తిరువొత్తియూరు: చైన్నె సమీపంలోని పూందమల్లి – ఆవడి రోడ్డులో ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాల నడుస్తోంది. ఇక్కడ చాలా మంది విద్యార్థులు చదువుతున్నారు. తమిళనాడులోని పలు జిల్లాలకు చెందిన 1000 మందికి పైగా విద్యార్థులు ఈ కళాశాల హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నారు. యథావిధిగా ఆదివారం రాత్రి విద్యార్థులకు భోజనం వడ్డించారు.
అయితే ఆ ఆహారం తిన్న 30 మందికి పైగా విద్యార్థులు ఒక్కసారిగా వాంతులు చేసుకుంటూ స్పృహతప్పి పడిపోయారు. బాధితులను వెంటనే కళాశాల నిర్వాహకులు రక్షించి పోరూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. తిరువేర్కాడు పోలీసుల చేపట్టిన దర్యాప్తులో బల్లి పడిన ఆహారం తిని విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు తేలింది. అలాగే పూందమల్లి రెవెన్యూ శాఖ, ఆహార భద్రత విభాగం అధికారులు కూడా కళాశాల క్యాంపస్‌కు వెళ్లి సమస్యకు గల కారణాన్ని అన్వేషించే పనిలో పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment