అంధుల కోసం ‘ఈ స్టిక్’
హైదరాబాద్: విద్యార్థులు తయారు చేసిన ఈ స్టిక్ అంధులకు అనేక రకాలుగా ఉపయోగపడుతుందని బీవీఆర్‌ఐటీ మహిళ ఇంజనీరింగ్ కాలేజీ చైర్మన్ విష్ణు రాజు అన్నారు. నర్సాపూర్, భీమవరం, హైదరాబాద్ బీవీఆర్‌ఐటీ మహిళా ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులు ఫ్యాకల్టీ సహకారంతో తయారు చేసిన వికలాంగుల పరికరాలను, అవి పని చేసే విధానాన్ని ఆయన వివరించా రు. ప్రపంచ వికలాంగుల దినోత్స వం సందర్భంగా బాచుపల్లిలోని కాలేజీలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఈ స్టిక్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా విష్ణు రాజు మాట్లాడుతూ ప్రొ.అలెన్క్స్ ్రఈ అస్సెటీవ్ టెక్నాలజీ ల్యాబ్‌కు సంధాన కర్తగా వ్యవహరిస్తూ అనేక పరికరాలను తయారు చేయడానికి స్ఫూర్తినిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం తమ విద్యార్థులు రూపొందించిన ఈ స్టిక్ అంధులకు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు.
ఈ స్టిక్‌ను పట్టుకున్న వారి ముందు రెండు మీటర్ల దూరంలో ఎలాంటి వస్తువులు, వక్తులు, పరికరాలు ఉన్నా వెంటనే సౌండ్‌తో అలర్డ్ చేస్తుందని ప్రయోగాత్మకంగా చూపించారు. స్టిక్ చేసిన శబ్దంతో అప్రమత్తం కాకుండా దగ్గరకు అలాగే వెళ్తుంటే సౌండ్ పెరుగుతుంది. దీన్ని మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు.