పటాన్‌చెరు: మెదక్ జిల్లాలో ఓ ఇంజనీరింగ్ కళాశాల మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనుమతి లేకున్నా అడ్మిషన్లు చేసుకుని, తీరా సెమిస్టర్ పరీక్షా సమయానికి అనుమతి లేదంటూ చేతులెత్తేసింది.
దీంతో బాధిత విద్యార్థులు మంగళవారం కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. పటాన్‌చెరులోని సెయింట్ మేరి ఇంజినీరింగ్ కళాశాల అనుమతి లేకున్నా విద్యార్థుల నుంచి ఎంబీఏ అడ్మిషన్లు తీసుకుంది. చివరకు పరీక్షల సమయానికి ఆ కళాశాలకు అనుమతి లేదని తెలిసింది. దీంతో అడ్మిషన్ తీసుకున్న మొత్తం 99 మంది విద్యార్థులు తమకు న్యాయం చేయాలంటూ కళాశాల ఎదుట ధర్నాకు దిగారు.