ఫలితం లేకపోవడంతో బుధవారం మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ తెలిపారు.
చదవండి: నర్సుతో డాక్టర్ ప్రేమాయణం.. పెళ్లి.. బిడ్డ పుట్టిన తర్వాత!
Comments
Please login to add a commentAdd a comment