పశ్చిమగోదావరి: రైతే రాజు అనే నిజాన్ని ప్రతి ఒక్కరూ ఒప్పుకుని తీరాలి. రైతు లేనిదే దేశం లేదు. దేశానికి ఆహార అవసరాలు తీర్చే రైతును విస్మరించకూడదు. చదువు ఏదైనా వ్యవసాయంపై మాత్రం ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలంటూ భీమవరం జీవీఐటీ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థినులు తుందుర్రు గ్రామం వద్ద పొలంలోకి దిగారు. వరినాట్లు వేస్తున్న కూలీలకు కొద్దిసేపు సహాయపడ్డారు. రిపబ్లిక్ డేకి ఇదే మా స్వాగతం అంటూ ఆహ్వానం పలికారు. వారంతా జాతీయతా భావం ఉట్టిపడేలా మువ్వన్నెల రంగు వస్త్రాలు ధరించడం విశేషం. – సాక్షి ఫొటోగ్రాఫర్ / ఏలూరు
Comments
Please login to add a commentAdd a comment