ఇంజనీరింగ్‌ కాలేజ్‌లో అగ్ని ప్రమాదం | Fire Accident At Saveetha Engineering College Chennai | Sakshi
Sakshi News home page

సవిత ఇంజనీరింగ్‌ కాలేజ్‌లో భారీ అగ్ని ప్రమాదం

Published Fri, Feb 22 2019 10:42 AM | Last Updated on Fri, Jul 12 2019 3:37 PM

Fire Accident At Saveetha Engineering College Chennai - Sakshi

చెన్నై: నగర శివార్లలో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. తండలంలోని సవిత ఇంజనీరింగ్‌ కళాశాల ఆవరణలోని బాయ్స్‌ హాస్టల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. హాస్టల్‌ బిల్డింగ్‌ మొత్తం ఎనిమిది అంతస్తులు ఉండగా.. నాలుగో అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో హాస్టల్‌ గదులు పూర్తిగా దగ్దమయ్యాయి. ఉదయం 5 గంటలకు జరిగిన ఈ ప్రమాదం నుంచి విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు.  ఈ హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థుల్లో తెలుగువారే అధికం. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement