
ప్రతీకాత్మక చిత్రం
తిరువొత్తియూరు(తమిళనాడు): భర్త వేరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని మనస్తాపంతో భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన చెన్నైలో జరిగింది. మధురవాయల్ గంగై అమ్మన్ ఆలయ వీధికి చెందిన రాజా (33) ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. భార్య కళై సెల్వి (28). వీరికి నాలుగేళ్ల క్రితం వివాహమైంది. కుమారుడు ధరనీశ్వరన్ (1) ఉన్నాడు. ఆదివారం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది.
అనంతరం రాజా ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అనంతరం ఇంటికి తిరిగి వచ్చి చూడగా వంట గదిలో కళై సెల్వి ఉరి వేసుకుని మృతిచెంది కనిపించింది. మధురవాయల్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు. ప్రాథమిక విచారణలో రాజా వేరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: భార్యతో గొడవలు.. మరో మహిళతో వివాహేతర సంబంధం.. చివరికి..
Comments
Please login to add a commentAdd a comment