సాక్షి, రంగారెడ్డి: బైక్‌పై వెళ్తున్న ఇద్దరు బీటెక్ విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. ఈ ఘటన అబ్బులపూర్ మేట్ మండలం కవాడి పల్లిలో చోటుచేసుకుంది. ప్రమాదంలో చనిపోయిన వారు విజ్ఞాన్ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన బీటెక్ విద్యార్థులని తెలుస్తోంది. మృతులు వైష్ణవి(సీఎస్‌సీ థర్డ్ ఈయర్) లోకేష్( సెకండ్ ఈయర్)గా గుర్తించారు.
ఎదురుగా వస్తున్న ఆటోను, టిప్పర్ తప్పించబోయి ప్రమాదానికి గురైనట్లు సమాచారం. తీవ్రగాయాలైన విద్యార్థులు ఘటన స్థలంలోని మృతిచెందారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, తోటి విద్యార్థులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాలను పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment