
చిక్కడపల్లి: అనారోగ్య కారణాలతో ఎలుకల మందు తాగి ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన దోమలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. దోమలగూడ ఇన్‌స్పెక్టర్ డి.శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం రాత్రి తెల్పిన వివరాల మేరకు..హిమాయత్‌నగర్‌లోని వెలమ హాస్టల్‌లో ఉంటున్న జగిత్యాల జిల్లా మహాలక్ష్మినగర్‌కు చెందిన లింగారావు కుమారుడు దొనకంటి సాయిరాం (32) శనివారం రాత్రి 11 గంటలకు ఎలుకల మందు తాగి పడిపోయాడు.
హాస్టల్‌లో ఉంటున్న స్నేహితులు, సిబ్బంది వెంటనే హైదర్‌గూడలోని ఆపోలో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో సాయిరాం చికిత్స పొందుతూ సాయంత్రం 5 గంటలకు చనిపోయాడు. ఆయన శవాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుప్రతికి పోలీసులు తరలించారు. పోస్టుమార్టం అనంతరం సాయిరాం శవాన్ని కుటుంబ సభ్యులకు అందజేస్తామని సీఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సాయిరాం అనారోగ్యం, ఇతర మానసిక సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోందని ఆయన వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment