ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ ఇంజనీరింగ్ కళాశాలలో గతంలో ఎన్నడూలేని విధంగా ఈ విద్యా సంవత్సరం ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం సీట్లు ఖాళీ అవుతున్నాయి.
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ ఇంజనీరింగ్ కళాశాలలో గతంలో ఎన్నడూలేని విధంగా ఈ విద్యా సంవత్సరం ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం సీట్లు ఖాళీ అవుతున్నాయి. అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న ఈ క్యాంపస్ ఇంజనీరింగ్ కళాశాలకు ఎంసెట్‌లో టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు తొలి ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ ఈ విద్యా సంవత్సరం సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్, బయో మెడిసిన్ విభాగాలలో సుమారు 42 సీట్లు ఖాళీ అయ్యాయి.
ఐఐటీ, ఇతర కేంద్రస్థాయి విద్యా సంస్థల్లో సీట్లు సాధించడంతో విద్యార్థులు వలస వెళ్తున్నారని ఇన్‌చార్జి ప్రిన్సిపల్ ప్రొ.రామచంద్రం తెలి పారు. ఓయూ ఇంజనీరింగ్ కాలేజీలో ఖాళీ అవుతున్న సీట్లను వృథాగా వదిలేయోద్దని, ప్రభుత్వం వెంటనే స్పందించి వీటికి స్పాట్ అడ్మిషన్లు నిర్వహించాలని వివిధ విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.