తాడేపల్లిగూడెం : నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) తాత్కాలిక తరగతులు నిర్వహించేది ఏలూరులోనా.. తాడేపల్లిగూడెంలోనా అనే మీమాం సకు తెరపడింది. తాడేపల్లిగూడెంలోనే ఈ విద్యా సంవత్సరం నుంచే నిట్ తరగతులు నిర్వహించనున్నారు. కేంద్రం నుంచి వచ్చిన సాంకేతిక బృందం పెదతాడేపల్లిలోని వాసవీ ఇంజినీరింగ్ కళాశాల భవనాలను పరి శీలించింది. శాశ్వత భవనాలు నిర్మిం చేంత వరకూ వాసవీ ఇంజినీరింగ్ కళాశాలలోనే తాత్కాలికంగా తరగతులు నిర్వహించవచ్చని స్పష్టం చేయడంతో.. ఇక్కడే తరగతులు నిర్వహిం చేందుకు మంగళవారం నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. త్వరలోనే అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుందని సమాచారం.
అడ్మిషన్లు ఇలా..
జేఈఈ ఫలితాల ఆధారంగా నిట్‌లో సీట్లు ఇస్తారు. జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్ ఫలితాలలో విద్యార్థులు సాధించిన మార్కుల అధారంగా నిట్‌లో సీట్లు కేటాయిస్తారు. అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో కటాఫ్ మార్కుకు పైన ఉన్న విద్యార్థులు ఐఐటీలకు వెళతారు. మెయిన్ ఫలితాలలో ర్యాంకులు సాధిం చిన విద్యార్థులకు కటాఫ్ మార్కుల ఆధారంగా నిట్‌లో సీటు దొరుకుతుంది. గతంలో ఐఐటీకి వేరుగా, నిట్‌కు వేరుగా కౌన్సెలింగ్ జరగ్గా, ప్రస్తుతం రెండింటికీ ఒకేసారి కౌన్సెలింగ్ నిర్వహిస్తారని చెబుతున్నారు. నిట్‌లో ప్రవేశానికి ఈ నెల 18 తర్వాత నాలుగు దఫాలుగా కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. కౌన్సెలింగ్ పూర్తయ్యాక అడ్మిషన్లు ఇస్తారు. అనంతరం తరగతులు మొదలవుతాయి.
ఈ ప్రక్రియ మొత్తం జూలైలో పూర్తవుతుం దని, అదే నెల చివరి వారంలో తరగతులు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసే నిట్‌లో ఈ విద్యా సంవత్సరంలోనే 540 మంది విద్యార్థులు చేరతారు. రెండో ఏడాది మరో 540 మంది చేరతారు. వీరి కోసం వాసవీ ఇంజినీరింగ్ కళాశాలలో తాత్కాలిక నిర్మాణాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పనులకు గురువారం శంకుస్థాపన చేయనున్నట్టు సమాచారం. నిట్‌కు శాశ్వత భవనాలు నిర్మించడానికి కనీసం రెండేళ్లు పడుతుంది. అప్ప టివరకు వాసవిలోనే తాత్కాలికంగా తరగతులు నిర్వహిస్తారు.
నిట్.. గూడెంలో సెట్
Published Wed, Jun 10 2015 12:38 AM | Last Updated on Sun, Sep 3 2017 3:28 AM
Advertisement