పూర్వ విద్యార్థినిపైలైంగిక దాడికి యత్నం | Attempt To Harrasing Assault Former Student In Visakhapatnam - Sakshi
Sakshi News home page

పూర్వ విద్యార్థినిపై లైంగిక దాడికి యత్నం

Published Wed, Dec 20 2023 11:37 AM | Last Updated on Wed, Dec 20 2023 12:42 PM

Attempt to harrasing assault former student - Sakshi

విశాఖపట్నం: భీమిలి మండలం దాకమర్రిలోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థినిపై అదే ప్రాంతంలోని ఫ్లైవుడ్‌ ఫ్యాక్టరీకి చెందిన ఉత్తరాది కార్మికుడు మంగళవారం లైంగిక దాడికి యతి్నంచాడు. పోలీసులు తెలిపిన వివరాలివీ.. పార్వతీపురానికి చెందిన ఆమె 2021లో ఇక్కడి కళాశాలలో సీఎస్‌సీ పూర్తి చేసింది. ప్రస్తుతం ఆ కళాశాలను మరో యాజమాన్యం నిర్వహిస్తోంది.

కాగా.. సర్టిఫికెట్ల కోసం వచ్చిన ఆమెపై మద్యం సేవించిన కార్మికుడు నిర్మానుష్య ప్రాంతంలో దాడికి యత్నించాడు. ఇది గమనించిన పశువుల కాపరులు(మహిళలు).. ఆమెను రక్షించి తీసుకువెళ్లారు. కళాశాల సిబ్బంది ఫిర్యాదుతో భీమిలి పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆమెను భీమిలి స్టేషన్‌కు తరలించి.. ఆమెతో పాటు స్థానికులను విచారించారు. వారు చెప్పిన వివరాలతో దాకమర్రి, బోడమెట్టపాలెం పరిసర ప్రాంతాల్లోని ఫ్లైవుడ్‌ ఫ్యాక్టరీల్లో గాలించి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. భీమిలి సీఐ డి.రమేష్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement